To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
03 October 2016
Hyderabad
అమెరికాలో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న నాట్స్ ఈ క్రమంలో సెయింట్ లూయిస్ లో కూడా అనేక కార్యక్రమాలతో తెలుగువారికి మరింత చేరువ అయింది. తాజాగా సెయింట్ లూయిస్ లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది.. దాదాపు 120 మంది వాలీబాల్ ప్లేయర్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్ ఆద్యంతం ఆహ్లదకరంగా సాగింది..గాంధీ జయంతిని పురస్కరించుకుని నాట్స్ నిర్వహించిన ఈ టోర్నమెంట్ కు విశేష స్పందన లభించింది. దాదాపు 300మందికి పైగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ వీక్షించేందుకు విచ్చేశారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అంటూ నినదించే నాట్స్ ఆ క్రమంలో ప్రకాశం జిల్లాలోని పేదపిల్లలకు పుస్తకాలు అందించే బుక్ ఫెయిర్ ప్రాజెక్టుకు మద్దతుగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. దీని ద్వారా వచ్చిన నిధులను పేద పిల్లలకు పుస్తకాలు అందించే సత్కార్యానికి వినియోగించనుంది. హరీంద్ర గరిమెల్ల, శేషు కాట్రగడ్డ, నాగ సతీష్ ముమ్మనగండిల నాయకత్వంలో నాట్స్ యువకుల టీం ఈ టోర్నమెంట్ ను నిర్వహించింది. దాదాపు 20కి పైగా టీమ్ లు ఇందులో పాల్గొన్నాయి. విన్నర్... , రన్నర్...కు బహుమతులను డాక్టర్ వెంకట్ బోడేపల్లి, డాక్టర్ రామకృష్ణ గొండిబహుమతులు అందించారు. ఈ టోర్నమెంట్ లో విశేష ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు కాట్రగడ్డ, సురేంద్ర బాచిన, శ్రీనివాస్ మంచికలపూడి, నాగ సతీష్ ముమ్మనగండి, శేషు ఇంటూరి బహుమతులు అందించారు.
అబ్యుసులుట్ బీబీక్యూ, ప్రాస్పెక్ట్ ఇన్ ఫోసిస్ , సెయింట్ లూయిస్ అర్జంట్ కేర్ సంస్థలు ఈ టోర్నమెంటుకు స్పాన్సర్లుగా వ్యవహరించాయి. స్పాన్సర్లకు శ్రీనివాస్ గుల్లపల్లి, చిన్న ముచ్చర్ల బహుమతులు అందించారు. నాట్స్ సెయింట్ లూయిస్ లో చేపడుతున్న కార్యక్రమాలను నాట్స్ జాతీయ కోశాధికారి శ్రీనివాస్ మంచికలపూడి వివరించారు. నాగసతీష్ ముమ్మనగండి లాంటి యువ నాయకుల చేతుల్లో నాట్స్ దూసుకుపోతోందనేందుకు తాజా టోర్నమెంట్ నిదర్శనమని ఆయన అన్నారు. దీంతో పాటు సెయింట్ లూయిస్ లో హైకింగ్ కూడా విజయవంతమైందని అన్నారు. అక్టోబర్ 8 న స్థానిక హిందు టెంపుల్ తో కలిసి నాట్స్ ఫ్రీ వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ శ్రీధర్ అట్లూరి, నాగసతీష్ ముమ్మనగండిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే నెలలో ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తుందన్నారు.. మొత్తం మీద నాట్స్ సెయింట్ లూయిస్ లో అనేక కార్యక్రమాలతో తెలుగు యువకుల సారధ్యంలో దూసుకుపోతోంది.