|
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
21 November 2017
Hyderabad
డల్లాస్: అమెరికాలో తెలుగుజాతిని ఏకం చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, డల్లాస్ లో చాచా నెహ్రు జన్మదినాన్ని పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని ఘనంగా జరిపింది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ నాట్స్ ప్రతి యేటా భారత జాతి ముద్దుబిడ్డల జన్మదినోత్సవాలను జరుపుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ డల్లాస్ చాప్టర్ గత ఏడు సంవత్సరాలుగా నెహ్రు పుట్టిన రోజున బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. డల్లాస్ లోని ఫార్మర్స్ బ్రాంచ్ లోని సెయింట్ మేరీస్ చర్చ్ ఆడిటోరియం వేదికగా, దాదాపు ఎనిమిది గంటల పాటు జరిగిన ఈ సంబరాలలో భారత దేశ సంస్కృతిని, పిల్లలలోని మేధస్సును ప్రోత్సహించే దిశగా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 350 మంది బాల బాలికలు గణితం, చదరంగం, క్లాసికల్, నాన్ క్లాసికల్ సంగీతం, నృత్యం మరియు తెలుగు పదకేళి పోటీలలో అత్యుత్సాహంతో ఫాల్గొన్నారు. ఎలిమెంటరీ, మిడిల్ స్కూల్, సీనియర్ స్కూల్ పిల్లలకు విడిగా నిర్వహించిన ఈ పోటీల్లో పిల్లలు తమ వయసుకు తగ్గ ప్రతిభను చూపించారు. సాఫ్ట్ స్కూల్స్ తరఫున గూడవల్లి మణిధర్ గారు పిల్లలకు గణితంలో పోటీ పరీక్షలు నిర్వహించారు. USCF స్థానిక చాఫ్టర్ సహకారంతో నిర్వహించిన చదరంగం పోటీలో 110 మంది పిల్లలు పాల్గొన్నారు. స్థానిక సంగీత, నృత్య పాఠశాలల గురువులు, ప్రసిద్ధ కళాకారులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో మొదటి రెండు, మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి డాల్లస్ నాట్స్ బహుమతులు అందించింది.. కార్యక్రమ ఆరంభంలో డల్లాస్ చాఫ్టర్ కార్య నిర్వాహకులు మార్నేని రామకృష్ణ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని వివరించారు. ఇతర వక్తలు మాట్లాడుతూ ప్రవాసాంద్రుల పిల్లల కొరకు నాట్స్ చేస్తున్నసేవలను ప్రశంసించారు. ఈ బాలల సంబరాలు కార్యక్రమానికి ముఖ్య నిర్వాహకులుగా బాపు నూతి, కిషోర్ వీరగంధం చైతన్య కంచెర్ల, శ్రీలు మండిగ వ్యవహరించారు. డాలస్ చాప్టర్ కార్య నిర్వాహకులు రామకృష్ణ మార్నేని, కార్యవర్గ సభ్యులు రాజేంద్ర మాదాల, శేఖర్ అన్నే, రామకృష్ణ నిమ్మగడ్డ, అమర్ అన్నే, కృష్ణ వల్లపరెడ్డి, జగదీష్ దరిమడుగు, మురళి పళ్ళబోతుల, కిరణ్ జాలాది, విజయ్ వెలమూరి, శ్రీధర్ కోడెల, ఆది గెల్లి, మరియు ఇతరులు పూర్తి సహయ సహకారాలు అందించారు.. ఇంకా ఈ కార్య క్రమంలో నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్స్ రాజేంద్ర మాదాల, డా. చౌదరి ఆచంట, జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ కోనేరు, బాపు నూతి, శేఖర్ అన్నే పాల్గొని వారి తోడ్పాటుని అందించారు.
స్థానిక బిర్యానీస్ & మోర్ రెస్టారెంట్, సాఫ్ట్ స్కూల్స్.కామ్, మరియు ధరణి రెస్టారెంట్ ఈ కార్యక్రమ నిర్వహణకు తమ సహాయాన్ని అందించారు. స్థానిక సంస్థలైన టాంటెక్స్, టీ పాడ్, మరియు సిలికానాంధ్ర మనబడి నాట్స్ బాలల సంబరాలకు తమ వంతు చేయూత అందించాయి.
Competition Category |
Winner - 1st Prize |
Winner - 2nd Prize |
Winner - 3rd Prize |
Winner - 4th Prize |
Winner - 5th Prize |
Classical Singing - Geethams
(8 Yrs or below) |
Vrishnak Ramadugu |
Ananya Miyapuram |
Sowmya Nandyala |
|
|
Classical Singing - Varnams (Grades 1-10) |
Rohit Venkatesh |
Sai Harshini Akarapu |
Karishma Pilla |
Classical Singing - Keerthanas,
Kruthis (Grades 1-10) |
SreyaLaxmi Kodela |
Harish Venkatraman |
Harini Venkatesh |
Non Classical Singing (8 Yrs or below) |
Arjun Sripal Medara Metla |
Jishnav |
Ananya Miyapuram |
Non Classical Singing (Grades 1-10) |
SreyaLaxmi Kodela |
Yashaswini Nalla |
Roshni Buddha |
Classical Dance (Grades 1-5) |
Vasundhara Jaligama |
Tanvi Murreddi |
Samarth Setty |
Classical Dance (Grades 6-10) |
Shriya Veluri |
Aneesha Kandikonda |
Shreya Sahu |
Non Classical Dance (Grades 1-5) |
Manya Jonnadula |
Tanvi Murreddi |
Sruthi Venkataraman |
Classical Singing - Group Competitions |
Shanmughapriya Group
(Sarayu Ram, Shruthi M Ramji,
Reema Nannapaneni,
Nikhita Nannapaneni,
Kailash Ramakrishnan,
Rohit Venkatesh) |
|
|
Telugu Vocabulary |
Laasya Uppalapati |
Pranavi Madala |
Srividya |
Chess U400 (Grade K-3) |
Grace Weng |
Harish Venkatraman |
Inesh Nallamathu |
Nubaid Khan |
Rohan Bandi |
Chess U600 (Grade K-12) |
Abhinav Bhagavan |
JJ Otto |
Aman Modi |
Manyu Reddy Thota |
Sanjay Saminathan |
Chess U900 (Grade K-12) |
Aryton Harried |
Keshav Yamagani |
William Weng |
Shrivas Edupuganti |
Christopher Thomas |
Chess Open (Grade K-12) |
Aryan Gutla |
Anirudh Sudarshan |
Sidharth Goteti |
Shreya Ravichandar |
Yash Vallapareddy,
Sanjeev Ravichandar,
Shaurya Mazumdar |
Math Challenge - Grade 1 |
Arjun Sripal Medara Metla |
Joshita |
Abhinav Malkapur |
|
|
Math Challenge - Grade 2 |
Preetham Thippana |
Saketh Chebrolu |
Sadhana Maddineni |
Math Challenge - Grade 3 |
Sarayu Nadella |
Medha Mallu |
Shruthi Venkataraman |
Math Challenge - Grade 4 |
Abhinav Bhagavan |
Harini Venkatesh |
Sudeep B |
Math Challenge - Grade 5 |
Karishma Pilla |
Yashita Chunduru |
Harish Venkataraman |
Math Challenge - Grade 6-8 |
Amith Siripurapu |
Reema Nannapaneni |
Neha Darimadugu |
|
|
|
|
|
|