To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
23 April 2014
Hyderabad
The Chicago Telugu Association (CTA) and North America Telugu Society (NATS) together on a grand scale have celebrated Sri Jaya nama Ugadi & SriRamaNavami-2014 in Chicago from 4:00pm to 9:00pm on Saturday April 19th, 2014 at cultural auditorium in Hindu temple of Greater Chicago, Lemont. The event was conducted by CTA Mahila cultural team led by Sujana Achanta.
The celebration was conducted to preserve and promote the Telugu cultural heritage and traditions among the Telugu speaking people residing in Chicago. The weather was great after a long winter in Chicago and lot of Telugu families attended the event; well greeted and welcomed by the CTA Mahila registration team led by Rama Koppaka, Rani Vege, Lohitha Tunuguntala and Bhavani Karampudi. Venue was beautifully decorated by Bindu Balineni, Sailaja Pulavarthi and Ramesh Maryala.
The auditorium was filled with festive atmosphere with over 800 people attending the event. The event started off with Pahi Pahi Gajanana by Bharata Bharati Music school. CTA Mahila cultural team lead Sujana Achanta welcomed and wished everyone Jaya nama Ugadi and Sri Rama Navami and hoped that the new year will bring happiness and prosperity to all the families. She mentioned that around 150(Adults/kids) worked tirelessly for the last 5 weeks to perform at the event. She also mentioned that CTA as an organization focuses on serving the Telugu community and requested the community to provide feedback in order to serve and propagate Telugu culture.
The evening was filled with various classical performances, classical songs and latest dhamaka songs along with colorful mix of folk songs. Telugu Elocution on Ugadi/Sri Rama Navami performed by group of kids speaking in Telugu was well received by the audience. The highlight of the evening was Ramayanam skit coordinated by Lakshmi Bojja and done by group of 12 kids dressed in various colorful costumes mesmerized the audience and the hall reverberated with applause. Kuchipudi and Bharatanatyanam dances performed by the students of Shobha Tammana , Dr Uma Kallakuri,Vidya Pandikara and Preetha Ganeshan enthralled the audience and received great applauses from the audience. Classical songs sung by the students of Valli and Asha rao got good response from the audience. Painting competition was conducted by Shashank Vege and Rama Koppaka and kids have come up with wonderful paintings. Fashion show at the end by the kids and women added great beauty to the evening. Overall there was a great variety of programs conducted throughout the evening. The program was anchored by Sahini, Girinandini, Geeth, Shreya, Sanjana and Anikait.
CTA President Srinivas Boppana praised the CTA Mahila team for conducting an outstanding event and thanked the Telugu families for making the event successful. He thanked the Hindu temple management Bhima Reddy & Sirisha Akula for providing the temple auditorium for the event. He welcomed all the families to the CTA-NATS annual Telugu Festival 2014 that will be held in June. He thanked all the volunteers, participants and parents who encouraged the kids to participate in the event. He presented the trophies to the Painting competition winners and felicitated the classical dance teachers on behalf of CTA. NATS Chairman of the Board Dr. Madhu Korrapati and NATS President Gangadhar Desu congratulated CTA and NATS team for conducting such a wonderful event.
Authentic food was served to attendees by food committee members including Varaprasad Bodapati, Nagendra Vege, Vijay Venigalla, Laxman Kolli, Niranjan Vallabhaneni, Vamsi Manne, Ramagopal Koganti, Sailender Sunkara, Manohar Pamulapati, Anil Kodidini, Harshavardhan Reddy Munagala, Murali Koganti, Srinivas Kotla, Krishna Muvva and Murali Kalagara. Food was sponsored by Cool Mirchi restaurant.
CTA Vice President Murthy Koppaka presented the vote of thanks to all members, attendees and sponsors for their support and participation. He thanked the entire team of CTA Mahila – Sujana Achanta, Lakshmi Bojja, Rani Vege, Rama Koppaka, Havilah Maddela, Bhavani Karampudi, Lohitha Tunuguntla, Sailja Pulavarthi, Sandhya Ambati, Karishma Pilla, Kalyani Kopganti and Bindu Balineni for organizing a wonderful event. He thanked SwadesMedia USA for capturing and providing video coverage for the event.
CTA thanked Ramesh Maryala, Subba Rao Putrevu, Harshavardhan Reddy Munagala, Sridhar Mumgandi, Rao Achanta, Ravi Achanta, Dr Paul Devarapalli, Phalalochana Rao Vankayalapati, Ram Tunuguntla, Madan Pamulapati, Manahor Pamulapati, Aravind Koganti, Srikanth Bojja, RK Balineni and Venu Krishnadurdula for supporting the CTA Mahila team in successfully conducting the event.
చికాగో లో తెలుగు పండుగల సందడి ***సీటీఏ, నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ***
ఏప్రిల్ 19: చికాగో: జయ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చికాగో లోని నార్త్ అమెరికా తెలుగు సంఘం నాట్స్, చికాగో తెలుగు సంఘం సీటీఏ ఉగాది, శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించాయి. గ్రేటర్ చికాగో లోని హిందు దేవాలయం, కల్చరల్ ఆడిటోరియంలో తెలుగు సంప్రదాయాలు ఉట్టి పడేలా ఈ వేడుకలు జరిగాయి. సుజన ఆచంట ఆధ్వర్యంలో సీటీఏ కల్చరల్ టీమ్, నాట్స్ సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహించాయి. చికాగో లో నివసించే తెలుగు ప్రజలు ఈ ఉగాది సంబరాల్లో పాల్గొనేందుకు పోటీ పడ్డారు. రమ కొప్పాక, రాణి వేగె, లోహిత తూనుగుంట్ల, భవానీ కారంపూడి లు ఈ ఉగాది ఉత్సవాలకు హాజరయ్యే వారి పేర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 800 మంది ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ముందుకొచ్చారు. బిందు బాలినేని, శైలజ పులవర్తి, రమేష్ మర్యాల ఉత్సవ వేదికను అద్భుతంగా అలంకరించారు. భారత భారతీ సంగీత పాఠశాల వారిచే పాహి పాహి గజానన అనే శ్లోకం తో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సుజన ఆచంట ఈ ఉత్సవాలకు విచ్చేసిన వారికి జయ నామ సంవత్సర ఉగాదితో పాటు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. జయ నామ సంవత్సరాన తెలుగు కుటుంబాలకు జయం కలగాలని సుజన అకాంక్షించారు.
గత ఐదు వారాల నుంచి సుజన ఆచంట తో పాటు దాదాపు 150 మంది పెద్దలు, చిన్నారులు ఈ ఉత్సవాల కోసం ఎంత గా శ్రమించారో సుజన వివరించారు. తెలుగు సంప్రదాయాల పరిరక్షణకు నాట్స్ , సీటీఏ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.. తాము చేపడుతున్న కార్యక్రమాలపై వస్తున్న మంచి స్పందన వల్లే.. తెలుగు వారి కోసం మరింత ఉత్సాహంగా పని చేస్తున్నామని సుజన అన్నారు. ఉగాది, శ్రీరామనవమి పండుగలపై తెలుగు ఉచ్ఛారణ.. మాటల పోటీలు తెలుగు ప్రేమికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు తాము నేర్చుకున్న తెలుగు పాండిత్యాన్ని ప్రదర్శించారు. సాయంత్రం జానపద పాటలతో పాటు వివిధ శాస్త్రీయ సంగీతం, తాజా తెలుగు పాటలతో మ్యూజిక్ ధమాకా కు మంచి స్పందన లభించింది.
12 మంది చిన్నారులు రామాయణం నాటకాన్ని ప్రదర్శించిన తీరుకు సభికుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. లక్ష్మి బొజ్జా గ్రూపు ప్రదర్శించిన ఈ నాటకంలో అందమైన రంగు రంగుల వస్త్రాలతో చిన్నారులు రామాయణాన్ని కళ్లకు కట్టడంతో ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. శోభ తమ్మన, డాక్టర్ కాళ్లకూరి, విద్య పండికర, ప్రీతా గణేశన్ లు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి . వారు చేసిన నాట్యం ప్రేక్షకులను మంత్ర ముగ్థులను చేసింది. వల్లి, ఆశా రావు లు పాడిన శాస్త్రీయ గీతాలకు మంచి స్పందన లభించింది. మరోవైపు శశాంక్ వేగే, రామ్ కొప్పాక నిర్వహించిన చిత్ర కళా పోటీల్లో చాలా మంది చిన్నారులు పాల్గొన్నారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలు గీశారు..
ఇక మహిళలు, చిన్నారులు నిర్వహించిన ఫ్యాషన్ షో కూడా అందాల కనువిందు చేసింది. ఈ ఉత్సవాల్లో అనేక కార్యక్రమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సాహిని, గిరినందిని, గీత్, శ్రేయ, సంజన, అనికేత్ లు ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సీటీఏ మహిళా టీం ఈ వేడుకలను అద్భుతంగా నిర్వహించిందని సీటీఐ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బొప్పన ప్రశంసల వర్షం కురిపించారు.. ఈ వేడుకల్లో పాలుపంచుకున్నవారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుక నిర్వహణకు సహకరించిన హిందు దేవాలయ నిర్వాహకులు భీమ్ రెడ్డి, సురేష్ ఆకుల కు శ్రీనివాస్ బొప్పన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జూన్ లో నిర్వహించనున్న నాట్స్, సీటీఏ వార్షిక ఉత్సవాలకు తెలుగు కుటుంబాలు రావాలని బొప్పన ఆహ్వానించారు. చిత్రకళలో అద్భుతమైన చిత్రాలు వేసిన వారికి, నాట్య గురువులకు బహుమతులను సీటీఏ, నాట్స్ అందచేసింది. ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన సీటీఏ, చికాగో నాట్స్ ఛాప్టర్ ల పై ప్రశంసల వర్షం కురిసింది. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఛైర్మన్ డా. మధు కొర్రపాటి, ప్రెసిడెంట్ గంగాధర్ దేసు లను సీటీఏ, చికాగో నాట్స్ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు.
స్థానికంగా ఉండే కూల్ మిర్చి రెస్టారెంట్ స్పాన్సర్ చేసిన తెలుగింటి విందు మంచి పసందు చేసింది. వర ప్రసాద్ బోడపాటి, నాగేంద్ర వేగె, విజయ్ వెనిగళ్ల, లక్ష్మణ్ కొల్లి, నిరంజన్ వల్లభనేని, వంశీ మన్నే,రామ్ గోపాల్ కోగంటి, శైలేందర్ సుంకర, మనోహార్ పాములపాటి, అనిల్ కొడిదిని, హర్షవర్థన్ రెడ్డి మునగాల, మురళీ కోగంటి, శ్రీనివాస్ కోగంటి, శ్రీనివాస్ కోట్ల, కృష్ణ మువ్వ, మురళీ కలగర తదితరులు వుడ్ కమిటీ ద్వారా తమ సేవలు అందించారు.
ఈ ఉగాది ఉత్సవాలకు ఆర్థిక, హార్దిక మద్దతిచ్చిన స్పాన్సర్లకు, ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సీటీఏ వైఎస్ ప్రెసిడెంట్ మూర్తి కొప్పాక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా సీటీఏ మహిళా టీం.. సుజన అచంట, లక్ష్మి బొజ్జ, రాణి వేగె , రమ కొప్పాక, హవీల మద్దెల, భవానీ కారంపూడి, లోహిత తూనుగుంట్ల, శైలజ పులవర్తి, సంధ్య అంబటి, కరిష్మా పిల్లా, కల్యాణి కోగంటి , బిందు బాలినేని తదితరులకు నాట్స్, సీటీఏ నాయకత్వం నుంచి ప్రశంసల వర్షం కురిసింది. రమేష్ మర్యాల, సుబ్బారావు పుట్రేవు, హర్షవర్థన్ రెడ్డి మునగాల, శ్రీధర్ ముంగండి, రావ్ అచంట, రవి అచంట, డాక్టర్ పాల్ దేవరపల్లి, ఫలలోచన రావ్ వంకాయలపాటి, రామ్ తూనుగుంట్ల, మదన్ పాములపాటి, మనోహార్ పాములపాటి, అరవింద్ కోగంటి, శ్రీకాంత్ బొజ్జ, ఆర్కే బాలినేని, వేణు కృష్ణ దుర్దుల తదితరులు మద్దతుతో ఈ ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్వదేశ్ మీడియా ఈ ఉగాది ఉత్సవాల వీడియో కవరేజ్ చేసింది.