pizza

Mass Number From Megastar Chiranjeevi, Urvashi Rautela’s Waltair Veerayya To Be Out This Week
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ 'వాల్తేరు వీరయ్య' ఫస్ట్ సింగల్ ఈ వారం విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

13 November 2022
Hyderabad

The reunion of '80s actors, which is an annual get-together event, specifically for the 80s stars, has taken place after a gap of three years. Megastar Chiranjeevi hosted the 10th reunion event at his residence In Hyderabad in 2019 with over 40 stars from different south industries in attendance, and the subsequent get-together events had to be called off due to COVID-19 scare.

This time around though, Poonam Dhillon and Jackie Shroff hosted the event in Mumbai while extending invitations to some of their Bollywood colleagues as well.

The likes of Chiranjeevi, Venkatesh, Bhagyaraj, Sarath Kumar, Naresh, Arjun, Bhanuchander, Sushasini, Khusboo, Ramya Krishnan, Lissy, Poornima, Saritha, Ambika, Radha, Shobana, Nadia, Revathy, Sumalatha, Menaka, Meenakshi Seshadri, Madhoo and Padmini attended the do from the South, while Raj Babbar, Sunny Deol, Sanjay Dutt, Anil Kapoor, Anupam Kher, Tima Ambani and Vidya Balan represented Bollywood. Superstars Rajinikanth, Kamal Haasan, Mammootty, Mohanlal, Balakrishna and Nagarjuna, however, couldn’t make it to this year’s party.

The theme for this year’s reunion was silver and orange for women and grey and orange for men, while the food was a spread of Maharashtrian delicacies.

As usual, the actors had a great time performing for medleys and reliving their past. Poonam even came up with some games and quiz, which had enthusiastic takers.

Suhasini Mani Ratnam and Lissy cracked the idea of reunion for ‘80s stars in 2009 and ever since it has become an annual ritual.

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ 'వాల్తేరు వీరయ్య' ఫస్ట్ సింగల్ ఈ వారం విడుదల

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ 'వాల్తేర్ వీరయ్య'. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్నారు. ఇద్దరు స్టార్స్‌ని కలిసి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా 'వాల్తేరు వీరయ్య' నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ఈ వారమే విడుదల కాబోతుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ సాంగ్ గురించి ట్వీట్ చేశారు. ''ఇప్పుడే 'వాల్తేరు వీరయ్య' ఫస్ట్ సాంగ్ ని చూశాను. మెగాస్టార్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ సింగల్ ఈ వారమే విదుదలౌతుంది. పార్టీకి సిద్ధంగా ఉండండి.. ఎందుకంటే ఇది బాస్ పార్టీ'' అని ట్వీట్ చేశారు.

వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి, గ్లామరస్ క్వీన్ ఊర్వశి రౌతేలా పై ఓ భారీ సెట్‌లో స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించారు. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఇదే పాటని ఈ వారం విడుదల చేస్తున్నారు మేకర్స్. చిరంజీవి- దేవిశ్రీ ప్రసాద్ లది చార్ట్ బస్టర్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ వచ్చిన చిత్రాలు మ్యజికల్ గా ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పుడు వాల్తేరు వీరయ్య' ఆల్బమ్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి.

ఇటివలే విడుదలైన 'వాల్తేరు వీరయ్య' టైటిల్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ వింటేజ్ అవాతర్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. చిరంజీవి బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైల్, గెటప్, మ్యానరిజమ్స్ మాస్ పూనకాలు తెప్పించింది.

అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు.

సాంకేతిక విభాగం:
కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
సిఈవో: చెర్రీ
కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల
లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved