To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
17 October 2016
USA
సేవే గమ్యం అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ న్యూ యార్క్ రాధా గోవింద్ ధామ్ లో అక్టోబర్ 16 న ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. ఈ ఉచిత వైద్య శిబిరానికి స్థానికంగా ఉండే భారతీయ వైద్యులు తమ సేవలందించేందుకు ముందుకొచ్చారు. 100 మందికి పైగా రోగులకు ఉచితంగా ఈ శిబిరం లో సేవ లందించారు. షుమారు 80 మందికి ఉచితంగా ఫ్లూ షాట్స్ ఇచ్చారు. రోగులందరికీ ఉచితంగా భౌతిక పరీక్షలు మరియు మందుల సమీక్షలు చేశారు. రోగులకు రక్తం లో చక్కెర మరియు రక్త పోటు తనిఖీలు నిర్వహించారు. వాల్గ్రీన్స్ నుండి జొసీ. ఎల్ ఉచితంగా ఫ్లూ వాక్సీన్స్ పంపిణీ చేశారు.
డా. మధు కొర్రపాటి నాయకత్వం లో పలువురు వైద్యులు డా. కనుమిల్లి జానకి, డా. మద్దినేని దుర్గ, డా. వాసిల్ తరుణ్, డా. చకోటే జ్యోతి, డా. చకోటే వైజినాథ్, డా. మెహ్రా సునీల్ మరియు డా.బాత్రా ఉచితంగా సేవలందించేందుకు ముందుకొచ్చారు.
రాధా గోవింద్ ధామ్ నుండి కి చెందిన శ్రీ. రోహిత్ శర్మ నాయకత్వం లోని వాలంటీర్ల బృందం సేవ లందించారు. త్వరలో, ఇదే సీజన్లో మరొక హెల్త్ క్యాంపు నిర్వహించి ఉచిత ఫ్లూ షాట్స్ ఇవ్వాలని నాట్స్ న్యూ యార్క్ చాప్టర్ నిర్ణయించింది.