To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
24 April 2017
అమరావతి
అమెరికాలో తెలుగుజాతి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఘనంగా నిర్వహించే అమెరికా తెలుగుసంబరాలకు ఆహ్వానాలు అందించేందుకు ఇండియాకు వచ్చింది.. సేవే గమ్యం అంటూ నాట్స్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించడంతో పాటు పలువురు ప్రముఖులను నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ను అమెరికా తెలుగు సంబరాలకు రావాలని కోరింది. సంబరాల పరమార్థం కూడా సేవే అని చెబుతూ తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించింది. అమెరికాతో పాటు ఇండియాలో కూడా నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలపై నారా లోకేశ్ ప్రశంసల వర్షం కురపించారు. సంబరాలకు ఆహ్వానం పై ఆయన సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ను కలిసిన నాట్స్ ప్రతినిధులు.. సంబరాలకు రావాలని ఆహ్వానించారు.
తెలుగు భాషకు నాట్స్ చేస్తున్న సేవలను కూడా వివరించారు. సంబరాలకు తాను కచ్చితంగా హాజరవుతానని మండలి బుద్ధప్రసాద్ హామీ ఇచ్చారు. నాట్స్ కు ఎప్పటి నుంచో తన పూర్తి మద్దతును సహాకారాన్ని అందిస్తున్న తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను కూడా నాట్స్ బృందం సంబరాలకు ఆహ్వానించింది. ఆయన కూడా సంబరాల ఆహ్వానంపై సానుకూలంగా స్పందించారు.. నాట్స్ సంబరాలకు ఆహ్వానాలు అందించిన వారిలో నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ సమన్వయకర్త రవి అచంటతో పాటు పలువురు నాట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.