To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
15 Septemmber 2014
Hyderabad
నాట్స్ తెలుగు సంబరాల కిక్ ఆఫ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్, తెలుగు రాష్ట్రాల్లో, అమెరికాలో సేవా కార్యక్రమాల విస్తరణ పై బోర్డు నిర్ణయం.
లాస్ ఏంజిల్స్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగు సంబరాల కిక్ ఆఫ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. నాట్స్ లాస్ ఏంజిల్స్ టీం ఈ ఈవెంట్ ను విజయవంతంగా నిర్వహించింది. వచ్చేఏడాది జులైలో లాస్ ఏంజిల్స్ లో జరిగే తెలుగు సంబరాలకు సన్నాహాక వేడుకగా దీనిని నాట్స్ ఏర్పాటు చేసింది. కాలిఫోర్నియాలోని అనహ్యామ్ హిల్టన్, 777 కన్వెన్షన్ వే సెంటర్ లో జరిగిన ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ కు తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
2015 జులైలో జరిగే 4 వ ఉత్తర అమెరికా తెలుగు సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఈ సందర్భంగా నాట్స్ నిర్ణయించింది. అమెరికాలో తెలుగు వారికి ఆత్మీయ నేస్తంలా నాట్స్ ఎలా మారిందనేది నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ ఛైర్మన్ మధు కొర్రపాటి ఈ సదస్సులో వివరించారు. లాస్ ఏంజిల్స్ నాట్స్ టీం వరుసగా చేపడుతున్న కార్యక్రమాలు.. వాటిని అద్భుతంగా నిర్వహిస్తున్న తీరును మథు కొర్రపాటి ప్రశంసించారు. కాలిఫోర్నియాతో పాటు లాస్ ఏంజిల్స్ పరిధిలో నాట్స్ తెలుగువారి ప్రేమాభిమానాలు ఎలా సంపాదిస్తుందనేది నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ సభ్యుడు వీరయ్య చుండు వివరించారు. నాట్స్ కు స్థానిక ప్రజల ఇస్తున్న మద్దతు అపూర్వమని చెప్పుకొచ్చారు.
నాట్స్ లాస్ ఏంజిల్స్ ఛాప్టర్ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన కొనియాడారు. లాస్ ఏంజిల్స్ లో జరిగే నాట్స్ తెలుగు సంబరాలను అద్భుతంగా నిర్వహించేందుకు నాట్స్ సభ్యులంతా సమిష్టి గా చేయాలని నాట్స్ ప్రెసిడెంట్
గంగాధర్ దేసు అన్నారు. నాట్స్ చేపడతున్న ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న లాస్ ఏంజిల్స్ తెలుగు ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ భవిష్యత్ లక్ష్యాలను నాట్స్ కార్యవర్గం ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ లో ప్రధానంగా వివరించింది. అమెరికాలో తెలుగువారికి ఏ కష్టమోచ్చినా నాట్స్ అండగా నిలబడుతుందని నాట్స్ సభ్యులు చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా శనివారం రాత్రి ఫుల్లర్తన్ హోటల్ లోనిర్వహించిన కార్యక్రమంలో సమావేశాలకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ సైట్ ను సంస్థ బోర్డు చైర్మన్ దా. కొర్రపాటి మధు, గంగాధర్ దేసు, వీరయ్య చుండు తదితరులు ప్రారంభించారు. పలు సేవా కార్య క్రామాలకు సంభందించిన ఆడియో వీడియో ప్రజెంటేషన్ కూడా రిలీజ్ చేసారు.
తెలుగు సంబరాలకు చేయాల్సిన కార్యక్రమాలపై కిక్ ఆఫ్ ఈవెంట్ లోనే నాట్స్ ఓ స్పష్టతకు వచ్చింది. మహిళా సంబరాలను అద్భుతంగా నిర్వహించిన లాస్ ఏంజిల్స్ నాట్స్ టీం సంబరాల కిక్ ఆఫ్ ఈవెంట్ ను కూడా ఘనంగా నిర్వహించింది. 3 రోజుల పాటు జరిగే సంబరాలకు అమెరికా తో పటు, తెలుగు రాష్ట్రాల నుంచి 10 వేలకు మందికి పైగా హాజరవుతారని అంచనాతో, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకు ముందు గా నిర్వహించిన నాట్స్ పాలక కార్య నిర్వాహక సభ్యుల సమావేశం లో ఆంధ్ర., తెలంగాణా రాష్ట్రాలలో లోచేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను మరింత విస్త్ర రించాలని నిర్ణయించారు. పాటశాల విద్యార్ధులకు 10 వేల స్కూల్ బాగ్ లను పంపిణీ చేయాలని నిర్ణయించారు.
లాస్ ఏంజిల్స్ పరిధిలో నిర్వహించిన సంబరాల కిక్ ఆఫ్ వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు ఈ వేడుకల్లో బహుమతులను అందజేశారు. అటు వుమెన్ బోలింగ్ టోర్నమెంట్ లో విజేతలకు బహుమతులు అందించారు. శనివారం రాత్రి ఫుల్లర్తన్ హోటల్ లోనిర్వహించిన కార్యక్రమంలో నిర్వహించిన ఈ సంబరాల కిక్ ఆఫ్ ఈవెంట్ తెలుగు ఆట, పాట కనువిందు చేశాయి. శ్రీకాంత్ కొచ్చర్లకోట వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకొంది.