To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
27 January 2015
Hyderabad
భారత ప్రభుత్వం నుంచి పద్మ పురస్కారాలు అందుకోనున్న తెలుగువారికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రత్యేక అభినందనలు తెలిపింది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు, గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల అనగాని, క్రికెట్ క్రీడాకారిణి మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీ.వీ. సింధులను పద్మశ్రీ వరించడంపై నాట్స్ హర్షం వ్యక్తం చేసింది.
అమెరికాలో స్థిరపడిన ప్రముఖ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ రఘురామ్ పిళ్లారిశెట్టిలకు ఎన్‌ఆర్‌ఐ కోటాలో పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించడం ప్రవాస భారతీయుల సేవలకు సరైన గుర్తింపుగా నాట్స్ అభివర్ణించింది. ముఖ్యంగా ప్రముఖ క్యానర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడికి పద్మశ్రీ ప్రకటించడంపై నాట్స్ బోర్డ్ ఛైర్మన్ మధు కొర్రపాటి హర్షం వ్యక్తం చేశారు. క్రిష్ణా జిల్లాలో పుట్టిన డాక్టర్ నోరి కర్నూలులో మెడిసిన్ చదవి.. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. క్యానర్ వైద్యుల్లో యావత్ ప్రపంచంలో అత్యుత్తమ వైద్యుల్లో ఒక్కరిగా డాక్టర్ నోరి పేరుగడించారు. గతేడాది ఎల్లిస్ ఐలాండ్ మెడల్ అఫ్ హానర్ కూడా డాక్టర్.నోరి కి దక్కింది.
అమెరికాలో అత్యుత్తమ క్యానర్ వైద్యునిగా పేరొందిన నోరి.. భారత్ లో క్యాన్సర్ పై పోరాటానికి తన వంతు సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుండే వారు. ఇప్పటికవరకు ప్రపంచంలో క్యానర్స్ వైద్యంపై జరిగిన దాదాపు 500 సదస్సుల్లో డాక్టర్ నోరి తన అనుభవాలను వివరించారు. కాన్సర్ వైద్యంపై 250 కి పైగా వ్యాసాలు రాశారు. రేడియాషన్, అంకాలజీపై డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మూడు పుస్తకాలను కూడా ప్రచురించారు. అటు పేదవారిని క్యాన్సర్ బారి నుంచి రక్షించేందుకు కూడా డాక్టర్ నోరి తపిస్తుంటారు. అందుకోసం తన విలువైన సమయాన్ని, ధనాన్ని కూడా ఖర్చు చేస్తుంటారు. యావత్ తెలుగుజాతికి గర్వకారణమైన వ్యక్తి డాక్టర్ నోరికి పద్మశ్రీ రావడం ఎంతో సంతోషంగా ఉందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలిపింది.
అలాగే కోట శ్రీనివాసరావుకు నాట్స్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. తెలుగు సంబరాల్లో కోట శ్రీనివాసరావు ను కూడా సన్మానించుకున్నామని ప్రకటించింది. ఏ పాత్రలోనైనా జీవించే నటుడు కోటకు పద్మశ్రీ పురస్కారం దక్కడంపై నాట్స్ హర్షం వ్యక్తం చేసింది.