|
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
16 May 2016
Hyderabad
మే 14 ఉదయం 8:00 గంటలు. భారత సంప్రదాయ దుస్తులలో ఉరుకులు పరుగులు పెడుతున్న విద్యార్ధులు మరియు తల్లి తండ్రులు. అది ఎంసెట్ కాదు ఐ ఐ టి ఎంట్రన్స్ కాదు మరే పోటి పరిక్షా కాదు. అది అసలు ఇండియా నే కాదు. అమెరికా దేశంలో సిలికానాంధ్ర మనబడి లో తెలుగు నేర్చుకొనే విద్యార్ధులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు నిర్వహించే వార్షిక పరీక్ష అది.
ప్రపంచ వ్యాప్తంగా 37 కేంద్రాలలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన వార్షిక పరీక్షలలో 818 మంది విద్యార్ధులు జూనియర్ స్థాయి మరియు 202 మంది విద్యార్ధులకు సీనియర్ స్థాయి కోర్సులకు నిర్వహించిన వార్షిక పరీక్షలకు హాజరయ్యారు.ఈ పరీక్షలను విశ్వవిద్యాలయం ప్రతినిధులు రిజిస్ట్రార్ ఆచార్య తోమసయ్య గారు, మండలి వెంకట కృష్ణరావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంచాలకులు, ఆచార్య మునిరత్నం నాయుడు గారు, పరీక్షా నియంత్రణాధికారి డాక్టర్ వై.రెడ్డి శ్యామల గారు, భాషా శాస్త్ర విభాగం డీన్ ప్రొఫెసర్ గాబ్రియేల్ గారు పర్యవేక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా పరీక్షలు సజావుగా నిర్వహించటానికి కావలసిన ఏర్పాట్లను మనబడి పరీక్షలు మరియు గుర్తింపు విభాగ సంచాలకులు శ్రీదేవి గంటి గారు సమన్వయ పరచారు. ఈ పరీక్షల నిర్వహణకు కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని న్యూ జెర్సీ మనబడి కేంద్ర సమన్వయ కర్త కిరణ్ దుగ్గాడి గారు మరియు శ్రీరాం కోట్ని గారు సమకూర్చారు. పరీక్షలలో ఉత్తీర్ణులయిన విద్యార్ధులకు విశ్వవిద్యాలయ అధికారులచే మే 22 ఆదివారం నాడు సిలికాన్ వ్యాలిలో జరిగే స్నాతకోత్సవంలో పట్టాలు అందచేస్తారు అని మనబడి ఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు.
|
|
|
|
|
|