To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
19 September 2013
Hyderabad
సీటీఏ, నాట్స్ ఆధ్వర్యంలో టీ10 క్రికెట్ టోర్నమెంట్ *** ఘనంగా ముగిసిన టీ 10 క్రికెట్ ఫైనల్ *** "మానవత" ఉచిత వైద్య శిబిరం కోసం క్రికెట్ పోటీలు ***
చికాగోలో తెలుగువారి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ సందడిగా ముగిసింది.. రెండు వారాల క్రితమే ఈ టోర్నమెంట్ లో సెమీ ఫైనల్ వరకు పోటీలు నిర్వహించారు. వాతావరణం అనుకూలించకపోవటంతో రెండు వారాల తర్వాత నిర్వహించిన ఫైనల్ లో ఫాల్కన్ టీం విజేతగా నిలిచింది. చికాగో తెలుగు సంఘం ( సీటీఏ) నాట్స్ సంయుక్తంగా ఈ క్రికెట్ పోటీలు నిర్వహించాయి. చికాగోలోని Downers grove క్రికెట్ గ్రౌండ్స్ లో ఈ టోర్నెమంట్ జరిగింది.. దాదాపు 150 మంది ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నారు.. తొమ్మిది టీంల మధ్య ఈ క్రికెట్ సమరం జరిగింది. .. మానవత ఉచిత వైద్య శిబిరం కోసం నిర్వహించిన ఈ టోర్నమెంట్ లో తెలుగువారంతా ఉత్సాహంగా పాల్గొన్నారు..
టీ 10 క్రికెట్ టోర్నమెంట్ గ్రూపు ఏ, బీ, సీ గ్రూపుల మధ్య జరిగింది. గ్రూపు ఏ లో సింహాలు, లీహై స్ట్రైకర్స్, సీటీఏ ఛాలంజర్స్ టీమ్స్ ఉన్నాయి. సింహాలు టీమ్ ను సమరేంద్ర సింగ్, లీ హై స్ట్రైకర్స్ టీమ్ ను శ్రీరాం వన్నంరెడ్డి, సీటీఏ ఛాలెంజర్స్ ను ప్రవీణ్ మోటూరు, విజయ్ వెనిగళ్ల లీడ్ చేశారు. గ్రూప్ బీలో ఫాల్కన్స్ టీం, ఈఎండీ టీమ్, తుపాకులు టీం ఉన్నాయి. ఫాల్కన్స్ టీం కు సూధన్ పెరియసమి, ఈఎండి టీమ్ ను నరేన్ శర్మ, తుపాకుల టీంను పవన్ అబ్బారెడ్డి నాయకత్వం వహించారు.
గ్రూపుసీలో డీపార్క్ టీం, ఫ్రెండ్స్ ఎలెవన్, తుటాలు టీంలు పాల్గొన్నాయి. డీపార్క్ టీం ను జైమిన్ పటేల్, ఫ్రెండ్స్ ఎలెవన్ టీమ్ ను ధన్ రాజ్ రెడ్డి, తుటాలు టీంను విజయ్ నంబూరి, రాజేష్ వీడులమూడిలు నాయకత్వం వహించారు. ప్రతి టీం రెండు మ్యాచ్ లు ఆడటంతో ఫస్ట్ రౌండ్ పూర్తయింది.. గ్రూపు ఏ, బీ,సీ ల్లో ఉన్న టీంల్లో చివరకు నాలుగు టీంలు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. సింహాలు, ఫాల్కన్స్, డీ ఫార్క్, లీ హై స్ట్రైకర్స్ టీంలు సెమీ ఫైనల్ లో తలపడ్డాయి.. మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్.. సింహాలు, డీపార్క్ టీంల మధ్య జరిగింది. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో డీ ఫార్క్ టీం ఫైనల్ కు చేరుకుంది. ఇక రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఫాల్కన్, లీ హై స్ట్రైకర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఫాల్కన్ టీం విజేతగా నిలిచింది.. ఫైనల్ కు చేరుకున్న డీఫార్కర్, ఫాల్కన్ టీం ల మధ్య ఫైనల్ వర్షం కారణంగా ఫైనల్ రెండువారాల తరువాత నిర్వహించారు. డీపార్కర్, ఫాల్కన్ టీం ల మధ్య జరిగిన ఫైనల్స్ లో ఫాల్కన్స్ టీం విజేతగా నిలిచింది. ఎంఫైర్లు, వాలంటీర్ల ఈ టోర్నమెంట్ కోసం చేసిన కృషిని సీటీఏ స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ కమిటీ మదన్ పాములపాటి, సుబ్బారావు పోట్రేవులు అభినందించారు. ఈ టోర్నమెంట్ నిర్వహాణకు సహకరించిన స్పాన్సర్స్ కు ..పాల్గొన్న ఆటగాళ్లను సీటీఏ ప్రెసిడెంట్ శ్రీనివాస బొప్పన్న అభినందనలు తెలిపారు. చికాగో మానవత ఫ్రీ మెడికల్ ఇవెంట్ కోసం జరిగిన ఈ టోర్నమెంట్ కు వచ్చిన స్పందన చాలా బాగుందన్నారు. సీటీఏ, నాట్స్ కలిపి ఇలాంటి మరెన్నో టోర్నెమెంట్ లు, ఈవెంట్ లు చేసేందుకు..మరింత ఉత్సాహం వచ్చిందని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రవి అచంట అన్నారు.. తెలుగువారు ఒక్కటే చేసే ఏ కార్యక్రమానికైనా నాట్స్ మద్దతు ఉంటుందని తెలిపారు.
సీటీఏ ఎగ్జిక్యూటిమ్ కమిటీ శ్రీధర్ ముమ్మనగండి, సీటీఏ సెక్రటరీ రమేష్ మర్యాల, ట్రెజరర్ వరప్రసాద్ బోడపాటి, నాగేందర్ వేగే, మూర్తి కొప్పాక, రమేష్ మర్యాల, రావు అచంట లు ఆటగాళ్లకు బహుమతులు అందించారు.ఈ టోర్నమెంట్ లో విజేతలకు...EvolutYz కంపెనీ ప్రతినిధి అరవింద్ చేతుల మీదుగా విన్నర్స్ కప్ అందించారు. రన్నర్స్ టీంకు Idhasoft కంపెనీ మదన్ పాములపాటి చేతుల మీదుగా కప్ అందించారు. రామ్, తూనుగుంట్ల, మనోహార్ పాములపాటి, మహేష్ అళ్ల, పండు చంగలశెట్టి, శ్రీకాంత్ మాలతీ ఇలా ఎందరో వాలంటీర్లు నిస్వార్థంగా ఈ టోర్నమెంట్ కోసం చేసిన కృషిని సీటీఏ, నాట్స్ లు ప్రత్యేకంగా అభినందించాయి.