To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
25 January 2017
Dallas
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అద్భుతంగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు సన్నాహాలు మొదలయ్యాయి. అమెరికాలోని వివిధ నగరాల్లో సంబరాలకు మద్దతు కూడగట్టేందుకు.. చికాగో నాట్స్ తెలుగు సంబరాల కన్వీనర్ రవి అచంట డాలస్ లో పర్యటించారు.. స్థానిక నాట్స్ కార్యవర్గంతో సమావేశమై.. 2017 సంబరాల నిర్వహణ, కార్యాచరణ, నిధుల సేకరణతదితర అంశాలపై చర్చించారు. చికాగోలో జరిగే ఈ తెలుగు సంబరాలకు డాలస్ నుంచి భారీగా తెలుగు వారు విచ్చేసేలా ఇప్పటి నుంచే ప్రణాళిలు సిద్ధం చేయాలని.. దీనిపై విసృత ప్రచారం చేయాలని రవి అచంట నాట్స్ డాలస్ చాప్టర్ ప్రతినిధులను కోరారు. ఈ సమావేశంలో శ్రీనివాస్ కోనేరు, బాపు నూతి, విజయ వెలమూరు, రాజేంద్ర మాదాల, రామకృష్ణ మార్నేని, చౌదరి ఆచంట, శేఖర్ అన్నె, అజయ్ గోవాడ, చంద్ర కాజ, రామకృష్ణ నిమ్మగడ్డ, ఉమా అట్లూరి, అమర్ అన్నే, చైతన్య కంచెర్ల, కిషోర్ వీరగంధం, భాను లంక, వెంకట్ పోలినీడి మరియు ఇతర డాలస్ టీం సభ్యులు పాల్గొని తమ సలహాలు, సూచనలు అందించారు. షికాగో లో జరిగే సంబరాలకు తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
డాలస్ లో నాట్స్ ఫుడ్ డ్రైవ్ కు మహిళా విభాగం కృషి బేష్
ఆకలితో అలమటించే పేదలకు ఆహరం అందించాలనే ఉద్దేశంతో నాట్స్ అమెరికా అంతటా చేపట్టిన ఒన్ మిలియన్ ఫుడ్ డ్రైవ్ కార్యక్రమానికి డాలస్ లో విశేష స్పందన రావడంపై నాట్స్ సంబరాల కన్వీనర్ రవి అచంట హర్షం వ్యక్తం చేశారు.
గత మూడు నెలలుగా డాలస్ లో నాట్స్ మహిళా విభాగం ఫుడ్ డ్రైవ్ కోసం చేస్తున్నకృషిని ఆయన ప్రశంసించారు. అమెరికాలో నివసిస్తున్న పేదవారికి సహాయం చేయాలనే సంకల్పంతో నాట్స్ ఇఛ్చిన ఈ మిలియన్ కాన్స్ ఫుడ్ డ్రైవ్ పిలుపునకు డాలస్ నగరంలోని తెలుగు వారందరినుంచి మంచి స్పందన వచ్చిందని నాట్స్ డాలస్ మహిళా విభాగం తెలిపింది. మహిళా విభాగంలో కీలక సభ్యులైన జ్యోతి వనం, వీణ యలమంచిలి, శ్రీదేవి చాగర్లమూడి, పూర్ణిమ నిడుమోలు ఫుడ్ డ్రైవ్ ఎలా జరిగిందనేది అందరితో పంచుకొన్నారు. సేకరించిన ఆహార పదార్థాలను (ఫుడ్ క్యాన్స్) నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంకుకి అందించనున్నామని తెలిపారు. 2016-17 సంవత్సరాల్లో అత్యధిక ఫుడ్ క్యాన్స్‌ను ఉచితంగా అందించిన సంస్థ నాట్స్ అని స్థానిక ప్రతినిధులు కొనియాడారు.