pizza

Naga Vamsi's ₹80–90 Cr investment in ‘War 2’ excites NTR fans
80 నుండి 90 కోట్లతో కొన్న నాగ వంశీ 'వార్ 2' వార్ వన్ సైడ్ చేస్తారా?

You are at idlebrain.com > news today >

05 July 2025
Hyderabad

Naga Vamsi is all set to release ‘War 2’ in the Telugu states, having reportedly acquired the theatrical rights for a massive ₹80 to ₹90 crore. He will be releasing the film in both Hindi and Telugu versions across Andhra Pradesh and Telangana. Notably, Naga Vamsi had previously released ‘Devara’ as well. Despite the film facing initial negative talk, he skillfully stabilized its run and turned it into a success.

Coming to War 2, it is being produced by the prestigious Yash Raj Films, known for their top-tier, corporate-style promotions. However, such promotional styles often don’t connect with Telugu audiences. Recognizing this, Naga Vamsi is planning to promote War 2 in a manner that appeals to the Telugu audience.

The film is also significant for another reason: it marks Jr NTR’s first straight Hindi film. No top Telugu hero in the past 25–30 years has done a direct Hindi film, which makes the rights for this movie without a clear benchmark. This deal sets a new standard for Telugu theatrical rights for Hindi films starring Telugu actors.

Naga Vamsi enjoys immense trust from NTR fans, as he himself is a self-confessed fan of the star. His passionate promotion of Devara is still remembered. Interestingly, War 2 shares its release date - August 14 - with another major dubbed release, ‘Coolie’, which already has significant buzz. Directed by Lokesh Kanagaraj, Coolie stars Rajinikanth (Tamil), Nagarjuna (Telugu), Aamir Khan (Hindi), Soubin Shahir (Malayalam), and Upendra (Kannada) - making it a massive pan-Indian spectacle.

Now, with two major films clashing, Naga Vamsi is going all in with War 2. Let’s hope the film becomes a big hit and brings great profits to him.

80 నుండి 90 కోట్లతో కొన్న నాగ వంశీ 'వార్ 2' వార్ వన్ సైడ్ చేస్తారా?

'వార్ 2' సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నాగ వంశీ రిలీజ్ చేయబోతున్నారు. దీని హక్కులను 80 నుండి 90 కోట్లను చెల్లించి పొందినట్టు సమాచారం. ఈ సినిమాను తెలుగు మరియు హిందీ భాషల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో నాగవంశీ విడుదల చేయబోతున్నారు. గతంలో 'దేవర' సినిమాను కూడా నాగవంశీనే విడుదల చేశారు. ఆ సినిమాకు మొదట్లో నెగటివ్ టాక్ వచ్చినా ఎంతో చాకచక్యంతో స్టెబిలైజ్ చేసి ఆ సినిమాను హిట్ చేసిన అనుభవం ఆయనది.

ఇక వార్2 సినిమాకు వస్తే, ఇది ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న సినిమా కావడంతో, వాళ్ళ ప్రమోషన్లు అన్నీ కూడా కార్పొరేట్ స్థాయిలోనే నడుస్తాయి. అవి తెలుగు వారికి నచ్చవు కూడా. వార్ 2 ను తెలుగు వారికి నచ్చే విధంగా ప్రమోట్ చేస్తున్నారు నాగ వంశీ. ఎన్టీఆర్ నటించిన స్ట్రెయిట్ హిందీ సినిమా కావడంతో, గత 25 నుండి 30 సంవత్సరాలుగా ఏ తెలుగు అగ్ర హీరో కూడా స్ట్రెయిట్ హిందీ సినిమాలో నటించకపోవడంతో, దాంతో తెలుగు హక్కులకు ఇంత అని చెప్పడానికి అంటూ బెంచ్ మార్క్ లేదన్న విషయాన్ని ఈ సినిమా చెబుతోంది.

ఎన్టీఆర్ అభిమానులకు నాగవంశీ అంటే ఎంతో నమ్మకం. ఎందుకంటే ఆయన స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని కాబట్టి. దేవరను కూడా బాగా ప్రమోట్ చేశారన్న విషయం అందరికీ తెలిసిందే. అదే రిలీజ్ డేట్ ఆగస్టు 14 న ఇంకొక డబ్బింగ్ సినిమా 'కూలీ' రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాకు కూడా చాలా క్రేజ్ ఉంది. దానికి ముఖ్య కారణం ఆ సినిమాకు దర్శకుడు లోకేష్ కనకరాజ్. 'కూలీ' సినిమాలో రజినీ కాంత్(తమిళం), నాగార్జున (తెలుగు), అమీర్ ఖాన్(హిందీ), సౌబీన్ షాహిర్(మలయాళం), ఉపేంద్ర(కన్నడ) లాంటి సౌత్ ఇండియన్ అన్ని భాషలు మరియు హిందీ నటులు కూడా ఉండటంలో ఆ సినిమాకు కూడా చాలా క్రేజ్ ఉంది. నాగ వంశీ వార్ 2 తో తలబడుతున్నాడు. వార్ 2 మంచి హిట్ అయి, నాగ వంశీకు లాభాలు రావాలని కోరుకుందాం

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved