Eashvar Karthic about Zebra
'జీబ్రా' అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న మాస్ డ్రామా. స్క్రీన్ ప్లే చాలా ఎక్సయిటింగ్ గా ఉంటుంది. అందరికీ కనెక్ట్ అవుతుంది: డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ హ్యుజ్ క్రియేట్ చేశాయి. జీబ్రా నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
జీబ్రా కథలో ఎక్సయిటింగ్ ఎలిమెంట్స్ ఏమిటి ?
-జీబ్రా కొత్త వరల్డ్. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఆర్టిస్టిక్ ఎలిమెంట్స్ ని బ్లెండ్ చేయడం కొన్ని కథలకే కుదురుతుంది. జీబ్రాలో అది కుదిరింది. ఇందులో అన్ని ఎమోషన్స్ ఆర్గానిక్ గా బ్లెండ్ అయ్యాయి. మాస్ ఎలిమెంట్స్, బ్యాంకింగ్ జోనర్, మనీ లాండరింగ్, కామెడీ, లవ్, ఫ్రెండ్షిప్, యాక్షన్ ఇవన్నీ బాగా బ్లెండ్ అయ్యాయి. సినిమా అద్భుతంగా వచ్చింది.
-నా దగ్గర వున్న స్టొరీ ఐడియాస్ కొత్త కాన్సెప్ట్ తో వుంటాయి. ఒక కథ చేయాలంటే ముందు నేను కన్విన్స్ అవ్వాలి. బ్యాంకింగ్ వరల్డ్ లో కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. అవి లైమ్ లైట్ లో పెట్టి ఆడియన్స్ కి చూపించాలనే ఆలోచన వచ్చింది. బ్యాంకింగ్, మనీ లాండరింగ్ ఇలా రెండు వరల్డ్స్ బ్లెండ్ చేసి ఈ కథ రాశాను. జీబ్రా స్క్రీన్ ప్లే ఇంటెల్జెంట్ గా వుంటుంది. కానీ రైటింగ్ సింపుల్ అండ్ బ్యూటీఫుల్ గా వుంటుంది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.
జీబ్రా కథ విన్న తర్వాత సత్యదేవ్ రియాక్షన్ ఏమిటి ?
-జీబ్రా బౌండ్ స్క్రిప్ట్ పంపించాను. ఆయన రెండు రోజుల్లో చదివేశారు. తర్వాత ఇద్దరం కలిశాం. కొన్ని డౌట్స్ అడిగారు. వాటికి అన్సర్ చెప్పగానే వెంటనే ఈ సినిమా చేద్దామని అన్నారు.
జీబ్రా టైటిల్ జస్టిఫీకేషన్ ఏమిటి ?
-ఫైనాన్సియల్ క్రైమ్ చుట్టూ వుండే కథ ఇది. బ్లాండ్ అండ్ వైట్ సూచించే యానిమల్ గా 'జీబ్రా' టైటిల్ ని పెట్టడం జరిగింది. కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ కథ రాశాను. జీబ్రా మాస్ డ్రామా. డిజిటల్ క్రైమ్ ని లైమ్ లో పెట్టి సినిమా చేయడం జరిగింది.
బ్యాంక్ క్రైమ్ మీద ఎలా పట్టుసాదించారు ?
-నేను ఇంజనీర్ గ్రాడియేట్ ని. దాదాపు ముఫ్ఫై రెండు కంపెనీల్లో పని చేశాను. కానీ ఏదీ నచ్చలేదు.(నవ్వుతూ) నా లాస్ట్ జాబ్ బ్యాంక్ లో చేశాను. అప్పుడు అక్కడ జరిగే మిస్స్టేక్స్ ని గమనించాను. ఈ కథలో నా వ్యక్తిగత అనుభవాలు, క్యారెక్టరైజేన్స్ కూడా వున్నాయి.
-ఈ కథ ఒక కామన్ మ్యాన్ పాయింట్ అఫ్ వ్యూ నుంచి మొదలౌతుంది. ఒక ఐదు వందల రూపాయిలని డిపాజట్ చేయలన్నా బ్యాంక్ ఎంతవరకూ సేఫ్టీ అనే ఆలోచన రేకెత్తించేలా వుంటుంది. ఇందులో బ్యాంకింగ్, గ్యాంగ్ స్టర్, మనీ లాండరింగ్ ఇలా మూడు వరల్డ్స్ వుంటాయి. ఈ సినిమా చూసినప్పుడు ఇలాంటి క్రైమ్ జరుగుతుందా ? అనే ఆలోచన పుట్టించేలా వుంటుంది.
తెలుగు, కన్నడ, తమిళ్ ఇలా అన్ని భాషల నుంచి నటులని తీసుకోవడానికి కారణం?
-ఈ కథకు, పాత్రలకు గుడ్ పెర్ఫామర్స్ కావాలి. ఇందులో అందరికీ డిఫరెంట్ క్యారెక్టర్ రైజేషన్స్ వున్నాయి. సత్య, ధన ఈ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ యాప్ట్. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ప్రియా భావానీ శంకర్, సునీల్, సత్యరాజ్ ఈ పాత్రలనీ కథలో కీలకంగా వుంటాయి. వీరంతా రావడం మార్కెట్ కూడా స్ప్రెడ్ అయ్యింది.
రవి బస్రూర్ మ్యూజిక్ గురించి ?
-ఇది మ్యూజికల్ క్రైమ్ స్టోరీ. ఇందులో ఏడు పాటలు ఉన్నాయి. కథకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. బిజిఎం కూడా అద్భుతం చేశారు. మూడు వరల్డ్స్ కి మూడు డిఫరెంట్ లేయర్ మ్యూజిక్ ఉంటుంది. ఇందులో కొత్త రవి బస్రూర్ ని చూస్తారు.
నిర్మాతల గురించి
-చాలా పాషనేట్ ప్రొడ్యూసర్స్. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. మూవీ త్రూ అవుట్ చాలా సపోర్ట్ చేశారు.
అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి?
-డిఫరెంట్ జానెర్స్ లో కథలు ఉన్నాయి. తెలుగులో సినిమాలు చేయాలని ఉంది.