To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
31 August 2015
Hyderabad
తెలుగు భాషా దినోత్సవం రోజున కాలిఫోర్నియా లో సిలికానాంధ్ర కార్యాలయం ప్రారంభం
కాలిఫోర్నియా ఆగష్టు 31: తెలుగు భాష ,సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించాలనే సకల్పంతో ప్రతి వారం ప్రపంచ వ్యాప్తంగా ఎదో ఒక కార్య క్రమాన్ని నిర్వహిస్తున్న లాభాపేక్ష రహిత అంతర్జాతీయ తెలుగు సంస్థ సిలికానాంధ్ర తన ప్రస్థానంలో మరొక మైలు రాయిని అధిగమించింది. ఆగుష్టు 29 వ తారీఖున శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటున్న సందర్భంగా , తెలుగు వారు ఎక్కువగా నివసించే జనసమ్మర్ధమైన సన్నివేల్ ప్రాంతంలో దాదాపు 1900 చదరపు అడుగుల విస్తీర్ణంలో సిలికానాంధ్ర తన కార్యాలయాన్ని ప్రారంబించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం సిలికానాంధ్ర అధ్యక్షులు సంజీవ్ తనుగుల, వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి , తెలుగు భాషా పండితులు మహమ్మద్ దాదా సాహెబ్ ,ముంతాజ్ బేగం చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్భంగా తెలుగు భాషా పండితురాలు శ్రీమతి ముంతాజ్ బేగం మాట్లాడుతూ తెలుగును వ్యవహారిక భాషగా వాడుక లోకి తీసుకొని రావటానికి శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి చేసిన కృషిని కొనియాడారు.
సిలికానాంధ్ర పూర్వ అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల ప్రారంభోత్సవ కార్య క్రమానికి విచ్చేసిన సభ్యులకు ఆహ్వానం పలుకుతూ, సిలికానాంధ్ర చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు కనబరుస్తున ఆదర అభిమానాలతో పాటు ,అంచనాలు కుడా పెరుగుతున్నాయని, వారి అంచనాలాను అందుకోవటానికి సిలికానాంధ్ర వేస్తున్న మరో అడుగు ఈ కార్యాలయ ప్రారంభోత్సవం అని తెలిపారు.
మనబడి కులపతి రాజు చమర్తి మాట్లాడుతూ, 2015-16 సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరానికి. అమెరికా లోని 35 రాష్ట్రాలతో పాటు 12 దేశాలలో తెలుగు నేర్చుకొనే దాదాపు 6000 మందికి కావలసిన పుస్తకాల మరియు ఇతర సామాగ్రి పంపిణికి ఈ కార్యాలయం కేంద్ర బిందువుగా మారనుందని తెలిపారు. ఉపాధ్యాయులు,తల్లి తండ్రులు మరియు ఇతర స్వచ్చంద సేవకులు సమస్యలు ,సూచనలు స్వీకరించాటానికి నిరంతరం కొంతమంది సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మనబడి లో ప్రవేశాలకు సంబందించిన వివరాలకు manabadi.siliconandhra.org సందర్శించవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు రవీంద్ర కూచిభోట్ల, మృత్యుంజయుడు తాటిపాముల, ప్రభ మాలెంపాటి,కిషోర్ బొడ్డు, మరియు శాంతి కూచిభొట్ల,అనిల్ అన్నం,శ్రీవల్లి కొండుభట్ల, దిలీప్ సంగరాజు,అరున్ కుమార్ KC ,సిద్దార్థ్ నూకల,శ్రీదేవి గంటి,ఆనంద్ బండి,రాజశేఖర్ మంగళంపల్లి ,వసంత, తదితరులు పాల్గొన్నారు.