To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
27 July 2015
Hyderabad
***షిరిడీ ఇన్ అమెరికా కు ఆనంద్ సాయి డిజైన్ *** సాయి భక్తుడిగా తన వంతు సాయం***
షిరిడీ ఇన్ అమెరికా నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. న్యూజెర్సీ లో సాయి దత్త పీఠం షిరిడీ నిర్మాణ సంకల్ప సిద్ధికి ప్రముఖ ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి కూడా నేనుసైతమంటూ ముందుకొచ్చారు. అమెరికాలో షిరిడీ ఆలయ డిజైన్ అందించేందుకు సిద్ధమని ప్రకటించారు. సాయిదత్త పీఠం షిరిడీ సాయి ఆలయ నిర్మాణం తలపెట్టిన షుమారు 25 ఎకరాల స్థలాన్ని ఆనంద్ సాయి సాయి దత్త పీఠం వాలంటీర్ లు అందరితోనూ కలిసి పరిశీలించారు. ఈ వాలంటీర్ల సమిష్టి కృషి ని ప్రత్యేకంగా అభినందించారు. ఆలయం ఎలా ఉండాలనే దానిపై సాయి దత్త పీఠం ఆలోచనలను అడిగి తెలుసుకున్నారు. పలు సినిమాలకు ఆర్ట్ డైరక్షన్ చేసిన ఆనంద్ సాయి.. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓం ప్రాజెక్టుకు తన కళా సేవలు అందిస్తున్నారు. భారతదేశంలో ఆలయ నమూనాలన్నింటిని ఫిలింసిటీలో ఒకే నోట నిర్మించేదే ఓం ప్రాజెక్ట్.. ఇక అటు తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున చేపడుతున్న యాదాద్రి ఆలయ ప్రాజెక్టుకు కూడా ఆనంద్ సాయి రూపకల్పన చేస్తున్నారు. షిరిడీ ఇన్ అమెరికా నిర్మాణ ఆలోచనను సాయి దత్త పీఠం చెప్పగానే దానికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని ఆనందసాయి హమీ ఇచ్చారు. సాయి దత్త పీఠం సభ్యులతో ఆలయ నమూనాపై సవివరంగా చర్చించారు. అందరి అభిప్రాయాలు తీసుకుని పూర్తి స్థాయిలో అమెరికాలో షిరిడి నిర్మాణానికి తాను నమూనా రూపొందించి ఇస్తానని, త్వరలో తన టీం తో న్యూ జెర్సీ లో పర్యటిస్తానని ప్రకటించారు.