|
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
7 September 2017
USA
చికాగో సెప్టెంబర్ 2 & 3. సిలికానాంధ్ర మనబడి ఈ వారంతం చికాగో లో ఐదవ అంతర్జాతీయ తెలుగు మాట్లాట పోటీలను దిగ్విజయంగా నిర్వహించింది. సుమారు 120 మంది పిల్లలు పాల్గొన్న ఈ అంతిమ ఆటల పోటీలు ఈ సారి తొలి అంతర్జాతీయ పోటీలు కావడం మరొక విశేషం. ఈ ఆటల విజయానికి మనబడి భాషాసైనికులు శ్రీమతి అప్పలనేని సుజాత, భమిడి మంజుల, దామరాజు మాలతి,మరి ఎంతో మంది కార్యకర్తల అవిరామ కృషి మూల కారణం. అమెరికా మరియు కెనడా దేశాలలో 32 నగరాలలో జరిగిన ప్రాంతీయ పోటీల విజేతలందరూ ఈ పోటీలలో పాల్గొని వారికి తెలుగుపై ఉన్న ప్రతిభను చూపి పెద్దలను అబ్బుర పరిచారు..
“అంగుష్ఠప్రమితవిద్య", “ఏకాదశేంద్రియాధీశులు”, వంటి క్లిష్టమైన పదాలను వాసి, “బాహుబలి” కు విగ్రహవాక్యం, సమాసం చెప్పి, ఒక్కనిమిషం పాటు ఎటువంటి ఆంగ్ల పదాలు దొర్లకుండా పోటాపోటీగా తెలుగులోనే మాట్లాడి ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. తెలుగు వ్యాకరణం, మన సాహితీ సంప్రదాయాలు, తెలుగులో మాట్లాడటం మరియు వ్రాయటం లో చూపిన ఈ పిల్లల ప్రతిభ అమోఘం. “ఈ తెలుగు మాట్లాట పోటీలు పిల్లల భాషా ప్రావీణ్యానికి పదును పెట్టడమే కాకుండా, వారిలో సృజనాత్మక శక్తిని, నాయకత్వపు లక్షణాలని పెంపొందిస్తుందని” తెలుగు మాట్లాట అధ్యక్షడు శ్రీ నిడమర్తి శ్రీనివాస్ గారు అన్నారు.
చికాగో లో జరిగిన ఈ పోటీలకు ప్రఖ్యాత కవియత్రి, ప్రచురణకర్త భాషారత్న బిరుదుదాంకితులు, నాలుగు దశాబ్ధాలుగా అమెరికాలో తెలుగుకి ఎనలేని సేవలందిస్తున్న Dr. సొంఠీ శారదా పూర్ణ గారు, రచయిత్రి పిల్లల సాహితీవేత్త శ్రీమతి చిమట కమల గారు విచ్చేసి పిల్లలకు బహుమతి ప్రదానం చేసారు. . శ్రీమతి చిమట కమల గారు ఈ సందర్భంలో మాట్లాడుతూ, “ఈ తెలుగు మాట్లాట పోటీలు మనోరంజకంగానే కాకుండా, పిల్లల తెలుగు మనోవికాసానికి ఎంతో తోడ్పడేలా ఉన్నాయని. ప్రతి ఏటా ప్రసిద్ది పొందుతున్న ఈ ఆటలు మరి కొన్నేళ్లలో తప్పకుండా ఆంగ్ల Spelling Bee ను మించి పోగలవని” అన్నారు.
ఈ అంతర్జాతీయ తెలుగు మాట్లాట పోటీల విజేతలు:
బుడతలు (5-9 ఏళ్ల పిల్లలు):
పదారంగం: 1. హాసిని తోంటా (Hasini Thonta) 2. విభ గంజి (Vibha Ganji)
తిరకాటం: 1. విధ గంజి (Vidha Ganji) 2. ఆదిత్య ఉపాధ్యాయుల (Aditya Upadhyayula)
* విభ మరియు విధ ఇద్దరు కవల సోదరిలు కావడం మరొక విశేషం.
సిసింద్రీలు (10-14 ఏళ్ల పిల్లలు):
పదారంగం: 1.శ్రీమయి పెద్దింటి (Srimayi Peddinti) 2.ఆరుల్ కొల్ల (Arul Kolla)
తిరకాటం: 1. స్నేహ యెలవర్తి (Sneha Yelavarthi) 2.మురారి భీమవరపు (Murari Bhimavarapu)
ఒక్క నిమిషం మాత్రమె: 1. లాస్య నెరయనూరి (Lasya Nerayanuri) 2.శ్రియ సిద్దార్థ (Shriya Siddhartha)
చికాగోలో తెలుగ మాట్లాట అంతర్జాతీయ పోటీలు జరగడం ఇది మొదటి సారి. శ్రీమతి అప్పలనేని సుజాత గారు మాట్లాడుతూ “ఈ వారంతంలో సుమారు 500 తెలుగు కుటుంబాలు ఇక్కడకు విచ్చేసి, ఈ ఆటలు చూసి ఎంతో ఆనందించారు.. చికాగో పరిసర ప్రాంతాలలో సిలికానాంధ్ర మనబడి ఈ ఆటల ద్వారా మరింత వ్యాప్తి చెందినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సంకల్పానికి సహకరించిన భాషాసైనికులకి పేరుపేరునా ధ్యన్యవాదాలు” అన్నారు.
“మనబడి ద్వారా సిలికానాంధ్ర పిల్లలకు తెలుగు నేర్పడమే కాకుండా, తెలుగు మాట్లాట వంటి కార్యక్రమాలు చేబడుతోంది. మనబడి కొత్త విద్యాసంవత్సరం సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం అవుతోంది. మీరు, మీ పిల్లలను మనబడి లో జేర్పించి, మన భాష నేర్పడమే కాకుండా Foreign Language Credits కూడా పొందండి” అని మనబడి ప్రచార అధ్యక్షుడు శ్రీ రాయవరం విజయభాస్కర్ గారు, పలుకుబడి అధ్యక్షులు శ్రీ తోటపల్లి డాంజి గారు తల్లిదండ్రులను అభ్యర్దించారు. మరి ఇంకా ఎంతో మంది తెలుగు పిల్లలు ఇలా అమెరికా, కెనడాలో పుట్టి, తెలుగు నేర్చుకుని మనభాషకు వన్నె తెస్తారని ఆశిద్దాము. భాషాసేవయే భావితరాల సేవ!!
|
|
|
|
|
|