To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
27 July 2016
USA
సంక్షిప్త చలనచిత్ర నిర్మాణం లో అవార్డు గ్రహీత, ఉన్నత ప్రమాణాలు గల చిత్రాలను అందించిన దర్శకులు వేణు మాదాల గారు మరియు యాజ్ఞసేని చిత్ర నిర్మాత సచిన్ మరియు చిత్ర బృందం తమ తదుపరి చిత్రానికి గాయని అన్వేషణ నిమిత్తం ఇటీవల డల్లాస్ , టెక్సస్ కు విచ్ఛేసింది. ప్రవాసంలో స్థిరపడ్డ తెలుగువారికి ఎల్లపుడూ అందుబాటులో ఉంటూ తెలుగు సంస్కృతి , కళారంగానికి ప్రోత్సాహాన్నిచ్చే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్ ), డల్లాస్ లోని తెలుగు యువకళాకారులకు ప్రోత్సాహానిచ్ఛే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి తమ వంతు సాయం అందించింది.
స్థానిక ఇర్వింగ్ నగరంలో గల దేశిప్లాజా స్టూడియో లో జులై 9, 2016 న జరిగిన ప్రాధమిక పోటీలో అసంఖ్యాకంగా అనేక మంది తెలుగు పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తాము ఎంచుకొన్న పాటలను పాడి వినిపించగా, నాయ నిర్ణేతలు పది మందిని రెండవ దశ పోటీకి అర్హులుగా నిర్ణయించారు. రెండవ దశ పోటీలు జులై 10,2016 న జరుగగా, ఇందులో నుండి 5గురిని తుది దశ పోటీకి ఎంపిక చేశారు, గత వారం మెహర్ చిన్నా ఆడియో స్టూడియో లో సంగీత దర్శకులు విశ్వనాధ్ ఘంటసాల గారి ఆధ్వర్యంలో తుది పోటీకి చేరుకున్న 5గురు గాయని, గాయకులచే చిత్రగీతాన్ని ఆలపింప చేసి రికార్డింగ్ పూర్తి చేశారు.
చిత్ర దర్శకులు , సంగీతదర్శకులు కార్యక్రమం చివరలో మాట్లాడుతూ ఈ ప్రయోగం తాము ఊహించిన దానికంటే ఉన్నతంగా వఛ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు , ప్రవాసంలో పుట్టి , ఇక్కడే పెరిగి ఉత్తమ ప్రమాణాలతో అందంగా పాడినందుకు గాయనిలను అభినందిస్తూ వారికి సంగీత శిక్షణ ఇస్తున్న గురువులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమ నిర్వహణను ముందుండి నడిపించిన నాట్స్ కార్యవర్గ సభ్యులు రామకృష్ణ మార్నేని, రాజేంద్ర మాదాల, అపర్ణ వెలమూరి , జ్యోతి వనం, బాపు నూతి మరియు డల్లాస్ చాఫ్టర్ కార్యవర్గాన్నిఅభినందించారు. డల్లాస్ చాఫ్టర్ కో ఆర్డినేటర్ రామకృష్ణ మార్నేని మాట్లాడుతూ ప్రతిభ ఉన్న తెలుగు యువతకు అన్ని రంగాలలో ప్రవేశం, ప్రాధాన్యత కలిపించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నాట్స్ తరఫున చేపట్టామని తెలిపారు. కార్యక్రమ స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ కార్యనిర్వాహక సభ్యులు బాపు నూతి మాట్లాడుతూ "భాషే రమ్యం సేవే గమ్యం" అనే నినాదంతో నాట్స్ హెల్ప్ లైన్ ను స్థాపించి అందరికి 24x7 అందుబాటులో ఉండి అనేక మందికి నిరంతరం సేవలను అందించటమే కాక, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను యువతకు అందుబాటులో ఉంచి, అన్ని రంగాలలో వారి ప్రావీణ్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని కల్పించటంలో ఎల్లపుడు ముందంజలో ఉంటుంది. ఈ కార్యక్రమంలో డల్లాస్ చాప్టర్ సభ్యులు కిషోర్ వీరగంధం, అమర్ అన్నే, వెంకట్ కొల్లి మరియు జాతీయ కార్యవర్గ సభ్యులు శేఖర్ అన్నే, విజయ్ వెలమూరి, బిందు కొల్లి పాల్గొన్నారు.
తుది పోటీ విజేతల వివరాలు : కీర్తి చేమకూర, పూజ చెరుకు, ఆశా కీర్తి , అపర్ణ వెలమూరు , సంతోష్ ఖమ్మంకర్