To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
22 July 2014
Hyderabad
అమెరికాలోని గ్రేటర్ ఇండియానాపొలిస్ తెలుగు అసోషియేషన్ (GITA) చే నిర్వహించబడిన సదస్సుకు ముఖ్య అథితిగా పింగిళి ప్రభుత్వ మహిళా కళశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్న డా. మార్క శంకర్ నారాయణ హాజరయ్యారు. తాను చేసిన రచనలకు గుర్తింపుగా ''భౌతికశాస్త్రకవితాదురీణ'' అవార్దుతో ఘనంగా సత్కరించారు. ‘ఆటవెలదిలో బౌతికశాస్త్రం’ లోని పద్యాలను మరియు కవితల్లొ ఫిజిక్స్ సామాజిక కవితలను గేయాలను ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు. బౌతికరాసులు, ప్రమాణాలు, సదిశలు, అదిశలు, గతిశాస్త్రం, న్యూటన్ గమన నియమాలు, కాంతి, ఊష్ణము, ఎలక్ట్రానిక్స్ పై చేసిన రచనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మువ్వన్నెల జెండా, సైన్స్ విద్యార్థి, విద్యార్థికి నా సందేశం, ప్రపంచీకరణపై ఆలపించిన గేయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. GITA Chairman చింతల రాము మాడరటర్ గా వ్యవహరించారు. ఇండియానపోలిస్ హైదరాబాద్ సిస్టర్ సిటీ కమిటి అద్యక్షులు చింతల రాజు గారు శంకర్ నారాయణను సభకు పరిచయం చేసారు.
GITA President మంగారావ్ స్వాగతం పలుకగా, Sahitya GITA Chair, డా. D.H.R.శర్మ అద్యక్షత వహించారు. ఇండియానపోలిస్ విశ్వవిద్యాలయ బౌతికశాస్త్ర విభాగ అదిపతి ప్రొఫెసర్ వేమూరి గౌతం మాట్లాడుతూ బౌతికశాస్త్రాన్ని, పద్యాలరూపంలోను, కవితల రూపంలోను, గేయాల రూపంలోను చెప్పడం చాలా గొప్ప విషయమని, అవి విద్యార్థిల మనస్సులలొకి చొచ్చుకపోతాయని అన్నారు.
ఇండియాన పవర్ ఏజెన్సీ చీఫ్ ఎక్స్కూటివ్ అధికారి రాజెశ్వర్ రావ్, ప్రముఖ డాక్టర్లు మర్రి సత్యనారయణ రెడ్డి, రవీందర్, రేడియాలొజిస్ట్ రంగనాయకులు మూర్తి, లక్ష్మి, ఐటీ ఇంజనీర్లు , అవినాష్, శ్రీకాంత్, మహేష్, వెంకట్, ఆల్ఫ్రెడ్, గౌరాచారి,సృజన్, మాధవి, రాజెశ్వరి తదితరలు పాల్గొ న్నారు.
తదనంతరము ఇండియానపోలిస్ హైదరాబాద్ సిస్టర్ సిటీ కమిటి అద్యక్షులు చింతల రాజు ఆద్వర్యములో నిర్వహించబడిన వేరే కార్యక్రమములో తెలంగాణ ఉద్యమములో తాను రచించిన తెలంగాణ పోరు శతకము మరియు పాటల్లొ తెలంగాణ లొల్లికి సంబందించిన పద్యాలను, గేయలను ఆలపించారు. సకల జనుల సమ్మె చూడు-తెలంగాణ లొల్లి చూడు, ఉద్యమ ఉయ్యాలట, కదిలిందీ సకల జనుల సమ్మె,తెచ్చేదిమేమని జెప్పిరి ఇచ్చెద్మెమని జెప్పిరి, ఫలించిన తెలంగాన పొరు అనే గేయాలు ఆకర్షణగా నిలిచాయి.
తెలంగాణపోరుశతక గ్రంధ ప్రచురణకు పూర్తి ఆర్తిక సహయము అందజేస్తామని ప్రకటించిన చింతల రాజు గారికి కృతజ్ఞతలు తెలిపారు.