To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
19 November 2015
Hyderabad
డల్లాస్ , నవంబర్ 16. 2015.అమెరికాలో తెలుగుజాతికి తన విశేష సేవలతో దగ్గరైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్), డాలస్ లో నవంబర్ 15న స్థానిక సయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ చర్చ్ లో ఘనంగా బాలల సంబరాలను నిర్వహించింది. ప్రతి ఏటా పండిట్ జవహర్లాల్ నెహ్రు జన్మదినం సందర్భంగా నాట్స్ బాలల సంబరాలను ఒక సంప్రదాయంలా జరుపుతోంది. దాదాపు ఏడు గంటల పాటు సంతోష సంబరాలను తెలుగువారికి పంచిన ఈ కార్యక్రమంలో దాదాపు 300 మందికి పైగా బాల బాలికలు ఉత్సాహంగా ఫాల్గొన్నారు.
బాలల సంబరాలను పురస్కరించుకుని మాథ్ , అమెరికన చదరంగం లో చాంపియన్ , క్లాసికల్, నాన్ క్లాసికల్ సంగీతం, క్లాసికల్, నాన్ క్లాసికల్ నృత్యం మరియు తెలుగు పదకేళి అంశాల్లో నాట్స్ పోటీలు నిర్వహించింది. పదేళ్లలోపు, పదేళ్లపైన ఉన్న చిన్నారులను రెండు వర్గాలుగా విభజించి నిర్వహించిన ఈ పోటీల్లో అనేక మంది పిల్లలు తమ ప్రతిభను చూపెట్టారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నాట్స్ వారు బహుమతులు అందించారు.
బాలల సంబరాల నిర్వహణలో నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు బాపు నూతి, శేఖర్ అన్నే, వీణా యలమంచిలి, రాజేంద్ర మాదాల, నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్స్ విజయ్ వెలమూరి, శ్రీనివాస్ కోనేరు, డాలస్ చాప్టర్ కార్య నిర్వాహకులు శ్రీనివాస్ కావూరు, కార్యవర్గ సభ్యులు కిషోర్ వీరగంధం, చైతన్య కంచర్ల, ఉమా అట్లూరి, రాజా మాగంటి, రామకృష్ణ నిమ్మగడ్డ, పూజ, అనంత్ మల్లవరపు, అమర్ అన్నే, అజయ్ గోవాడ, ఆది గెల్లి, వెంకట్ కొల్లి మరియు ఇతరులు పూర్తి సహయ సహకారాలు అందించి తోడ్పడ్డారు.
ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం తరఫున డాక్టర్ ఉరిమిండి నరసింహారెడ్డి గారు, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు పాల్గొన్నారు. స్థానికంగా ప్రసిద్దులైన ప్రముఖ సంగీత, నృత్య గురువులు న్యాయ నిర్ణేతలు గా వ్యపహరించారు. వక్తలు తమ ప్రసంగాలలో ప్రవాసాంద్రుల పిల్లల కొరకు నాట్స్ గత కొన్ని సంవత్సరాలు నుండి బాలల సంబరాలు కార్యక్రమం ద్వారా చేస్తున్న సేవలను ప్రశంసించారు. సాఫ్ట్ స్కూల్స్ తరఫున మణిధర్ గూడవల్లి గారు పిల్లలకు లక్కీ డ్రా నిర్వహించి ఉచిత శిక్షణ కూపన్లను అందచేసారు.
స్థానిక ఫ్రిస్కో బావర్చి, softschools.com, Sage IT, Gideon Carrolton, Heartland Montessori, MySap Group, South Fork Dental and Ram Konara ఈ కార్యక్రమ నిర్వహణకు తమ సహాయాన్ని, యువ తెలుగు రేడియో, టీవీ 5, దేశి ప్లాజా, ఐనా టీవీ, 6 టీవీ, , టీవీ 9 మీడియా సహకారాన్ని అందించారు. ఫ్రిస్కో బావర్చి రెస్టారెంట్ వారు అతిధులకు స్నాక్స్, టీ, కూల్ డ్రింక్స్ అందించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, స్థానిక డల్లాస్ తెలుగు ప్రజానీకానికి చేస్తున్న తమ విశిష్ట సేవలతో నాట్స్ డల్లాస్ చాప్టర్,ఇతర చాప్టర్ లకు మరొక్కమారు ఆదర్శప్రాయంగా నిలిచింది.