To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
18 October 2014
Hyderabad
Capitol Area Telugu Society (CATS) celebrated 2014 Dasara festival event on October 11, 2014 in Vienna, Virginia and brought in festive colors to local Telugu community.
The event started with lighting the lamp by first arrival family to the event followed by local talent who presented programs in Classical, Folk, and Movie Medley’s performed by more than 250 talented children from the D.C Metro Area. The main attraction of the afternoon was two hour long stunning choreographs by Kalaimamani Smt. Parvathi Ravi Ghantasala, daughter in law of the legendary Telugu singer Gaana Gandharva Ghantasala garu in a tribute to renowned songs Sree Ghantsala garu sang almost 30 years ago. It was visual and nostalgia feast to the audience who thoroughly enjoyed once famous songs. Six of Paravathi Ghantasla Kala Pradarshini team members from performed the Ghntasala tribute songs choreograph.
CATS President Mr. Madhusudhan Reddy Kola with his executive committee members gave the updates on the CATS organization. He explained various community services the organization is providing to the community. They include volunteering and donating food for poor at DC Central Kitchen; Health Fairs organized for community in association with other local organizations; Community reception participation by CATS during visit of Indian Prime Minister Shree Naredra Modi ji to New York and Washington DC; CATS involvement in bringing light and supporting the resolve of recent Anti Hindu graffiti vandalism incident in Virginia; CATS Community Helpline to get support on domestic issues; Kids Summer Camp & Manabadi classes and organizing sport competitions in the area. Mr. Kola also expressed how important sponsors playing a role in the organization and mentioned to the audience of upcoming milestone of 10 years for CATS organization and thanked for their continued support to the organization. Invited guest Mr. Anjan Chimaladinne, a resident of Virginia who has been active in Loudon county school board and Board Member of Virginia Information Technology Advisory Council also shared with the audience on anti-Hindu graffiti incident.
More than 800+ people attended the event that enjoyed every bit of tribute performances to Sree Ghantasala garu and followed by feast along with live Dandiya with drums and songs which had the audience of all ages and ensured they were part of the fun. Event cultural programs were coordinated well by cultural team Mrs. Sudharani Kondapu and Gopal Nunna.
Overall, it was a memorable afternoon. This event has been successfully executed by executive team members Praveen Katanguri, Bhasker Bommareddy, Satyajith Mareddy, Ravi Bojja, Anil Reddy Nandikonda, Raji Reddy, Someshwar Sharvirala, Venkat Gunda, Goud Rampuram, Pavan Kondapalli, Kiran Meegada, Hari Kancherla, Harish Kondamadugu, Amarender Reddy Bojja; Trustees Badrinath Challa, Mrs. Lakshmi Babu and Ram Mohan Konda; support from Mrs. Srilekha Palle, Mrs. Daya Ravi; committed volunteers Srinivas Vootla, Krishna Katakam, Durga Prasad Gangisetty, Ramachandra, Aravind Kakkereni, Sudhakar, Umakanth, Sudhir KOnam, Shivajo Koka, Raj. At the end CATS Executive team felicitated the guess artists from India and local teachers who coordinated with the team with a plaque & concluded with a vote of thanks from Secretary Bhaskar Bommareddy & Trustee Badrinath Challa to all sponsors, participants and attendees. Indian & American National Anthems was sung by all along with audience and the committee members of Capitol Area Telugu Society.
ఈ ఈవెంట్ కి మొట్ట మొదటగా విచ్చేసిన అతిధులతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారభించబడింది. తరువాత DC మెట్రో ఏరియా నుండి సుమారు 250 ప్రతిభావంతులైన పిల్లలు మరియు స్థానిక కళాకారులచే వివిధ సాంప్రదాయ, జానపద, మరియు సినిమా పాటల కార్యక్రమాలు ప్రదర్శించారు. అంతే కాకుండా ప్రధాన ఆకర్షణగా ప్రఖ్యాత తెలుగు గాయకుడు గాన గంధర్వ శ్రీ ఘంటసాల గారి కోడలు, కలైమామణి శ్రీమతి పార్వతి రవి ఘంటసాల గారి ఆరుగురు కళాకారుల బృందంచే రెండు గంటల పాటు అద్భుతమైన నృత్యమాలికలు ప్రదర్శించబడ్డాయి. శ్రీ ఘంటసాల గారిచె దాదాపు 30 సంవత్సరాల క్రితం పాడిన ప్రఖ్యాత పాటలకు శ్రీమతి పార్వతి రవి ఘంటసాల గారి బృందం ఒక నివాళిగా సమర్పించారు. ఈ సమర్పణ కార్యక్రమం పూర్తిగా ప్రేక్షకులకు ఒక దృశ్యమాలికా విందుగా నిలిచింది. ప్రేక్షకులు అందరు తమ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళారు.
తదుపరి కార్యక్రమంలో CATS అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి కోలా గారు CATS సంస్థ యొక్క కమ్యూనిటీ సేవా కార్యక్రమాల గురించి చక్కగా వివరించారు. సేవా కార్యక్రమాలలో బాగంగా వారు సంస్థ వాలంటీర్లు నిర్వహించిన DC సెంట్రల్ కిచెన్లో పేద వారి కోసం స్వయం సేవా మరియు విరాళాలు; ఇతర స్థానిక సంస్థల సహకారంతో నిర్వహించిన కమ్యూనిటీ హెల్త్ ఫేయిర్స్; ఇటీవల న్యూయార్క్ మరియు వాషింగ్టన్ DC కి విచ్చేసిన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ జీ పర్యటన సందర్భంగా కమ్యూనిటీ రిసెప్షన్ లో CATS పాల్గొనడం; అంతే కాకుండా ఇటీవల వర్జీనియాలో హిందూ మతానికి వ్యతిరేకంగా జరిగిన సంఘటనల యొక్క పరిష్కారం కోసం CATS నిర్వహిస్తున్న అవగాహన సేవా కార్యక్రమం; CATS కమ్యూనిటీ హెల్ప్ లైన్ ద్వారా గృహ సంబందిత సమస్యల పరిష్కారానికి చేసిన ఏర్పాటు; పిల్లల సమ్మర్ క్యాంప్స్ & మనబడి తెలుగు తరగతులు; మరియు సంస్థ వారు నిర్వహిస్తున్న క్రీడా పోటీలు మొదలగు వివిధ కార్యక్రమాల గురించి అతిధులకు వివరించారు. దీనితో పాటు CATS సంస్థ స్తాపించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా సంస్థ ఎదుగుదలకు తోడ్పడుతున్న స్పాన్సర్లు మరియు నిరంతరంగా మద్దతు ఇస్తూ సంస్థను ఆదరిస్తున్న తెలుగు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈవెంట్ కి ఆహ్వాన అతిథి వర్జీనియా వాస్తవ్యులు లౌడెన్ కౌంటీ పాఠశాల బోర్డులో క్రియాశీలకంగా ఉన్న మరియు వర్జీనియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహా మండలి బోర్డు సభ్యులు అయిన శ్రీ అంజన్ చిమలదిన్నె గారు కూడా హిందూ మత వ్యతిరేక గ్రాఫిటీ సంఘటన గురించి అతిధులకు వివరించారు.
ఈ ఈవెంట్ కి 800 మందికి పైగా అతిధులు విచ్చేసారు. అందరు చక్కగా శ్రీ ఘంటసాల గారి పాటల నృత్య ప్రదర్శనలు ఎంజాయ్ చేస్తూ సరదాగా దసరా ఉత్సవాలను ఆనందించారు. చివరగా దాండియా ఆట పాటలతో ప్రత్యెకంగా ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని అస్వాదించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరు పసందైన విందు భోజనం గురించి, కార్యక్రమాల క్వాలిటీ గురించి, సంస్థ వారి నిర్వహణ గురించి గొప్పగా చెప్పుకోవడం విశేషం. ఈ ఈవెంట్ సాంస్కృతిక కార్యక్రమాలు కాట్స్ సాంస్కృతిక కమిటీ సబ్యులు శ్రీమతి సుధారాణి కొండపు మరియు గోపాల్ నున్న గార్ల సమన్వయంతో జరుపబడ్డాయి.
మొత్తంగా 2014 CATS దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్ ని విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన కార్యనిర్వాహక జట్టు సభ్యులు ప్రవీణ్ కాటంగూరి, భాస్కర్ బొమ్మారెడ్డి, సత్యజిత్ మరెడ్డి, రవి బొజ్జ, అనిల్ రెడ్డి నందికొండ, రాజి రెడ్డి, సోమేశ్వర్ శర్విరాల, వెంకట్ గుండా, గౌడ్ రాంపురం, పవన్ కొండపల్లి, కిరణ్ మీగడ, హరి కంచెర్ల, హరీష్ కొండమడుగు, అమరేందర్ రెడ్డి బొజ్జ; అలాగే ట్రస్టీలు బద్రీనాథ్ చల్లా, శ్రీమతి లక్ష్మి బాబు, రామ్ మోహన్ కొండా; వీరితో పాటు శ్రీమతి శ్రీలేఖ పల్లె, శ్రీమతి దయా రవి గార్ల సహకారంతో; అంతే కాకుండా వివిధ వాలంటీర్లు శ్రీనివాస్ ఊట్ల, కృష్ణ కటకం, దుర్గా ప్రసాద్ గంగిశెట్టి, రామచంద్ర, అరవింద్ కక్కేరేణి, సుధాకర్, ఉమాకాంత్, సుధీర్ కోణం, శివాజీ కోక, రాజ్ మరియు ఈవెంట్ దాతలకు అందరికి CATS ప్రెసిడెంట్ శ్రీ మధుసూదన్ కోలా గారు ప్రత్యెక అభినందనలు తెలియజేశారు. చివరగా శ్రీమతి పార్వతి రవి ఘంటసాల గారి ఆరుగురు కళాకారుల బృందాన్ని సెక్రెటరీ భాస్కర్ బొమ్మారెడ్డి మరియు ట్రస్టీ బద్రీనాథ్ చల్లా లు సత్కరించారు. వందన సమర్పణతో భారత మరియు అమెరికా జాతీయ గీతాలను ఆలపిస్తూ 2014 దసరా సంబరాలను ముగించారు.