To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
15 October 2014
Hyderabad
డిట్రాయిట్: హుదూద్ పెనుతుఫాను తాకిడికి కకావికలైన మన ఉత్తరాంధ్ర క్షోభను గమనించిన నాట్స్ (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) డిట్రాయిట్ విభాగం వారు ఈ ఆపద సమయంలో తమవంతు సేవను అందించాలన్న తపనతో తాపత్రయంతో ఈరోజు ఫార్మింగ్టన్లోని ఆహార్ భోజనశాలలో ఒక చిన్న నిధుల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా. శ్రీనివాస్ కొడాలి, కృష్ణ కొత్తపల్లి, బసవేంద్ర సూరపనేని, గౌతం మార్నేని, శేఖర్ దేవరశెట్టి, కిషోర్ తమ్మినీడి, వేణు సూరపరాజు, నీలేశ్వర్ ఠాకూర్, రోషిత ఠాకూర్, ప్రసాద్ గొంది, శివ అడుసుమిల్లి, సంపత్ ఇంకా అనేక మంది ఆంధ్ర రాష్ట్రాభిమానులు విచ్చేసి తమ వంతు విరాళాలను అందజేశారు. అత్యంత తక్కువ సమయంలో ఏర్పాటు చెయ్యడం వలన ఈ కార్యక్రమానికి రాలేక పోయిన మరెంతో మంది నాట్స్ కుటుంబ సభ్యులు చరవాణి ద్వారా తమ సానుభూతి సహకారాలను తెలియజేశారు. ఇంకా అంతర్జాలంలొ విరాళాలు ఇవ్వదలిచిన ఆత్మీయులందరినీ ఈ క్రింద ఇచ్చిన చిరునామా ద్వారా అందజేయవచ్చని తెలియజేశారు.
ఈ విరాళాలన్నీ #501(c) (3) # కింద ఆదాయపన్ను నుండి మినహాయింపబడతాయి.
Donate: https://www.natsworld.org/donate.php?cid=1
Compaign site https://fundraiser.processdonation.org/Fundraiser/donate.aspx?fid=8A94189H92