|
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
12 May 2016
Hyderabad
భాషా సేవయే భావితరాల సేవ ! అనే నమ్మకంతో అమెరికా వ్యాప్తంగా 6000 మందికి పైగా విద్యార్ధులకు విజయవంతంగా తెలుగు నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి మరో సారి తమ విశిష్టత చాటుకుంది. మనబడి ప్రచార కార్యక్రమంలో భాగంగా, న్యూజెర్సీ-న్యూ యార్క్ ప్రధాన రహదారిపై 60 అడుగుల మనబడి హోర్డింగ్‌తో ఆకట్టుకుంది. ప్రతీ రోజూ వేలాది వాహనాలు తిరిగే ఈ రహదారి న్యూ యార్క్ విమానాశ్రయానికి అతి దగ్గరగా ఉండడం, అత్యంత భారీ సంఖ్యలో భారతీయులు ప్రయాణం చేసే మార్గం అవడం వల్ల - ఈ హోర్డింగ్ ఏర్పాటు చేసామని మనబడి ఉపాద్యక్షులు ( గ్లోబల్) శరత్ వేట తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన తెలుగు భాషా బోధనా కార్యక్రమాలలో అత్యంత విజయవంతమైన మనబడి వార్షిక పరీక్షలు మరి కొద్ది రోజుల్లో జరగనున్నాయని, త్వరలో 2016-17 విద్యా సంవత్సరం తరగతులు ప్రారభమవుతాయని మనబడి అద్యక్షులు రాజు చమర్తి తెలిపారు. 60 అడుగుల ఈ హోర్డింగ్‌లో తెలుగుతనం ఉట్టిపడే బాపు బుడుగు, సీగాన పెసూనాంబల బొమ్మలు ముచ్చటగొలుపుతున్నాయని, పలువురు న్యూజెర్సీ వాసులు ఈ ప్రధాన రహదారిపై తెలుగు లో ప్రచారం చిత్రాలు చూడడం పట్ల తమ ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారని, వచ్చే విద్యాసంవత్సరానికి మరింతమంది విద్యార్ధులను మనబడి ద్వారా తెలుగు భాష నేర్చుకోవడానికి చేర్చుకోవలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని మనబడి ఆర్ధిక వ్యవహారాల ఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు.
|
|
|
|
|
|