`
pizza

Urvashi Rautela’s Special Song In Megastar Chiranjeevi, Mass Maharaja Ravi Teja, Bobby Kolli, Mythri Movie Makers Waltair Veerayya
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ 'వాల్తేర్ వీరయ్య'లో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్

You are at idlebrain.com > news today >
Follow Us

4 November 2022
Hyderabad

Megastar Chiranjeevi’s craziest project Waltair Veerayya directed by Bobby Kolli (KS Ravindra) will have all the elements one would expect in this deadly combination. The presence of mass maharaja Ravi Teja is one of the biggest attractions of the movie. It will have a mass number on both Chiranjeevi and Ravi Teja which was shot recently in Hyderabad.

What’s more, the movie will have a special song being shot on megastar Chiranjeevi and glamorous diva Urvashi Rautela in a huge set. Rockstar Devi Sri Prasad scored a foot-tapping number, while the top choreographer Sekhar master has done the choreography. Mythri Movie Makers who are known for their lavish production design are making the movie extravagantly. Every update regarding the movie is raising expectations. Surely, fans are going to have blast in cinemas.

The film stars Shruti Haasan playing the heroine opposite Chiranjeevi. Billed to be a mass-action entertainer laced with all the commercial ingredients, the film is produced on a grand scale by Naveen Yerneni and Y Ravi Shankar, while GK Mohan is the co-producer.

Arthur A Wilson cranks the camera, whereas Niranjan Devaramane is the editor and AS Prakash is the production designer. Sushmita Konidela is the costume designer.

While the story and dialogue were written by Bobby himself, Kona Venkat and K Chakravarthy Reddy penned the screenplay. The writing department also includes Hari Mohana Krishna and Vineeth Potluri.

Waltair Veerayya will be hitting the screens for Sankranthi, 2023.

Cast: Chiranjeevi, Ravi Teja, Shruti Haasan, Urvashi Rautela (special song) and others.

Technical Crew:
Story, Dialogues, Direction: KS Ravindra (Bobby Kolli)
Producers: Naveen Yerneni and Y Ravi Shankar
Banner: Mythri Movie Makers
Music Director: Devi Sri Prasad
DOP: Arthur A Wilson
Editor: Niranjan Devaramane
Production Designer: AS Prakash
Co-Producers: GK Mohan, Praveen M
Screenplay: Kona Venkat, K Chakravarthy Reddy
Additional Writing: Hari Mohana Krishna, Vineeth Potluri
CEO: Cherry
Costume Designer: Sushmita Konidela

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ 'వాల్తేర్ వీరయ్య'లో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ 'వాల్తేర్ వీరయ్య'. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. మాస్ మహారాజా రవితేజ ప్రజన్స్ సినిమాకు బిగ్గెస్ట్ ఎట్రాక్షన్. చిత్రంలో చిరంజీవి, రవితేజ ఇద్దరిపై మెగా మాస్ నంబర్‌ వుంది. ఈ పాటని ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరించారు

అంతేకాదు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, గ్లామరస్ క్వీన్ ఊర్వశి రౌతేలా పై భారీ సెట్‌లో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. దీనికోసం రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫుట్ ట్యాపింగ్ నంబర్‌ ను స్కోర్ చేయగా, టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. లావిష్ ప్రొడక్షన్ డిజైన్‌ కు పేరుపొందిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీగా రూపొందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ అంచనాలను పెంచుతోంది. తప్పకుండా సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు ఒక పండగలా వుంటుంది.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత.

ఆర్థర్ ఎ విల్సన్ కెమెరా మెన్ గా, నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌ లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, ఊర్వశి రౌతేలా (స్పెషల్ సాంగ్) తదితరులు.

సాంకేతిక విభాగం:

కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్

ఎడిటర్: నిరంజన్ దేవరమానే

ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్

సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం

స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి

ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి

సిఈవో: చెర్రీ

కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల

లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి

పబ్లిసిటీ: బాబా సాయి కుమార్

మార్కెటింగ్: ఫస్ట్ షో

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved