To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
24 April 2016
Hyderabad
ప్రాచీన కాలం నుండి సభ్యతా-సంస్కారాల్లో, శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానంలో భారతీయులు ఎవ్వరికీ తీసిపోరని చారిత్రక కాలం నుండి భారతదేశం అన్ని రంగాల్లో విశ్వగురువుగా భాసిల్లిందని, మధ్యలో కొన్ని వందల సంవత్సరాలు విదేశీ దండయాత్రకు గురి అయినప్పటికీ విదేశీ పాలనలో మగ్గిపోయినప్పటికీ మనదైన విశిష్టత కోల్పోలేదని, దానికి మరలా పునర్వైభవాన్ని సంతరించుకుంటుందని ప్రస్తుతం విదేశాల్లో అన్ని రంగాల్లో అగ్రపీఠిన ప్రవాస భారతీయులే దీనికి తార్కాణమని ఆదివారం సాయంత్రం డెట్రాయిట్‌లోని స్ధానిక సెయింట్ తోమా చర్చిలో నిర్వహించిన సన్మాన సభలో మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. తెలుగువారికి కష్టపడటంలో మేధస్సులో ఎవ్వరూ సాటిరారని ఆయన అన్నారు.
పద్మభూషణ్ పురస్కారాన్ని పొందిన అనంతరం అమెరికా పర్యటనకు వచ్చిన యార్లగడ్డను మిషిగన్‌లోని పలు ప్రవాస భారతీయ, తెలుగు సంఘాలు ఘనంగా సత్కరించాయి. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన తెలుగు సంఘాల ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు. హాజరయిన ప్రతినిధులలో డాక్టర్ బండ్ల హనుమయ్య, డాక్టర్ ముక్కమల అప్పారావు, కాట్రగడ్డ కృష్ణప్రసాద్, నాదెళ్ల గంగాధర్, కోనేరు శ్రీనివాస్, పొలిచెర్ల హరినాధ్, డాక్టర్ జంపాల చౌదరి తదితరులు ఉన్నారు. ఐక్యరాజ్యసమితిలో హిందీని అధికారభాషగా చేయడం, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగును అధికారభాషగా అమలు చేయించడమే తన ఏకైక లక్ష్యమని ఈ సందర్భంగా యార్లగడ్డ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని మారెంరెడ్డి సాగర్, యు.ఎన్.రావు, పోలవరపు శివ, వెలగా శుభకర్, దుగ్గిరాల కిరణ్, బచ్చు సుధీర్, దొప్పలపూడి రవి, మరుపూడి విజయ్, సూర్యదేవర కిషోర్, కీసన హరి తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు. చాపలమడుగు ఉదయకుమార్ వ్యాఖ్యానంలో సాగిన ఈ కార్యక్రమం చివరగా పంత్ర సునీల్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.