pizza
Manabadi promotions
తెలుగు భాష వ్యాప్తి కోసం అమెరికా లోని ప్రజా రవాణా వ్యవస్థ బస్సులపై మనబడి విన్నూత్న ప్రచారం
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

07 August 2015
Hyderabad

తెలుగు భాష వ్యాప్తి కోసం అమెరికా లోని ప్రజా రవాణా వ్యవస్థ బస్సులపై మనబడి విన్నూత్న ప్రచారం

తెలుగును ప్రాచీన భాష నుంచి ప్రంచ భాష చేయాలన్న తపనతో విశేష కృషి చేస్తున్న సిలికానాంధ్ర మనబడి , మన తెలుగు ను అమెరికా దేశం లో ఎక్కువ మంది నేర్చుకొనే విధంగా మక్కువ కలిగించటానికి , విన్నూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది.కాలిఫోర్నియా రాష్ట్రం లోని బే ఏరియా ప్రాంతంలో తెలుగు వారు ఎక్కువగా నివసించే ప్రాంతాలయిన సన్నివేల్,శాన్ జోస్, క్యుపర్టినో ,శాంతా క్లారా, ఫ్రే మాంట్,శాన్ రామోన్,ప్లజంటన్ నగరాల లో ‘మనబడి లో చేర్పించండి తెలుగు భాష నేర్పించండి’ అనే నినాదాలతో ప్రజా రవాణా బస్సులు,రైళ్ళ పై వ్రాసిన పెద్ద పెద్ద ప్రకటనలు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈ సందర్భం గా మనబడి ఉపాధ్యక్షులు దీనబాబు కొండుభట్ల మాట్లాడుతూ , ఈ విన్నూత్న ప్రచారం అమెరికాలో నివసించే తెలుగు వారినే కాకుండా భారతీయులు మరియు ఇతర జాతీయులను కూడా ఆకర్షిస్తున్నదని, రోజు సమాచారం కోసం వారి నుంచి వచ్చే ఫోన్ కాల్సే దీనికి ప్రత్యక్ష తార్కాణం అని తెలిపారు.

మనబడి డీన్ రాజు చమర్తి మాట్లాడుతూ, భారత దేశం బయట నివసిస్తున్న తెలుగు వారందరూ, తమ పిల్లలు అమ్మ భాష ‘తెలుగు’ ను తప్పకుండా నేర్చు కోనే విధంగా ప్రోత్సాహించి, తర తరాల భాష మనుగడకు వారి వంతు భాద్యతను పోషించాలని అభ్యర్దించారు. పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం వారి గుర్తింపుతో పాటుగా, అమెరికా లోని వేక్ కౌంటీ మరియు ఫ్రేమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ వారి గుర్టింపు పొంది ,1000 మందికి పైగా స్వచ్చంద భాషా సైనికులతో ,అమెరికా లోని 35 రాష్ట్రాలు ,12 కి పైగా దేశాలలో దాదాపు 4500 మందికి విద్యార్ధులకు తెలుగు వ్రాయడం ,చదవటం మరియు మాట్లాడటం నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి, 2015-16 విద్యా సంవత్సరానికి గాను సెప్టెంబర్ 12 నుంచి తరగతులు ప్రారంభించటానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ,పిల్లలను మనబడి లో చేర్పించాలనుకొనే తల్లితండ్రులు manabadi.siliconandhra.org ని వెంటనే సందర్శించ వలసిందిగా కోరారు.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved