To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
2 October 2017
USA
అమెరికాలోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటి (TAGKC) ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలను నిర్వహించింది. ఒలేతా లొనిహెరిటేజ్ పార్క్ లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 600 తెలుగువాల్లు పాల్గొని సంప్రదాయబద్దంగా పండుగ జరుపుకున్నారు. వివిధరకాలపూలతోఎంతో చక్కగా బతుకమ్మలను తయారుచేసి, చక్కని సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఉయ్యాల పాటలతో ఆడి, పాడి ఆనందించారు. కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా వచ్చిన అదితిబావరాజుఎంతో ఉత్సాహంగా ఉయ్యాలపాటలు, గీతాలతో అందరినీ ఉత్సాహపరుస్తు కార్యక్రమాన్ని నడిపించారు. గౌరీపూజతోప్రారంభమై, బతుకమ్మ, ఉయ్యాల పాటలతో ఊపందుకొని, జమ్మిపుజ మరియు నిమజ్జనం బతుకమ్మ కార్యక్రమమం సాగింది. ఆ తర్వాత చక్కని విందుభోజనం, అదితి పాటలు, పిల్లలు పెద్దల నృత్యాలతో అందరూ ఎంతో ఆనందించారు.
TAGKC అద్యక్షురాలు శ్రీమతి దుర్గ తెల్లా గారు అన్ని బతుకమ్మలలో చక్కగా చేసిన 3 బతుకమ్మలు చేసినవారికి బహుమతులు ఇచ్చి, కార్యక్రమానికి సాయహపడిన తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TATA) కి, స్పాన్సర్స్ కి మరియు విజయవంతం అవడానికి కృషిచేసినకార్యకర్తలందరికి ధన్యవాదాలు తెలిపారు.