To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
21 January 2015
Hyderabad
ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ , తెలంగాణా ఎన్నారై ఫోరమ్ (TeNF) మరియు తెలంగాణా జాగృతి - యూకే సంయుక్తంగా లండన్ లో మీట్ అండ్ గ్రీట్ విత్ " తెలంగాణా డెప్యుటీ సీ యం - కడియం శ్రీ హరి " ఘనంగా నిర్వహించారు.
యు.కే నలుమూలల నుండి భారీగా వివిద సంస్థల కార్యకర్తలు, తెలంగాణా వాదులు హాజరయ్యారు.
ఎన్నారై టి. ఆర్. యస్ సెల్ కార్యదర్శి నవీన్ రెడ్డి అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో ... ముందుగా అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, జయశంకర్ గారికి నివాళ్ళు అర్పించి , తెలంగాణా గీతం జయ జయహే తెలంగాణా తో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ - తెలంగాణా ఎన్నారై ఫోరమ్ (TeNF) నాలుగు సంవత్సరాలలో చేసిన ముఖ్య కార్యక్రమాల వీడియో ని ప్రదర్శించి, అతిథులకు వివరించారు.
కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ, ఉద్యమం లో ఎన్నారై ల పాత్ర గొప్పదని తెలిపారు, బంగారు తెలంగాణా నిర్మాణ దిశ లో టి.అర్.యస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని వివరించారు, తను లండన్ లో గత కొన్ని రోజులు గా హాజరైన అధికారిక కార్యక్రమాల గురించి వివరించారు. టి.అర్.యస్ ప్రబుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరి సూచనలని తీసుకొని ముందుకు వెతుందని కాబట్టి మీరు కూడా ఎటువంటి సలహాలు అయిన లేదా సందేహాలు ఉన్న వ్యక్తిగతంగా నన్ను కాని, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కాని సంప్రదించవచ్చు అని తెలిపారు. మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ గారు ఆహార్ నిశలు కష్టపడ్తున్నారని ఎటువంటి సందేహాలు అవసరం లేదని హామీ ఇచ్చారు.
ప్రత్యేకించి విద్యా రంగం లో తీసుకున్న నిర్ణయాలు - విధానాల గురించి సభకు వివరించారు. బావిష్యత్తు లో ఎన్నారైలను బాగస్వాములు గా చేసుకొని విద్యా రంగంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టలనుకుంటున్నామని,కాబట్టి అందరు సహకరించి, అందులో బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
GHMC ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం కాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నారై. టి.అర్.యస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ , ఎంతో బిజీగా ఉన్నపటికీ సమయం ఇచ్చి కార్యక్రామానికి వచ్చినందుకు శ్రీ హరి గారికి కృతఙ్ఞతలు తెలిపారు, ఎన్నారై టి.అర్.యస్ సెల్ కి ఎప్పటికప్పుడు కెసిఆర్ గారు మరియు యావత్ టి.అర్.యస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. కెసిఆర్ గారి ఆదేశాల మేరకు పునర్నిర్మాణం లో కూడా వారి వెంట ఉంటామని తెలిపారు. రాబోయే GHMC ఎన్నికల్లో ప్రవాస బిడ్దలందరు, హైదరాబాద్ లో నివసించే వారి బందువులు - మిత్రుల ని టి. ఆర్. యస్ పార్టీ కి ఓటు వేయమని చెప్పాలని కోరారు.
తెలంగాణా ఎన్నారై ఫోరమ్ (TeNF) ఉపాద్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది మాట్లాడుతూ...
తెలంగాణా రాష్ట్ర సాధన లో - నేడు పునర్నిర్మాణం లో లండన్ లోని తెలంగాణా ఎన్నారై ఫోరమ్ పాత్రని వివరించారు. తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేకించి ఎన్నారై విభాఘాన్ని త్వరలో ప్రారంభించాలని కడియం శ్రీ హరి గారిని కోరారు.
జాగృతి - యూకే అద్యక్షుడు సంపత్ మాట్లాడుతూ ... సంస్థ ఆవిర్భావం నుండి చేస్తున్న కార్యక్రమాలని - బావిష్యత్తు కార్యక్రమాల గురించి సభకు వివరించారు.
చివరిగా వివిధ సంస్థల కార్యవర్గ సబ్యులు ప్రత్యేకంగా కడియం శ్రీ హరి గారిని సన్మానించి - జ్ఞాపిక బహూకరించారు.
కడియం శ్రీ హరి గారు వచ్చిన అతిథులని వ్యక్తిగతంగా వెళ్లి కలిసి సందడి చేసారు, వందన సమర్పణ తో కార్యక్రమాన్ని ముగించారు.
కార్యక్రమంలో ఎన్నారై. టి.అర్.యస్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు మంద సునీల్ రెడ్డి, సెక్రెటరీ లు నవీన్ రెడ్డి, దొంతుల వెంకట్ రెడ్డి, యు.కే ఇంచార్జ్ విక్రం రెడ్డి, శ్రీధర్ రావు, లండన్ ఇంచార్జ్ రత్నాకర్. తెలంగాణా ఎన్నారై ఫోరమ్ (TeNF) ఉపాద్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది,అడ్వైసరి బోర్డు చైర్మన్ ఉదయ్ నాగరాజు, ప్రమోద్ అంతటి, ఈవెంట్స్ ఇంచార్జ్ నగేష్ రెడ్డి, జాగృతి - యూకే ఉపాద్యక్షులు సుమన్ రావు బల్మూరీ. జీయార్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అద్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి. శ్రీకాంత్ జెల్ల,వినయ్ కుమార్ ఆకుల,సత్య , సృజన్ రెడ్డి చాడా,సతీష్ బండ,సెరు సంజయ్ ,మధు సూధన్ రెడ్డి, రాజేష్ వర్మ,సుమ దేవి,శ్వేతా, మీనాక్షి అంతటి ,రంగు వెంకట్ ,స్వాతి, సురేష్, వాణి,నరేశ్, సంతోష్, శ్రావాణ్ రెడ్డి,పావని కతి, కీషోర్ మునుగాల, గణేశ్, ప్రశాంత్, సాయి రెడ్డి, సలాం ఫరూక్ హాజరైన వారిలో ఉన్నారు.