pizza

Power Star Pawan Kalyan Watched Boss Party Song On The Set Of Megastar Chiranjeevi, Bobby Kolli, Mythri Movie Makers Waltair Veerayya
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్‌ 'వాల్తేర్ వీరయ్య' సెట్ లో బాస్ పార్టీ సాంగ్ వీక్షించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

You are at idlebrain.com > news today >
Follow Us

22 November 2022
Hyderabad

The makers of megastar Chiranjeevi’s crazy project Waltair Veerayya directed by Bobby Kolli (KS Ravindra) got a special guest on the set of the movie in Hyderabad. Power Star Pawan Kalyan visited the sets along with his Hari Hara Veera Mallu director Krish and producer AM Ratnam.

Pawan Kalyan watched the song Boss Party which will be released officially tomorrow and loved it completely. Director Bobby Kolli is in ecstasy and it’s a moment to be cherished forever for him.

“A Huge moment to be Cherished forever 🥳 My 2 Most favorite persons Megastar @KChiruTweets garu & Power Star @PawanKalyan garu by my side 🤩 Kalyan garu has seen #BossParty song & he loved it.,Such a Positive person with same love even after all these years. ❤️#WaltairVeerayya ,” tweeted Bobby.

The director also shared pictures of Pawan Kalyan visiting the shooting spot and watching the song. The promo of the song was unveiled today and it was well-received. Fans have been waiting keenly for the mass number scored by Devi Sri Prasad.

Boss Party will star Urvashi Rautela shaking her leg opposite Chiranjeevi. Sekhar master did the choreography for the song that was crooned by DSP along with Nakash Aziz and Haripriya. DSP also penned lyrics for the song.

Mass Maharaja Ravi Teja is playing a mighty role in the film, where Shruti Haasan will be seen as the leading lady opposite Chiranjeevi. Billed to be a mass-action entertainer laced with all the commercial ingredients, the film is produced on a grand scale by Naveen Yerneni and Y Ravi Shankar of Mythri Movie Makers, while GK Mohan is the co-producer.

Arthur A Wilson cranks the camera, whereas Niranjan Devaramane is the editor and AS Prakash is the production designer. Sushmita Konidela is the costume designer.

While the story and dialogue were written by Bobby himself, Kona Venkat and K Chakravarthy Reddy penned the screenplay. The writing department also includes Hari Mohana Krishna and Vineeth Potluri.

Waltair Veerayya will be hitting the screens for Sankranthi, 2023.

Cast: Chiranjeevi, Ravi Teja, Shruti Haasan and others.

Technical Crew:
Story, Dialogues, Direction: KS Ravindra (Bobby Kolli)
Producers: Naveen Yerneni and Y Ravi Shankar
Banner: Mythri Movie Makers
Music Director: Devi Sri Prasad
DOP: Arthur A Wilson
Editor: Niranjan Devaramane
Production Designer: AS Prakash
Co-Producers: GK Mohan, Praveen M
Screenplay: Kona Venkat, K Chakravarthy Reddy
Additional Writing: Hari Mohana Krishna, Vineeth Potluri
CEO: Cherry
Costume Designer: Sushmita Konidela

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్‌ 'వాల్తేర్ వీరయ్య' సెట్ లో బాస్ పార్టీ సాంగ్ వీక్షించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్ 'వాల్తేర్ వీరయ్య'. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెట్ లోకి ప్రత్యేక అతిథి విచ్చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లు చిత్ర దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎమ్ రత్నంతో కలిసి హైదరాబాద్ లోని సెట్స్‌ను సందర్శించారు.

రేపు అధికారికంగా విడుదల కానున్న బాస్ పార్టీ పాటను చూసి ఆనందించారు పవన్ కళ్యాణ్. దర్శకుడు బాబీ కొల్లి ఈ మెగా మూమెంట్ పై గొప్ప సంతోషాన్ని వ్యక్తం చేశారు.

“ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకునే గొప్ప క్షణం. నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పక్కనే వున్నాను. కళ్యాణ్ గారు బాస్ పార్టీ పాటను చూశారు. కళ్యాణ్ గారికి చాలా నచ్చింది. ఆయన గొప్ప పాజిటివ్ పర్శన్, ఎన్నేళ్ళు గడిచినా అదే ప్రేమ వాత్సల్యం” అని ట్వీట్ చేశారు బాబీ.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్‌ కి వెళ్లి పాటను చూస్తున్న ఫోటోలని షేర్ చేశారు దర్శకుడు బాబీ. ఈరోజు విడుదలైన ఈ పాట ప్రోమోకు మంచి ఆదరణ లభించింది. దేవి శ్రీ ప్రసాద్ చేసిన మాస్ నంబర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బాస్ పార్టీలో చిరంజీవి సరసన ఊర్వశి రౌతేలా సందడి చేయబోతుంది. నకాష్ అజీజ్, హరిప్రియతో కలిసి డీఎస్పీ పాడిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. డీఎస్పీ పాటకు సాహిత్యం కూడా రాశారు.

ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత.

ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా , నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు.

సాంకేతిక విభాగం:
కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
సిఈవో: చెర్రీ
కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved