To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
08 August 2016
USA
August 7th 2016: Dallas, TX: NATS (North America Telugu Society), conducted a free health camp in association with TANTEX at Southfork Dental, Irving Office on August 7th, 2016. Over 200 patients have attended this event. Renowned Telugu physicians are volunteered in this free health camp and gave their valuable suggestions to the patients. In this health camp, patients got checked on blood glucose levels and blood pressure, doctors gave advice on healthy food habits, required lifestyle changes. Free glucometers also distributed for diabetic patients. The doctors who participated in this camp are Dr. Kishore Eraprolu (Family Physician), Dr. Vandana Maddali (Family Physician), Dr. Raju Kosuri (Cardiologist), Dr. Deepika Koya (Gastroenterologist), Dr. Sridevi Guttikonda (Endocrinologist), Dr. Bindu Kolli (Dentist) along with Adi Gelli (Pharmacist). Dr. Lata&Venkat Yedlapalli provided the necessary equipment for this camp.
This event is co-ordinated by Venkat Kolli& Adi Gelli from NATS and Subrahmanyam Jonnalagadda from TANTEX. Student volunteers Bhargavi Devabhaktuni, Laya Devabhaktuni, Keertana Kambhoji, Sivani Eluri helped during the event. NATS Board of director Dr. Bindu Kolli thanked the NATS volunteers Nagaraju Tadiboyina and Srilakshmi Mandiga for spreading the word out in the community and NATS volunteers Ramakrishna Marneni, Chaitanya Kancharla, Ramakrishna Nimmagadda, Murali, Jyothy Vanam, Ajay GovaDa, Bapu Nuthi, Sridhar Tummala for helping to make this event successful. She also thanked KC Chekri and Venkat Narpala promoting this event through media.
SRC pharmacy, Southfork Dental sponsored this event along with annual sponsors Bawarchi Biryani Point, United IT, Accel International.
TV5, TV9, TV6, AinaTV, DesiPlaza, YuvaMedia, Mydeals Hub, TNI Live are the media partners for this event.
ఆగస్ట్ 7వ తారీకు ఆదివారం నాడు నాట్స్ సంస్థ ఇర్వింగ్ సౌత్ఫోర్క్ డెంటల్ క్లినిక్ లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో వివిధ రంగాలలో ప్రముఖ వైద్యులు రెండువందల మంది కి పైగా హెల్త్ చెకప్స్ నిర్వహించి తమ సలహాలు సూచనలు అందించారు. ఈ శిబిరం లో మధుమేహము మరియు రక్తపోటు ఉన్నవారికి ప్రత్యేక పరీక్షలు చేసి వారికి పౌష్టికాహారం, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య జీవనశైలి ఆవశ్యకతను వివరించారు. ఈ శిబిరం లో డా. కిషోర్ యర్రప్రోలు తో పాటు, డా. వందన మద్దాలి, డా. రాజు కోసురి (కార్డియాలజిస్ట్), డా. దీపిక కోయ (గాస్ట్రొ ఎంట్రాలజిస్ట్), డా. శ్రీదెవి గుత్తికొండ (ఎండోక్రైనాలజిస్ట్), డా. బిందు కొల్లి (డెంటిస్ట్), ఆది గెల్లి (పార్మశిస్ట్) పాల్గొని తమ సేవలందించారు. డా. లత & వెంకట్ యడ్లపల్లి గార్లు శిబిరానికి అవసరమయిన సామాగ్రి కూర్చటంలో తమ సహాయాన్ని అందించారు.
ఈ వైద్య శిబిరానికి నాట్స్ సంస్థ నుండి వెంకట్ కొల్లి, ఆది గెల్లి వ్యవహరించగా, టాంటేక్స్ సంస్థ నుండి ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ కోఆర్డినేటర్లు గా వ్యవహరించారు. విద్యార్థి వాలంటీర్స్ గా లయ దేవభక్తుని, భార్గవి దేవభక్తుని, కీర్తన కాంభోజీ , శివాని ఏలూరి పాల్గొన్నారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ గా కూడా ఉన్న డా. బిందు కొల్లి మాట్లాడుతూ ఈ శిబిరం ఇంత విజయవంతం కావటానికి సహకరించిన వైద్యులు అందరకూ, ఇక్కడకు విసిట్ కు వచ్చి ఉన్న తల్లి తండ్రులలో ఈ వైద్య శిబిరం గురించి ప్రచారం కల్పించిన నాట్స్ వాలంటీర్స్ నాగరాజు తాడిబోయిన, శ్రీలక్ష్మి మండిగ లకు మరియు NATS టీం మెంబెర్స్ చైతన్య కంచర్ల, కిషోర్ వీరగంధం, రామకృష్ణ నిమ్మగడ్డ , మురళి, జ్యోతి వనం, రామక్రిష్ణ మార్నెని, అజయ్ గోవాడ, బాపు నూతి, శ్రీధర్ తుమ్మల లకు అలాగే ప్రత్యేక శ్రద్ద తీసుకొని మీడియా తరుపున ప్రచారం లో సహకరించిన కె సి చేకురి, సుబ్బారెడ్డి నరపాల లకు తమ ధన్యవాదాలు తెలిపారు.
ఈ శిబిరానికి వచ్చి సేవలు వినియోగించుకున్న మధుమేహ రోగులకు ఉచితం గా గ్లుకోమీటర్ లు కూడా పంపిణీ చేశారు. ఈ శిబిరానికి ఈవెంట్ స్పాన్సర్లు గా SRC ఫార్మసీ, సౌత్ఫోర్క్ డెంటల్ , సంవత్సర స్పాన్సర్లు బావార్చి బిర్యాని, యునైటెడ్ ఐటి, యాక్సెల్ ఇంటెర్నేషనల్ వ్యవహరించాయి.
మీడియా పార్ట్నర్లు గా యువ మీడియా, దేశిప్లాజా, TV9, TV5, aina TV, TV6, మైడీల్స్ హబ్, TNI వ్యవహరించాయి.