To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
06 July 2013
Hyderabad
Dallas, TX: NATS 2013 Sambaralu started on July 4th with a tremendously successful banquet thanking all the donors for their contribution and support to NATS. July 5 th kicked off with Shri Ganapathi Sachidananda Swamiji who arrived in a chariot surrounded by his devotees. He officially inaugurated the sambaralu amidst special invitees, dignitaries and NATS attendees. NATS Sambaralu created a new standard for food, transportation, quality of programs and hospitality. NATS Sambaralu is officially now a sold out event approx 7000 attendees and was continuing to receive numerous requests to attend. All the attendees were thrilled with the amount of attention provided to them and also for giving them a mesmerizing first day of events. All the food was specially prepared at the venue for the guests who were extremely happy with the quality. Transportation was arranged every 20 mins from various locations to the venue significantly helping out of town attendees. The biggest attraction in today’s events were Sangeetha Nava Avadhanam, a unique literary event conducted by Dr.Meegada Ramalinga Swamy. It was touted as one of the most innovative event that combines astavadhanam and different tunes (ragas). Business seminars were highly attended in presence of Nadendla Manohar(Hon'ble Speaker,AP), N.T. Chowdary, Harish Parvathaneni(Counsel General Of India). The meet & greet with Nadendla Manohar and local entrepreneurs was very received by everyone. Women’s forum also received rave reviews by everyone. Programs like Rangula Harivillu, Pragathi Patham lo Mahila, Soundarya Lahari was sold out and enjoyed by women and men alike. Youth programs also were highly successful. Several influential speakers like Nadendla garu attended to cheer the youth. For the first time, youth engaged in a spiritual discussion. They ended the day with a boat cruise to commemorate the wonderful day. Kona Venkat conducted the movie seminar which happened for first time in Telugu convention. The highlight to today was of course the cultural programs such as Nadamruthavarshini, Sariganchu Cheera, Rela re Rela, Swara Gana Jari. All of these received standing ovation which is the first of its kind for a National convention. Even kids performed amazing performances such as Balaganamrutham, Little Musicians Academy’s performances, Kshetradarshanam that were highly applauded by audience. Total of 300 participants took the stage today to showcase a memorable experience. The evening ended in a high note with some performances by actress Sanjana, comedian Rajesh and group. Overall, first day of NATS Sambaralu was superb and extremely well received by attendees.
*** కన్నుల పండువగా జరుగుతున్న నాట్స్ సంబరాలు *** సంబరాల్లో ఉట్టిపడితన
తెలుగుదనం***
డల్లాస్,టెక్సాస్; అమెరికా డాలస్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్
నిర్వహిస్తున్న తెలుగు సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.. శ్రీ
గణపతి సచ్చిదానంద స్వామీ ఈ సంబరాలకు అధికారికంగా ప్రారంభించారు. అంతకు
ముందు స్వామీజీ సంబరాల వేదిక వద్దకు రథంపై తీసుకువచ్చారు.. నాట్స్
సభ్యులు స్వామీజీకి ఘన స్వాగతం పలికారు.. నాట్స్ తెలుగు సంబరాల్లో
పాల్గొనేందుకు అమెరికాలో నలుమూలల నుంచి దాదాపు 7000 మంది హజరయ్యారు.
వారికి అతిథ్యానికి ఏ లోటు లేకుండా నాట్స్ ఎన్నో ఏర్పాట్లు చేసింది.
నాట్స్ తెలుగు సంబరాల వేదిక డాలస్ ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ లో
పూర్తిగా తెలుగుదనం కనిపించింది.. సంబరాల్లో భాగంగా నిర్వహించిన అనేక
కార్యక్రమాలను అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. మీగడ రామలింగేశ్వర
స్వామీ నవ అవధానం తెలుగు ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంది.. తెలుగు
సాహితీ చరిత్రలో ఇంతటి వినూత్న కార్యక్రమాన్నినాట్స్ సంబరాల వేదికపై
నిర్వహించడంతో..తెలుగు భాషాభిమానుల నుంచి ప్రశంసల వర్షం కురిసింది.
వ్యాపార మెళుకువలను... పెట్టుబడులకు అవకాశాలను వివరించే బిజినెస్
సెమీనార్ కు మంచి స్పందన లభించింది. ఈ సెమీనార్ మన రాష్ట్ర శాసన సభ
స్పీకర్ నాదెండ్ల మనోహర్ విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల అవకాశాల
గురించి వివరించారు. ఇక ఈ సదస్సులో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు. ఎన్.టి
చౌదరి, హరీష్ పర్వతనేనిలు హజరయ్యారు. స్పీకర నాదెండ్ల మనోహార్ తో గ్రీట్
అండ్ మీట్ లో పాల్గొనేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పోటీపడ్డారు.
మనోహార్ కూడా యువతలో ఉత్సాహాన్ని నింపేలా ప్రసంగించి అందరిని
ఆకట్టుకున్నారు. అటు నాట్స్ మహిళల ఫోరం చేపట్టిన కార్యక్రమాలకు విశేష
స్పందన లభించింది. రంగులరాట్నం, హరివిల్లు, ప్రగతి పథంలో మహిళా,
సౌందర్యలహారి లాంటి కార్యక్రమాలకు మహిళలను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఇక ఈ
సారి యువత ఆధ్యాత్మిక సదస్సులో కూడా పాలుపంచుకోవటం మరో విశేషం.. తెలుగు
సంబరాల్లో తొలిసారి వేసిన మరో ముందడుగు సినిమా సదస్సు.. సినిమా రచన,
నిర్మాణం, దర్శకత్వంపై పలు విలువైన సలహాలు సూచనలను ప్రముఖ రచయిత కోన
వెంకట్ ఈ సద్సులో వివరించారు.
నాదామృత వర్షిణి, రేలారేరేలా..,స్వరగంగాఝరి, సరిగంచు చీర.. ఇలా ఎన్నో
కార్యక్రమాలు తెలుగువారిని అంతులేని వినోదాన్ని పంచాయి. ఇక లిటిల్
మ్యూజిషియన్ అకాడమీ నిర్వహించిన బాల గానామృతం పాటల ప్రవాహంలో
ముంచెత్తింది. క్షేత్ర దర్శనం కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి మంచి
స్పందన లభించింది. దాదాపు మూడు వందల మంది వేదికపై ప్రదర్శనలిచ్చారు.
తెలుగు సినీ హిరోయిన్ సంజనా డ్యాన్స్ తో అలరిస్తే.. రాజేష్ కమెడీయన్
గ్రూపు పండించిన హస్యం.. తెలుగు ప్రేక్షకులను నవ్వుల పువ్వుల పూయించింది.