pizza
NATS - Bay Area Annual Day Social Mixer and Holiday Party - A GREAT SUCCESS
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

19 December 2013
Hyderabad

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్... బే-ఏరియాలో తెలుగువారికి మరింత చేరువ అవుతోంది . నాట్స్ బే-ఏరియా వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. ఏర్పాటు చేసిన వేడుకలకు తెలుగువారి నుంచి విశేష స్పందన లభించింది. డిసెంబర్ 15 వ తేదీన జరిగిన ఈ వార్షికోత్సవ వేడుకకు అతిథి ఇండియన్ క్యూజన్ వేదికగా మారింది..దాదాపు రెండు వందల మందికి పైగా తెలుగువారు ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ఆరోగ్య సదస్సు..
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు... మరి, ఆ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి.. ఫిట్ గా ఎలా ఉండాలి. ఐటీ ఉద్యోగులు తమ ఆరోగ్యంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై నాట్స్ బే ఏరియా చాఫ్టర్ .. తెలుగువారి కోసం ఆరోగ్య సదస్సు నిర్వహించింది.. ఆరోగ్య నిపుణురాలు రచన.. సాటి తెలుగువారికి ఎన్నో అమ్యూలమైన సూచనలు అందించారు.

సంపద మెళుకువలు..
ఆరోగ్య సంపదతో... ధన సంపద కూడా ముఖ్యమే అని భావించిన నాట్స్ తన బేఏరియా వార్షికోత్సవం లో సంపద నిర్వహణపై కూడా సదస్సు నిర్వహించింది. లడ్డి జ్యోతి వెల్త్ మేనేజ్ మెంట్ పై విలువైన ప్రసంగం చేశారు. ఈ సదస్సుకు విచ్చేసిన వారికి అమూల్యమైన సలహాలు, సూచనలు అందించారు.

మీ అభిమానమే నాట్స్ కు కొండంత అండ...
నాట్స్ పై ప్రతీ ఒక్కరు చూపిస్తున్న అభిమానమే... రోజు రోజుకీ నాట్స్ పరిధిని పెంచుతుందని నాట్స్ బే ఏరియా సమన్వయ కర్త శ్యాం జాగర్ల మూడి అన్నారు.

నాట్స్ బే ఏరియా వార్షికోత్సవం సందర్భంగా ఆయన నాట్స్ లక్ష్యాలు.. సాధించిన విజయాలను సమగ్రంగా వివరించారు. అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలబడటంలో నాట్స్ ఎప్పుడూ ముందే ఉంటుందన్నారు. బే ఏరియాలో నాట్స్ కు మద్దతిస్తున్న తెలుగు కుటుంబాల సంఖ్య క్రమ క్రమంగా పెరగడాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంలో నాట్స్ చరిత్ర సృష్టించిందని అన్నారు. భారతదేశంలో అనాధ పిల్లల విద్యకు నాట్స్ అందిస్తున్న చేయూత గురించి శ్యాం జాగర్లమూడి వివరించారు. అమెరికాలో తెలుగు కుటుంబాలు ఇస్తున్న ప్రోత్సాహంతోనే ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. భవిష్యత్ లో నాట్స్ పరిధి మరింతగా విస్తరిస్తుందన్నారు. నాట్స్ అనేది ఓ కుటుంబం లాంటిదని..ఎవరికి ఏ కష్టం వచ్చినా అది అండగా నిలబడుతుందని శ్యాం జాగర్లమూడి తెలిపారు.

NRIVA, టీసీఏ సంస్థల సహాకారంతో నాట్స్ భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలను బే ఏరియాలో చేపడతుందన్నారు. ఇక బే ఏరియాలో ప్రవాసాంధ్ర ప్రముఖులు విజయ్ చవ్వా నాట్స్ కు ఇస్తున్న మద్దతును కూడా శ్యాం జాగర్లమూడి కొనియాడారు. ప్రతి మూడు నెలలకు ఒక్కసారి.. బే ఏరియాలో వైద్యశిబిరాలు, రక్త దాన శిబిరాలు నిర్వహించాలని భావిస్తుందని శ్యాం తెలిపారు. తనకు నాట్స్ బే ఏరియా టీం సభ్యుల నుంచి అందుతున్న సాయం మరువలేనిదని అన్నారు.

శ్యాం జాగర్లమూడికి ఘన సత్కారం
ఇక నాట్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన శ్యాం జాగర్లమూడిని బేఏరియాలో ప్రముఖ వ్యాపార వేత్త సురేష్ కట్టాతో పాటు.. ఇక ఇప్పటికే రాణి దావూలూరి, రాజా జక్కిలటి, సుమన్ భార్గవ, నాగేశ్వరరావు సోమ, కిషోర్ లాంటి తెలుగు ప్రముఖులతో పాటు NRIVA టీం కుచెందిన కృష్ణ ఎలిశెట్టి., రవిచంద్ర అనంత లు

ఘనంగా సత్కరించారు. నాట్స్ వార్షికోత్సవ సభకు విచ్చేసిన తెలుగువారికి.. నాట్స్ పరిధిని పెంచేందుకు తోడ్పడుతున్న ప్రతీ ఒక్కరికీ రాజా జక్కిలాటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రేయ సోమ ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యానికి ఈ వార్సికోత్సవ అందరి నుంచి మంచి ప్రశంసలు లభించాయి. ఇక నాట్స్ బే ఏరియా వార్షికోత్సవంలో తెలుగింటి విందు పసందు చేసింది. అమ్మ చేతి వంటలను గుర్తు చేసింది

NATS with the help of local service organizations in bay area organized an Annual Day and Holiday party cum Social Mixer on 15th Dec 2013 at Athidhi Indian Cuisine at 5.30 PM. More than 200 people attended and enjoyed the party and also derived immense benefits of these complimentary lectures.

In view of this Social Mixer, NATS local chapter arranged community benefiting lectures by Rachna on Health Tips and how to be fit for long hours for IT engineers and also another lecture by Laddi Jhuty for NRI wealth management. Both have them explained the challenges met by NRIs for health and wealth management. People have enjoyed the lectures by attentive hearing.

NATS Bay Area In-charge and VP Sri Sam Jagarlamudi took other organizations like NRIVA, TCA help and coordinated this kind of community benefiting program for the second time in Bay Area on the occasion of NATS Annual day . He said NATS will conduct this kind of community programs at regular intervals to support progression of community members in bay area.

Sam Jagarlamudi along with NATS local team: Raja Jakilati, Suman Bhargava, Rani Davuluri, Nageswara Rao Soma have also did membership drive for NATS.

Sri Vijay Chavva, a well-known NRI of Bay area who supported the event and also NATS initiatives has welcomed the delegates and given opening remarks and appreciated NATS and Sam's initiatives and reaching the community. He re-iterated his support for NATS and any other social events by Telugu Organizations.

Sam Jagarlamudi who is the NATS Bay Area In charge while speaking to the audience has promised to build an excellent and wonderful organization for NATS local chapter and also do community service through the programs like free medical camps, educational assistance. he also explained NATS service levels in INDIA and USA. He requested help from the participants to come forward and support NATS initiatives. He has also appreciated Sri Vijay Chavva and his thought process of community service. He also deeply appreciated Sri Vijay Chavva for supporting NATS initiatives in bay area and thanked for standing as the main pillar.

Suresh Katta a prominent business man from Bay Area along with local NATS team consisting of Rani Davuluri, Raja Jakilati, Suman Bhargava, Nageswara Rao Soma, Kishore and NRIVA team Krishna Yelishetty, Ravichandra Anantha honored Sri Sam for getting elected a NATS VP and for coming forward to serve the Telugu community in Bay Area.

Participants who heavily participated in these highly interactive sessions of guest lectures were very much impressed and requested to continue community benefiting lectures at least once in quarter apart from NATS free medical programs, blood donation camps and other social activities.

The classical dance performed by Shreya Soma has received appreciation from all corners.

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2013 Idlebrain.com. All rights reserved