To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
15 April 2017
Germany
ఫ్రాంక్ఫర్ట్(జర్మనీ) లో తెలుగు వాళ్ళు అందరూ ఉగాది వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు.
జర్మనీ లోని తెలుగు అసోసియేషన్ అయిన తెలుగు వెలుగు జర్మనీ ఈ వేడుకలను చాల ఘనంగా నిర్వహించింది.
ముఖ్య అతిధులుగా ఫ్ర్యాంక్ఫర్ట్ కౌంసుల్ జనరల్ శ్రీ రవీష్ కుమార్ గారు మరియు ప్రముఖ హాస్య నటులు ఆలీ గారు ఈ వేడుకలలో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ రవీష్ కుమార్ గారు మాట్లాడుతూ, భారతీయులు తమను తాము ఎట్టి పరిస్థితులలోను తక్కువ చేసుకొనవసరం లేదు అని, డిఫెన్సివ్గ ఉండనవసరం లేదు అని సెలవిచ్చారు.
ఆలీ గారు తెలుగు ఆడ పడుచులతో గేమ్ షో నిర్వహించారు. టాలీవుడ్ నేపధ్య గాయకులు శ్రీనివాస శర్మ మరియు తేజస్విని గార్లు వాళ్ళ పాటలతో ప్రేక్షకులను అలరించారు.
ప్రఖ్యాత కూచిపూడి నాట్య కళాకాలురాలైన నదియా గారు ఆమె నృత్యం తో అందరిని ఆకట్టుకున్నారు. జర్మనీలో చాలా షోస్ నిర్వహిస్తున్న D4D డాన్స్ గ్రూప్ తమ స్టెప్పులతో అందరిని ఉత్తేజ పరచారు.
ఈ సందర్భంగా ఆలీ గారు మాట్లాడుతూ, జర్మనీ లో తెలుగు వారిని కలుసుకోవడం చాల ఆనందంగా వుంది అని , ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్న తెలుగు వెలుగు జర్మనీ కమిటి కి అభినందనలు తెలియజేశారు.
తెలుగు వెలుగు చైర్మన్ శ్రీ దాసరి సాయి రెడ్డి గారు మాట్లాడుతూ జర్మనీ లో వున్నతెలుగు వారందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి సంబరాలు మన తెలుగ సంస్కృతిని తరువాత తరం వారికీ పరిచయం చేయడానికి దోహద పడతాయని అన్నారు.