pizza

YVS announces his new heroine
మహిళా శక్తిగా ఎదిగిన సుప్రియ, స్వప్న చేతుల మీదుగా నేను కథానాయికగా పరిచయం చేస్తున్న తెలుగు అమ్మాయి వీణారావు ఫస్ట్ దర్శన్ ని లాంచ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను: డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి

You are at idlebrain.com > news today >

30 November 2024
Hyderabad

తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, లెజెండరీ శ్రీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని “న్యూ టాలెంట్ రోర్స్ @” బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన నందమూరి తారక రామారావు ఫస్ట్ దర్శన్ కి వరల్డ్ వైడ్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం ద్వారా ప్రతిభావంతులైన కూచిపూడి డ్యాన్సర్, తెలుగు అమ్మాయి వీణారావు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ రోజు వీణారావు ఫస్ట్ దర్శన్ ని నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, స్వప్న దత్ లాంచ్ చేశారు.

అచ్చతెలుగు అందాలరాశి వీణారావు ఫస్ట్ దర్శన్ అందరినీ మెస్మరైజ్ చేసింది. ఫస్ట్ దర్శన్ షో రీల్ లో ట్రెడిషనల్, మోడ్రన్ అవుట్ ఫిట్స్ లో వీణారావు డిఫరెంట్ బ్యూటీఫుల్ లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన షో రీల్ గ్లింప్స్ అందరినీ అలరించింది. 'కథలు, సన్నివేశాలు, పాత్రలకు అనుగుణంగా నటించి ప్రేక్షకుల్ని రంజింప చేయడంలో తన వంతు నిరంతర కృషి చేస్తానని, తన అభిమాన నటి డాక్టర్ పి భానుమతి రామకృష్ణ గారి సాక్షిగా ప్రమాణం చేశారు వీణారావు.

డైరెక్టర్ వైవీఎస్ చౌదరి వద్ద గత 18 నెలల అన్ని విభాగాల్లో శిక్షణ పొందానని సినిమా, నటన పట్ల తన అంకితభావాన్ని తెలియజేశారు వీణారావు.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఆస్కార్-విజేత MM కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. మరొక ఆస్కార్-విజేత చంద్రబోస్ లిరిక్స్ అందిస్తున్నారు. స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ భారీ అంచనాల చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు సినిమా అభిమానులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.

వీణారావు ఫస్ట్ దర్శన్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ…అశ్విని దత్ గారి కాంపౌండ్ లో దాదాపు ఐదేళ్లపాటు ఉన్నాను. నా తొలి సినిమా వారి బ్యానర్ లోనే చేయాల్సింది. తర్వాత నాకు అన్నపూర్ణ లో డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. దత్తుగారు, నాగార్జున గారు ఇద్దరూ నాకు చిరస్మరణీయులు. ఇద్దరు ఫోటోలు నా ఆఫీసులో ఉంటాయి. వారి ఫ్యామిలీస్ నుంచి వచ్చి మహిళా శక్తులుగా ఎదిగిన సుప్రియ, స్వప్న చేతుల మీదుగా నేను కథానాయకగా పరిచయం చేస్తున్న తెలుగు అమ్మాయి వీణారావు ఫస్ట్ లుక్ దర్శన్ ని లాంచ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకోసం ఈ వేడుకకి వచ్చిన వారికి ముందుగా ధన్యవాదాలు. మా కథానాయకుడు నందమూరి తారక రామారావు గారి ఫస్ట్ దర్శనకి చాలా వరల్డ్ వైడ్ చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వీణారావు కి కూడా వరల్డ్ వైడ్ మంచి ప్రశంసలు రావాలని కోరుకుంటున్నాను. వీణా మన తెలుగమ్మాయి. మంచి కూచిపూడి డ్యాన్సర్. అందాల రాశి. తనకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు తనపై ఉండాలి. అన్నగారు నందమూరి తారక రామారావు గారు నాకు స్ఫూర్తి. ఆయన వల్లే నేను పరిశ్రమలోకి వచ్చాను. ఆయన నటించిన యుగంధర్, ఆడపడుచు సినిమాలు ఇదే రోజున రిలీజ్ అయ్యాయి. భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వారిని స్మరించుకుంటూ ఈ రోజున మా కథానాయికని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం చిరస్మరణీయంగా భావిస్తున్నాను' అన్నారు.

నిర్మాత స్వప్నదత్ మాట్లాడుతూ.. వైవీఎస్‌ చౌదరి గారు అనడం కంటే చౌదరి అన్న అనడమే మాకు ఇష్టం. మేము చిన్నప్పుడు చెన్నైకి వెళ్తుండే వాళ్ళం. అప్పుడు చౌదరి అన్న మా ఆఫీస్ లోనే ఉండేవాడు. చౌదరి అన్నని చూస్తూనే మేం పెరిగాం. మా సమ్మర్ హాలీడేస్ ఆయనతోనే గడిపేవాళ్ళం. చౌదరి అన్న మా ఫ్యామిలీ లానే. ఆయన ఫస్ట్ సినిమా మా బ్యానర్ లోనే చేయాల్సింది. ఆయనది అద్భుతమైన జర్నీ. ఇవాళ ఇలాంటి లాంచ్ లో నేను భాగం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. వీణా మా విజయవాడ అమ్మాయి. చాలా అందంగా కనిపిస్తుంది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా రావాల్సిన సమయం ఇది. చౌదరి అన్న ఈ విషయంలో ఓ అడుగు ముందుకేయడం చాలా ఆనందంగా ఉంది' అన్నారు.

నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. వైవీఎస్‌ చౌదరి గారు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచే డైరెక్టర్ గా పరిచయమయ్యారు. ఆ సినిమాతో తాత గారిని డైరెక్టర్ చేశారు. సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమా చూసిన తర్వాత తాతగారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వైవీఎస్‌ చౌదరి గారు కొత్తవారిని పరిచయం చేయడంలో ముందుంటారు. తన కెరీర్‌లో ఎంతోమంది కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వీణారావు ఎంతో అదృష్టవంతురాలు. ఇలాంటి లాంచ్ దొరకడం మామూలు విషయం కాదు. వీణా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను' అన్నారు.

నిర్మాత యలమంచిలి గీత మాట్లాడుతూ.. మా హీరోయిన్ ఫస్ట్ దర్శన్ ని లాంచ్ చేసిన సుప్రియ, స్వప్న గారికి థాంక్ యూ. మా హీరో ఎలా అయితే ప్రపంచ వ్యాప్తంగా హిట్ అయ్యారో మా హీరోయిన్ ని కూడా మనస్పూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను' అన్నారు

తారాగణం: నందమూరి తారక రామారావు, వీణా రావు
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: వైవిఎస్ చౌదరి
బ్యానర్: న్యూ టాలెంట్ రోర్స్ @
నిర్మాత: యలమంచిలి గీత
సంగీతం: ఎంఎం కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ర

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved