To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
27 September 2016
Hyderabad
అమెరికాలో తెలుగువారు ఎక్కడున్నా అందరిని ఒక్క చోట చేర్చి సరికొత్త కార్యక్రమాలు రూపొందించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. చికాగోలో స్థానిక తెలుగు సంఘం సీటీఏ తో కలిసి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే మహిళలను ప్రోత్సాహించి..వారిలో క్రీడ ప్రతిభను వెలుగులోకి తెచ్చేలా నాట్స్, సీటీఏ సంయుక్తంగా వుమెన్ త్రో బాల్ పోటీలను నిర్వహించింది. ఈ త్రోబాల్ టోర్నమెంట్ కు విశేష స్పందన లభించింది. చికాగో వేదికగా ఈ వుమెన్ త్రో బాల్ పోటీల్లో 100 మంది మహిళ ప్లేయర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.దాదాపు 200 మంది ఈ పోటీలు ఆసక్తిగా తిలకించారు. తమ వారిని ఉత్సాహపరిచారు. ఈ త్రో బాల్ టోర్నమెంట్ లో రుద్ర, వజ్ర, రాకింగ్ రాబిన్స్, వెస్ట్ మాంట్ వేవ్స్, వెస్ట్ మెంట్ రాక్స్ , సీటీఏ లాగన్స్ అనే మొత్తం ఆరు టీంలు పోటీ పడ్డాయి. ఆద్యంతం ఆహ్లదకరంగా.. ఆసక్తికరంగా జరిగిన ఈ పోటీల్లో రుద్ర టీం విజేతగా నిలిచింది. వెస్ట్ మాంట్ టీం రెండవ స్థానం దక్కించుకుంది. లక్ష్మి బొజ్జా, మదన్ పాములపాటి ఆధ్వర్యంలో అనేక మంది వాలంటీర్లు, సీటీఏ డైరక్టర్లు ఇచ్చిన పూర్తి సహకారంతో ఈ టోర్నమెంట్ ఎంతో విజయవంతంగా సాగింది.
ప్రత్యేకంగా మహిళలకు నిర్వహించిన ఈ ఆటల పోటీలు ఘన విజయం సాధించడంతో నాట్స్ నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. ఇలాంటి పోటీలు మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని తెస్తాయని నాట్స్ మహిళా విభాగం తెలిపింది. ఈ టోర్నమెంటు కోసం ఉమా వెగే, బిందు బాలినేని, శిరిష దాములూరి, సుజనా అచంట, కళ్యాణి కోగంటి, సుమతి పాములపాటి, శైలేంద్ర గుమ్మడి, అరవింద్ కోగంటి, కిరణ్ అంబటి, హరీష్ జమ్ముల, రామ్ తూనుగుంట్ల, ఆర్ కె. బాలినేని, వెంకట్ దాములూరి, అరుల్ బాబు, మణి నటరాజన్, సురేష్ కుమార్, విజయ్ రంగినేని తదితరులు తమ విలువైన సేవలు అందించినందుకు నాట్స్, సీటీఏ వారిని ప్రత్యేకంగా అభినందించాయి.