"Feeling a mixed bag of emotions as the cameras stopped rolling for #War2. 149 days of relentless chase, action, dance, blood, sweat, injuries... and it was all WORTH IT!
Tarak sir it has been an honor to work alongside you and create something so special together. Kiara Advani - I'm so excited for the world to witness the lethal side of you, you've been spectacular to share screen with. I cannot wait for you all to witness the incredible cinematic vision of Adi & Ayan!! To the entire cast & crew of War 2, Thank you for sharing your brilliance and giving it your all every single day.
Lastly, it's always bitter-sweet to call it a wrap for Kabir, it will take a couple of days to feel like myself again. Now onto the journey of presenting our film to you all on August 14th, 2025"
- Hrithik Roshan
తారక్ సార్.. మీతో పని చేయడం గౌరవంగా ఉంది.- హృతిక్ రోషన్
ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు హీరో హృతిక్ రోషన్ . సుదీర్ఘ ప్రయాణం లాంటి వార్ 2 సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే, అక్కడ ఆగిన కెమెరాలను చూసి ఎన్నో రకాల జ్ఞాపకాలు కళ్ళముందుకొచ్చాయన్నారు. 149 రోజుల నిరంతర యాక్షన్, చేజింగ్, డ్యాన్స్, రక్తం, వెచ్చించిన చెమట, గాయాలు అన్నీ గుర్తుకొచ్చినా అవన్నీ కష్టానికి తగ్గ ఫలితాల మాదిరే కనిపిస్తున్నాయన్నారు…
తారక్ తో కలిసి పనిచేయడం ఎంతో ప్రత్యేకమైనదని, తనతో కలసి వార్ 2 లో భాగస్వాముడు కావడం తనకెంతో గౌరవం అనిపించిందన్నారు. కియారా అద్వానీని తెరపై చూడటానికి అందరిలాగే తను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు. రైటర్ ఆదిత్య చోప్రా మరియు దర్శకుడు అయాన్ ముఖర్జీ ల అద్వితీయమైన సినీమాటిక్ విజన్‌ను అందరూ చూడబోతున్నారని, ఆ క్షణం కోసం తను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నానన్నారు. వార్ 2 సినిమాకు పనిచేసిన కాస్ట్ & క్రూ అందరూ ఎంతో కష్టపడి పని చేశారని చెప్తూ, వాళ్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాలో తన కబీర్ పాత్ర నుండి బయటకు రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుందన్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 14, 2025 న రాబోతుందన్నారు.