pizza

Samantha interview about Yashoda
నేను మొండి... ప్రాణం పెట్టి 'యశోద' చేశా... అందుకే సెలైన్ బాటిల్ పెట్టుకుని మరీ డబ్బింగ్ చెప్పా - సమంత ఇంటర్వ్యూ

You are at idlebrain.com > news today >
Follow Us

8 November 2022
Hyderabad

How is ur health now?
Thank you for asking. I am on the path to recovering. Hopefully things will be better soon. At the moment, I am taking it one day at a time. And today, I am excited about the release of Yashoda.

How do you feel about the amazing response for the teaser and trailer of Yashoda?
I am excited. Maybe there is a little bit of nervousness also. But what we put out there as trailers and teasers are the true and authentic glimpse into the movie. And that has been received so well, I am positive that the audience will love the movie as well.

What was your first reaction when you heard Yashoda? Was it an immediate “Yes” or you took time to think about it?
Yashoda was one of those stories and character that I almost immediately wanted to do. I usually take a day to okay any script but Yashoda was one script I okayed immediately as the story is just so powerful, and there wasn’t so much overthinking on this one. It gave me chills, goosebumps, you know. And I could see how that’s what this movie has the power to do to the audiences as well. The directors Hari and harish have really brought out a very new concept.

How different is modern Yashoda (the one you play in the film) from the ones in our puranas?
Let’s say that they are both mothers and women, who inadvertently become saviour of many.

You all know the story of Yashoda, who raises Lord Krishna; after watching the movie, you will understand this character Yashoda and hopefully agree with what I am saying.

Surrogacy has come to fore in the recent times. What is your opinion on surrogacy?
I really don’t have a strong opinion on surrogacy. I understand it as a solution, or even hope, for many people who want to be parents. And that’s what it is for me.

In our mythology, we have stories of Gods gifting babies to childless parents. Would you say the modern medical tech such as surrogacy, of IVF is something similar…
That’s an interesting metaphor. Yeah, you could perhaps say that!

The trailer not only touches upon surrogacy, but also drops hints on surrogacy, crime and something to do with rich women. Can you tell us anything more about the movie?
If I reveal anything else, I will be ruining the movie viewing experience. Let’s just say it’s a thriller… a damn good one… And all of the technicians have put in their art to ensure it’s an edge-of-the-seat watch. From the way the directors have written and executed the screenplay, the fights, the art/set and the music - you should really go watch it and enjoy it on the big screen.

You have worked in different genres. How excited were you to have an action thriller this time?
When I am listening to stories or on the look out for my next character, I ensure that I am getting into something different every time. And the closest I have done to Yashoda before may be U-Turn, which is also a thriller. But Yashoda - I assure you - is a completely new ballgame. And in terms of action, I have come to enjoy action really. Raji in Family Man was the first time I did action. And to be honest, doing action is quite exhilarating.

Was there any special training you took for action scenes in Yashoda. Though you have done action before it was not so intense before right?
So, I and action director/stunt Yannick Ben worked together first on Family Man. So I did train in Boxing and kickboxing while prepping for that role. Having said that, performing any action requires a lot of practice and rehearsals. Also, in Yashoda, I was playing a pregnant character and she is a simple girl. So the action was designed to suit that specific character. Both Yannick and Venkat ensured that the fights were raw and real, but tailored it to suit the character. And so I had to get into that role while doing action as well. So yea, a lot of prep.

Varalakshmi Sarathkumar, Unni Mukundan, Rao Ramesh, Murali Sharma, Sampath Raj - the movie has fully packed cast. How was it to work with all of them? You know a couple of them from before, right?
It was wonderful to be working with all these actors. It is nice to be around such experienced people as we get to learn from them. Like each language actor has some small quirks that are interesting to pick up from. The way a Malayalam actor delivers his dialogue is different from the way a Telugu actor would. So working with such an ensemble cast was very interesting as I learnt so much too.

Looking at the trailer we get to know there are some brilliant visuals, the production values look rich as well. Would you say that the producer Krishna Prasad garu went all out to ensure that the movie got the best of everything?
Definitely. For the facility you see in the film, they considered a lot of local hotels and hospitals but as nothing seemed fit, they constructed a huge set. The producer ensured that the movie looked great and that the final output would be grand.

Was the story pitched as a pan India project from the beginning or was it a decision that came about as the project progressed?
See, the story - for what it is - is a story of great emotion as well as a movie that is sure to keep the audiences engaging. And that potential we all could see from the beginning. But as the movie took shape, we became more and more confident that it will work across the languages because of the movie’s emotional core. And so it became what it is today - a five language movie. But “pan-Indian” is what audience and media is calling it. And fingers crossed, it will be a “pan Indian” hit too.

Have you been keeping track of the responses of audiences from Tamil, Malayalam, Kannada and Hindi?
Yes! And to be honest, I have been overwhelmed by the responses across the board. There are obviously differences in micro trends or what people like in different languages, based on their tastes and viewing patterns - which is also quite interesting to see.

I really do have to thank all my colleagues from across the industry, who helped push the trailer as well - Vijay Devarakonda, Dulquar, Rakshit Shetty, and Varun. That meant a lot, you know, to have that kind of support. This helped a lot too to create that extra push across languages.

You have dubbed for the film with what seems like an IV drip. What made you do this, while there was always an option to get it dubbed by someone else?
I had made up my mind to dub for this movie. And once I had committed to that, I had to see it through. I feel when an actor puts their heart into a character, they would want to be the voice for it too. I am stubborn like that. But I am glad that I was able to do it, despite it being challenging.

Which is the other character in Yashoda apart from you that you liked the most?
I would have to say Varu’s. That character has such an amazing arc. If I say anything more, it would be a spoiler. But, you will understand why once you have seen the movie.

What do you want your fans to know about your health condition?
Thank you all for the support, love and prayers you have been showering on me. I am on the path to recovery. It’s a battle. But it’s a battle that you all are making worth fighting for.

నేను మొండి... ప్రాణం పెట్టి 'యశోద' చేశా... అందుకే సెలైన్ బాటిల్ పెట్టుకుని మరీ డబ్బింగ్ చెప్పా - సమంత ఇంటర్వ్యూ

'యశోద'లో సమంత భావోద్వేగభరిత పాత్ర చేశారు. తనకు ఎదురైన పరిస్థితుల నుంచి బయట పడటం కోసం పోరాటం చేసే మహిళగా కనిపించనున్నారు. రియల్ లైఫ్‌లో కూడా సమంత ఫైటర్. మయోసైటిస్‌తో పోరాటం చేస్తూ, చికిత్స (సెలైన్) తీసుకుంటూ 'యశోద' డబ్బింగ్ పూర్తి చేశారు. హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సినిమాతో పాటు తన ఆరోగ్య పరిస్థితి గురించి సమంత మాట్లాడారు. సమంతతో ఇంటర్వ్యూ...

హాయ్ సమంత గారు... ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?
థాంక్యూ... ఈ మాట అడిగినందుకు! ఇప్పుడు నేను రికవరీ అవుతున్నాను. త్వరలో పరిస్థితులు మెరుగు అవుతాయని ఆశిస్తున్నాను. ఈ క్షణం, నేను ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఈ రోజు 'యశోద' విడుదల గురించి ఎగ్జైట్ అవుతున్నాను.

మీ ఆరోగ్యం గురించి చాలా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు?
అవును... నేనూ చాలా ఆర్టికల్స్ చూశాను. అయితే... ప్రస్తుతానికి నేను చావలేదు (నవ్వులు). ఆ హెడ్డింగ్స్ అప్రస్తుతం. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఫైట్ చేస్తున్నాను. నేను ఉన్న పరిస్థితిలో అది అంత ప్రాణాంతకం ఏమీ కాదు.

ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం మీకు ఎక్కడ నుంచి వస్తోంది?
సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు... కొన్ని మంచి రోజులు ఉంటాయి. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఒక్కోరోజు ఇంకొక్క అడుగు కూడా ముందు వేయలేనేమో అనిపిస్తోంది. కొన్ని రోజులు వెనక్కి తిరిగి వస్తుంటే ఇంత దూరం వచ్చానా? అనిపిస్తోంది. (సమాధానం చెబుతూ సమంత భావోద్వేగానికి లోనయ్యారు) చాలా మంది ఎన్నో సవాళ్లతో యుద్ధం చేస్తున్నారు. అంతిమంగా మనమే విజయం సాధిస్తాం.

కమింగ్ టు యశోద... టీజర్, ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది?
చాలా సంతోషంగా ఉంది. ఎగ్జైట్ అయ్యాను. అదే సమయంలో కొంచెం నెర్వస్ కూడా ఉంది. టీజర్, ట్రైలర్లో మేము చూపించినది నిజమే. సినిమాలో ఏం ఉందో అదే చూపించాం. ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్లకు టీజర్, ట్రైలర్ నచ్చాయి. సినిమా కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను.

'యశోద' అంటే ముందుగా గుర్తు వచ్చేది ఏంటి? కథ చెప్పినప్పుడు వెంటనే ఓకే చేశారా? లేదంటే ఆలోచించారా?
సాధారణంగా నేను ఏదైనా స్క్రిప్ట్ ఓకే చేయడానికి ఒక రోజు సమయం తీసుకుంటా. కానీ, 'యశోద' వెంటనే ఓకే చేశా. నేను విన్న వెంటనే ఓకే చేసేసిన కథల్లో 'యశోద' ఒకటి. 'యశోద' క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. పవర్ ఫుల్ స్టోరీ ఇది. అందుకని, ఎక్కువగా ఆలోచించడానికి ఏమీ లేదు. కథ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. థ్రిల్ అయ్యాను. ప్రేక్షకులు కూడా అదే విధంగా థ్రిల్ అవుతారని, వాళ్ళకూ గూస్ బంప్స్ వస్తాయని ఆశిస్తున్నాను. సినిమాలో అంత పవర్ ఉంది. దర్శకులు హరి, హరీష్ కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

పురాణాల్లో 'యశోద' గురించి విన్నాం. మోడ్రన్ 'యశోద' ఎలా ఉంటుంది?
ఇద్దరూ మహిళలే. ఇద్దరూ అమ్మలే. చాలా మందిని రక్షించారు. ప్రేక్షకులకు శ్రీ కృష్ణుడిని పెంచిన 'యశోద' గురించి తెలుసు. పురాణాలపై అందరికీ అవగాహన ఉంది. మా సినిమా చూసిన తర్వాత 'యశోద' క్యారెక్టర్ గురించి అర్థం అవుతుంది. నేను చెప్పే విషయాన్ని అందరూ అంగీకరిస్తారని నమ్మకం ఉంది.

ఇప్పుడు సరోగసీ అనేది కామన్ అయ్యింది. సరోగసీ మీద మీ అభిప్రాయం?
సరోగసీ మీద నాకు బలమైన అభిప్రాయం లేదు. తల్లిదండ్రులు కావాలని అనుకునే వాళ్ళకు అదొక పరిష్కారం మాత్రమే. వాళ్ళ ఆశలకు ఆయువు పోస్తుంది.

సినిమాలో సరోగసీ మాత్రమే కాదని, ఇంకా పాలిటిక్స్, వరల్డ్ రిచ్ విమెన్ ఇష్యూస్ ఉన్నాయని తెలుస్తోంది. కథ గురించి ఇంకొంచెం చెబుతారా?
కథ గురించి నేను ఇంకేమైనా చెప్పానంటే... సినిమా చూసేటప్పుడు థ్రిల్ మిస్ అవుతారు. 'యశోద' ఒక మంచి థ్రిల్లర్. థియేటర్లో చూసేటప్పుడు తర్వాత ఏం జరుగుతుందోనని కుర్చీ అంచుకు వచ్చేస్తారు. దర్శకులు కథ, స్క్రీన్ ప్లే రాసిన విధానం... స్క్రీన్ మీదకు తీసుకు వచ్చిన తీరు... ఫైట్స్, సెట్స్, ఆర్ట్ వర్క్, మ్యూజిక్... ప్రతిదీ సూపర్. తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన చిత్రమిది. వెండితెరపై ఎంజాయ్ చేయాలి.

మీరు డిఫరెంట్ జానర్ సినిమాలు చేశారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేయడంలో ఉండే థ్రిల్ ఏమిటి?
కథలు వినేటప్పుడు గానీ... తర్వాత సినిమాలో క్యారెక్టర్ విషయంలో గానీ... ఇంతకు ముందు చేసిన దానికి డిఫరెంట్‌గా, కొత్తగా ఉండాలని ప్రతిసారీ ఆలోచిస్తాను. అలా ఉండేలా చూస్తాను. 'యశోద' కంటే ముందు 'యు - టర్న్' చేశా. అది కూడా థ్రిల్లర్. కానీ, 'యశోద' చాలా కొత్తగా ఉంటుంది. యాక్షన్ పరంగా కూడా కొత్తగా ఉంటుంది. యాక్షన్ చేయడం ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో రాజీ రోల్ కోసం యాక్షన్ చేశా. నిజం చెప్పాలంటే... యాక్షన్ చేసేటప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను.

యాక్షన్ సీన్స్ కోసం మీరు ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు? యాక్షన్ చేయడం ఎలా అనిపించింది? ఇంతకు ముందు మీరు యాక్షన్ చేసినా... ఈ రేంజ్ హార్డ్ కోర్ ఫైట్స్ చేయలేదనుకుంట కదా!
యానిక్ బెన్ తో 'ఫ్యామిలీ మ్యాన్ 2'కి పని చేశా. ఆ క్యారెక్టర్ కోసం కిక్ బాక్సింగ్, బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. 'యశోద'లో నేను సింపుల్ ప్రెగ్నెంట్ లేడీగా చేశా. ఆ పాత్రకు తగ్గట్టు యాక్షన్ డిజైన్ చేశారు యానిక్ బెన్, వెంకట్ మాస్టర్... ఇద్దరూ ఫైట్స్ అన్నీ రా అండ్ రియల్ గా ఉండేలా చూసుకున్నారు. అదే సమయంలో పాత్రకు తగ్గట్టు ఉండేలా చూశారు. చాలా ప్రిపేర్ అయ్యాను.

వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్... సినిమాలో భారీ తారాగణం ఉంది. సెట్స్ లో అందరూ కలిసినప్పుడు ఎలా ఉండేది. ఇందులో కొంత మందితో మీరు ముందు కూడా నటించారు కదా!
సినిమాలో నటీనటులు అందరితో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్. మన చుట్టూ ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. 'యశోద'లో వివిధ భాషల నటీనటులు ఉన్నారు. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకునే విషయం ఒకటి ఉంది. మలయాళం యాక్టర్ డైలాగ్ చెప్పే విధానం, తెలుగు యాక్టర్లు చెప్పే విధానానికి వేరుగా ఉంటుంది. అంత మందితో కలిసి నటించడం ఆసక్తికరంగా అనిపించింది. వాళ్ళందరి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.

ట్రైలర్ విజువల్స్ చూస్తే ప్రొడక్షన్ వేల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారితో మీ అనుబంధం...
సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ కోసం లోకల్ హోటల్స్, హాస్పిటల్స్ చాలా చూశారు. కానీ, ఏవీ సెట్ కాలేదు. దాంతో భారీ సెట్ వేశారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారు సినిమా గొప్పగా ఉండాలని ఎప్పుడూ తపిస్తారు. అవుట్‌పుట్ గ్రాండ్‌గా ఉండాలని ఖర్చుకు వెనుకాడకుండా తీశారు.

పాన్ ఇండియా రిలీజ్ ఆలోచనతో కథ మీ దగ్గరకు వచ్చిందా? లేదంటే...
కథ చూస్తే... కథలో, సినిమాలో గొప్ప ఎమోషన్ ఉంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా సినిమా ఉంటుందని అర్థమైంది. బిగినింగ్ నుంచి కథలో పొటెన్షియల్ ఉందని మాకు అర్థమైంది. షూటింగ్ చేసేటప్పుడు మా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఎమోషనల్ పాయింట్ కావడంతో అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని, అందరికీ నచ్చుతుందని అనుకున్నాం. ఇప్పుడు ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు, మీడియా 'పాన్ ఇండియా' అంటున్నారు. పాన్ ఇండియా హిట్ అవుతుందని ఆశిస్తున్నా.

తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల నుంచి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? తెలుసుకుంటున్నారా?
నిజం చెప్పాలంటే... అన్ని భాషల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. డిఫరెన్స్ ఏంటంటే... మైక్రో ట్రెండ్స్. ఒక్కో భాషలో ప్రేక్షకులకు ఒక్కో అంశం నచ్చుతుంది. వాళ్ళ అభిరుచులు కొంచెం వేరుగా ఉంటాయి. అందుకని, ఎవరికి ఏం నచ్చిందో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రక్షిత్ శెట్టి, సూర్య, వరుణ్ ధావన్... ట్రైలర్ విడుదల చేసిన హీరోలు అందరికీ థాంక్స్. వాళ్ళ సపోర్ట్ వల్ల అన్ని భాషల్లో ప్రేక్షకులకు ట్రైలర్ మరింత చేరువ అయ్యింది.

సెలైన్ బాటిల్ తో డబ్బింగ్ చెప్పారు. వేరొకరితో డబ్బింగ్ చెప్పించే అవకాశం ఉన్నప్పటికీ... మీరే డబ్బింగ్ చెప్పడానికి కారణం?
'యశోద'కు డబ్బింగ్ చెప్పాలని ముందు నుంచి డిసైడ్ అయ్యాను. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే... చేయాల్సిందే. ఓ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ ప్రాణం పెట్టారంటే... వాళ్ళే డబ్బింగ్ చెప్పాలని కోరుకుంటారు. తమ వాయిస్ వినిపించాలని అనుకుంటారు. నేను ఇంతే... నాలో ఆ పట్టుదల ఉంది. నాకు మొండితనం ఎక్కువ. సవాళ్లు ఎదురైనప్పటికీ డబ్బింగ్ చెప్పగలిగినందుకు సంతోషంగా ఉంది.

'యశోద'లో మీ క్యారెక్టర్ కాకుండా మీకు బాగా నచ్చింది రోల్?
వరలక్ష్మీ శరత్ కుమార్ క్యారెక్టర్. సినిమా చూస్తే నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానో అర్థం అవుతుంది. ఇంతకు మించి ఏమైనా చెబితే స్పాయిలర్ అవుతుంది.

ప్రజెంట్ మీ హెల్త్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. అభిమానులకు ఏం చెబుతారు?
వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, మద్దతుకు థాంక్స్. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. ఇదొక యుద్ధం. ఆ యుద్ధంలో పోరాటం చేయడానికి మీరందరూ చూపిస్తున్న ప్రేమ, మద్దతే కారణం.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved