To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
26 March 2014
Hyderabad
North America Telugu Society (NATS) celebrated Mahila Sambaralu in Los Angeles with grandeur and glitz that is rival to no other event celebrated by any other Indian organization in United States. For the first time in the history of Indian Americans, this event was organized completely by women with volunteers exceeding over 60. As part of this event, cooking competitions, games and fruit carving competitions were held in six different cities in Los Angeles Metro Area with over 300 participants. Drawing competitions were held in association with Manabadi for different age groups and about 250 kids participated in these where the theme was about women.
Mahila Sambaralu organized by NATS at Cabrillo High School in Long Beach attracted a lot of attention in United States as well as in India where the organizers called on the community to celebrate the women in their lives. The event started at 4 PM promptly and the auditorium was full by 4:30 PM with people continuing to pour in. Over 1400 people attended the event which ended up being the biggest telugu event of all times in Los Angeles. NATS has been known to organize such massive events with meticulous planning in Los Angeles for the last three years. Several stalls were setup by the venue that the attendees, mostly women, enjoyed with lots of shopping including clothing and jewellery. The stall owners were thrilled by the turnout and the business.
Fruit Carving competitions held at the venue attracted reasonable crowds who cheered for the participants in the competition. The attendees were seen taking pictures with the carved fruits that showed the skill of the participants. The real skill was seen on the execution and planning of the event that started on time and ended on time with non stop entertainment and no glitches. Cultural programs were the highlight of the evening. Every program was so appealing with rich and colorful costumes wore by highly talented women. Classical dances, Modern dances, skits and various other programs entertained the crowd for full 5 hours.
Fashion show with over 70 mom & daughter pairs whipped the audience into frenzy. The back ground music hit the spot keeping the audience feet stomping as one pair after another walked onto the stage. These women knew how to rip a venue and the common thread throughout the evening was fun. The fashion show concluded with all the participants walking onto the stage at once that looked like star gazing.
The video played during the show about the importance of women silenced the entire auditorium as they became very emotional watching it. This video received huge applause at the end. At the conclusion of this video, the audience maintained a moment of silence for the lives of Nirbhaya and others who lost their lives as the women in this world continue to fight for equal justice and freedom. Everyone pledged to spread the message of love for all the women in their lives.
The logo for upcoming Tollywood movie Maine Pyar Kiya was released on the stage by a lucky draw winner. Special programs like Star Mahila and Gadasari Atha - Sogasari Kodalu were held on the stage with the audience competing to participage. Several iPads and Sarees were given away in a raffle. One of the biggest appreciation that came from the audience was that they barely saw any men on the stage and that this event truly reflected the name Mahila Sambaralu. This event was arguably the best event in Los Angeles held in a long time was the most commonly heard comment from the audience while enjoying the delicious dinner after the event.
Prizes and trophies were awarded to all the winners and participants. There were a number of volunteers who volunteered for this event who worked for over two months making this event such a huge success. All the key volunteers who spent enormous amount of time including Lakshmi Chundu, Jyothy Kolluri, Anitha Katragadda, Santhi Bodapati, Latha Yalamanchili, Sridevi Madala, Lakshmi Anumolu, Suvarsha Kamarasu, Hema Kanumilli, Ramani Kethireddy, Kanthi Darbala, Radhika Nekkanti, Praveena Kasanagottu, Himaja Ponnaganti, Lakshmi Chimata, Sravani Kode, Madhuvani Kota, Kavitha Ganduri, Srikala Yarlagadda, Santhi Yadlapati, Lavanya Vankina, Suba Subramanian, Rajyalakshmi Chilukuri, Kavitha Anusha, Beena Oruganti, Sudha Kavartapu were very happy at the turnout of the event.
Seeing the response for this event, NATS Executive Committee immediately announced that Mahila Sambaralu will be held by every NATS Chapter starting from 2014 and that the entire month of March every year will be dedicated to Women related events.
NATS thanked all the sponsors of the events including the food sponsor Vishnu Catering, Media Sponsor LA Telugu and corporate sponsors SysIntelli, Allure Dental, Technossus, Pyramid Technology Solutions and Connex Info Systems.
*** అమెరికాలో తెలుగు వనితా వైభవం *** అంగరంగ వైభవంగా నాట్స్ మహిళా సంబరం ***
22, మార్చ్, 2014: లాంగ్ బీచ్, లాస్ ఏంజెల్స్: అమెరికా తెలుగు సంఘాల చరిత్రలో.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ వేసిన ముందడుగు మహిళా శక్తి ఏమిటో నిరూపించింది. వనితలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మరోసారి రుజువైంది. తెలుగింటి ఆడపడుచులు మహిళా సంబరాలను అద్భుతంగా నిర్వహించిన తీరు అద్భుతం..అపూర్వం అని ప్రశంసల వర్షం కురిసింది. లాస్ ఏంజిల్స్ వేదికగా నిర్వహించిన ఈ మహిళా సంబరాల్లో పాలుపంచుకుంది... ముందుండి నడిపించింది అందరూ మహిళామణులే..తెలుగింటి మణిదీపికలే..
లాస్ ఏంజిల్స్ మహిళా సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించి మన తెలుగు మహిళలు సత్తా చాటారు. లాంగ్ బీచ్ లో కాబ్రిల్లో హైస్కూల్ వేదికగా జరిగిన ఈ సంబరాలకు దాదాపు 1500 మంది మహిళా మణులు హజరయ్యారు. మహిళలంతా తమ ఆట, పాటల సంబరాల సంతోషాలు అంబరాన్నంటేలా చేశారు. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికత.. ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు కనువిందు చేశారు. శాస్త్రీయ నృత్యం, మోడ్రన్ డ్యాన్స్ రెండింటిలో తమకు సాటి లేదని నిరూపించారు. నవ్వించే స్కిట్లతో నవ్వుల పువ్వులు పూయించారు. దాదాపు 70 మంది అమ్మలు తమ అందమైన అమ్మాయిలతో కలిసి స్టేజ్ పై నిర్వహించిన ఫ్యాషన్ షో.. మహిళా సంబరాలకే హైలెట్ గా నిలిచింది. వయ్యారి భామల.. హంస నడకలతో తెలుగు ఫ్యాషన్ టాలెంట్ ఏమిటో లాస్ ఏంజిల్స్ వేదికగా చూపించారు. దాదాపు ఐదు గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తో మహిళా సంబరాలు సాగాయి.
స్టార్ మహిళ, గడసరి ఆత్త సొగసరి కోడలు లాంటి పోటీలు సంబరాల వేదికపై మహిళల సంతోషాల మధ్య ఆహ్లదంగా సాగాయి.. స్టేజ్ మీద ఉన్నవారితో పాటు సంబరాలను చూసేందుకు వచ్చిన మహిళా మణులు కూడా ఈ పోటీల్లో పాలు పంచుకున్నారు. ఎన్నో ఐపాడ్స్, చీరలు బహుమతులుగా గెలుచుకున్నారు. లాస్ ఏంజిల్స్ ఇంతవరకు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం.. అందరిని భాగస్వాములను చేసే కార్యక్రమం. ముఖ్యంగా వనితలకు అనంతమైన ఆనందాన్ని ఇచ్చే సంబరం జరగలేదని తెలుగు నారీ లోకం ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మహిళా సంబరాల్లోనే త్వరలో రాబోతున్న తెలుగు చిత్రం "మైనే ప్యార్ కియా" లోగోను ఆవిష్కరించారు.
స్ఫూర్తిని నింపిన నాట్స్ వీడియో.
మహిళ మణుల్లో స్ఫూర్తిని రగిలించేందుకు ఆకాశంలో సగమైన మహిళ ఏం తక్కువ కాదనే సత్యాన్ని చాటేందుకు నాట్స్ రూపొందించిన ఓ వీడియోను ఈ సంబరాల్లో ప్రజెంట్ చేశారు..ప్రపంచంలో అద్భుత విజయాలను సాధించిన మహిళలను చూపిస్తూ.. మహిళా శక్తిని వివరిస్తూ సాగిన ఈ వీడియోకు మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది. సమానత్వం కోసం మహిళ చేస్తున్న పోరాటాన్ని ఈ వీడియో ప్రతిబింబించింది.. మహిళలపై జరుగుతున్న దాడులను ఆరికట్టేందుకు ప్రమాణం చేద్దాం రండి అంటూ.. నాట్స్ ఈ వీడియో ద్వారా పిలుపు నిచ్చింది. మహిళలను గౌరవించాలనే మన భారతీయ వేదాన్ని విస్మరించకూడదని నాట్స్ ఈ వీడియో ద్వారా హెచ్చరించింది.
సంబరాల కోసం ముందుగానే ఎన్నో పోటీలు
నాట్స్ తెలుగు మహిళా సంబరాలను నిశ్చయించుకోగానే వెంటనే చాలామంది తెలుగువనితలు ముందుకొచ్చారు. మా సంబరాలు మేం ఘనంగా నిర్వహించుకుంటామని ఛాలెంజ్ చేశారు. అనుకున్నదే తడవుగా సంబరాల కోసం అమెరికాలో ఆరు మెట్రో నగరాల్లో తెలుగు మహిళలకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు.. దాదాపు 300 మంది వనితలు..250 మందికి పైగా చిన్నారులు మహిళా సంబరాల పోటీల్లో పాల్గొన్నారు.దాదాపు 60 మంది మహిళా వాలంటీర్లు ఈ సంబరాలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. మహిళల ప్రతిభే ప్రధానాంశంగా మనబడి సహకారంతో జరిగిన ఈ పోటీలు వనితల్లోని క్రియేటివిటిని బయటపెట్టాయి. వ్రూట్ కార్వింగ్, డ్రాయింగ్, వంటల పోటీలు, ఇతర ఆటలు తెలుగు మహిళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. వ్రూట్ కార్వింగ్ పోటీలు మొత్తం వేదికకే కొత్త కళ తెచ్చాయి. రకరకాల డిజైన్లతో మహిళలు వ్రూట్ కార్వింగ్ లో పోటీ పడటంతో వీటిని ఫోటోలు తీసుకునేందుకు చాలా మందిపోటీ పడ్డారు. మహిళల కోసం నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలకు సభా వేదికపై బహుమతుల ప్రదానం చేశారు.
భలే మంచి చౌక బేరం ..
మహిళా సంబరాల కోసం విచ్చేసిన మహిళలు షాపింగ్ కోసం ఎన్నో స్టాళ్లను ఏర్పాటు చేశారు. మహిళల ఆభరణాలు, వస్త్రాల స్టాళ్లకు విశేష స్పందన లభించింది. చాలా మంది మహిళలు ఈ స్టాళ్లలలో తమకు నచ్చినవి కోనుగోలు చేశారు.. ఊహించని స్పందన ఈ సంబరాలకు రావడంతో స్టాల్ యాజమ్యానాలు ఇది నిజంగా మాకు సంబరమే అంటూ సంతోషంలో మునిగితేలారు.
నెలల తరబడి శ్రమకు గుర్తింపు
ఈ మహిళా సంబరాల నిర్వహణలో పాలుపంచుకునేందుకు ఎంతో మంది వనితలు ముందుకొచ్చారు. నెలల తరబడి ఈ సంబరాల కోసం తమ విలువైన సమయాన్ని వెచ్చింది. ఇది మా పండుగ.. మహిళల పండుగ..మేం ఘనంగా నిర్వహిస్తామని మాటల్లో చెప్పడమే కాదు చేతల్లో చూపించారు.. అలాంటి వారందరిని నాట్స్ ఘనంగా సత్కరించింది. మహిళా శక్తికి పాదాభివందనం చేసింది. నాట్స్ మహిళా సంబరాల్లో మేము సైతం ముందుకొచ్చిన వారిలో.. లక్ష్మి చుండు, జ్యోతి కొల్లూరి, అనిత కాట్రగడ్డ , శాంతి బోడపాటి, లత యలమంచిలి, శ్రీ దేవి మాదాల, లక్ష్మి అనుమోలు, సువర్ష కమరసు, హేమ కానుమిల్లి, రమణి కేతిరెడ్డి, కాంతి దర్బల, రాధిక నెక్కంటి, ప్రవీణ కాసనగొట్టు, హిమజ పొన్నగంటి, లక్ష్మి చిమట, శ్రావణి కోడె, మధువాణి కోట, కవితా గండూరి, శ్రీ కళ యార్లగడ్డ, శాంతి యడ్లపాటి, లావణ్య వంకిన, శుభా సుబ్రమణ్యిన్, రాజ్యలక్ష్మి చిలుకూరి, కవిత, అనూష, బీనా ఓరుగంటి, సుధా కవరతపు ఇలా ఎందరో మహిళా మణులు ఉన్నారు. వీరంతా నాట్స్ మహిళా సంబరాలు కోసం ఎంతగానో కృషి చేశారు.
దాతలకు ధన్యవాదాలు..
ఈ సంబరాల విజయంలో పాలుపంచుకున్న స్పాన్సర్లు విష్ణు క్యాటరింగ్, మీడియా స్పాన్సర్ LA తెలుగు, కార్పొరేట్ స్పాన్సర్స్ సిస్ ఇంటెల్లీ,అల్యుర్ డెంటర్, టెక్నోసస్, పిరమిడ్ టెక్నాలజీ సొల్యూషన్స్, కానెక్స్ ఇన్ ఫో సిస్టమ్స్ తదితర సంస్థలకు స్పానర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.ఇక చివరలో తెలుగింటి విందు పసందు చేసింది.. అమ్మ చేతి లాంటి వంటలతో కమ్మని విందు భోజనం కూడా అందరిని ఆహా అనిపించేలా చేసింది.
ఇక ప్రతియేటా నాట్స్ మహిళా సంబరాలు
మహిళ సంబరాలకు వచ్చిన స్పందన చూసి నాట్స్ కార్యవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ప్రతి యేటా, ప్రతి చాఫ్టర్లో, మార్చి నెలలో మహిళా సంబరాలను ఘనంగా నిర్వహించాలని నిశ్చయించుకుంది.