To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
26 September 2016
Hyderabad
చికాగో నాట్స్ తెలుగు సంబరాలకు సన్నాహాలు మొదలయ్యాయి. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అంగరంగ వైభవంగా జరిపే సంబరాలు 2017లో చికాగో వేదికగా జరగనున్నాయి. తెలుగు సంబరాలను ఈ సారి మరింత ఘనంగా నిర్వహించేందుకు నాట్స్ కార్యకవర్గం చికాగో లో సమావేశమైంది . నాట్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సెక్రటరీ శ్రీధర్ అప్పసాని స్వాగతోపన్యాసం తో ఆహూతులందరినీ సభకు పరిచయం చేశారు.
2017 జూన్ 30, జూలై 1,2 తేదీల్లో సంబరాలను చికాగో లో నిర్వహించాలని నాట్స్ ఇందులో తీర్మానించింది. నాట్స్ సంబరాల సభా వేదిక, తెలుగు ప్రముఖులకు ఆహ్వనాలు, తెలుగు సినీతారలు, కళాకారులకు సంబంధించిన కార్యక్రమాలపై కూడా నాట్స్ ఇందులో ప్రధానంగా చర్చించింది. నాట్స్ సంబరాలకు ఈ సారి భారీగా నిధులు సేకరించి అంబరాన్నంటేలా సంబరాలు చేయటానికి సన్నాహాలు ప్రారంభించింది. దీనికి సంబంధించి సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సంబరాల నిర్వహణ హై లెవెల్ వివరాలు తెలియచేశారు. నిధులను దాతల నుండి విరాళాల రూపంలో సేకరించాలని ఏకాభిప్రాయానికి నాట్స్ వచ్చింది. చికాగో తెలుగు ప్రజలు అధికంగా ఉంటారు కాబట్టి.. వేలాదిగా తరలి వచ్చే తెలుగు వారందరికీ తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయాలని, స్థానిక చికాగో తెలుగు సంఘం(సీటీఏ)తో కలిసి పనిచేస్తున్న నాట్స్ ... సంబరాల్లో కూడా సీ.టీ.ఏ కు ప్రధాన భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించింది. స్థానిక తెలుగు యువతలో ప్రతిభను వెలికితీయడంతో పాటు.. వారిలోని సృజనాత్మకత ప్రదర్శించే వేదికగా సంబరాలు జరపాలని, సన్నాహాలు దానికి తగ్గట్టుగా ఇప్పటి నుంచే కార్యక్రమాల రూపకల్పనతో దృష్టి పెట్టాలని నాట్స్ బోర్టు.. చికాగో నాట్స్ ఛాప్టర్, చికాగో తెలుగు సంఘాలకు సూచించింది.
చికాగోలో ఆ వివేకానందుడు అడుగుపెట్టి సెప్టెంబర్ 15 2017 నాటికి 124 సంవత్సరాలు నిండి.. 125 సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాము. చికాగోలో సంబరాలను జరుపుకోవడం అరుదైన అవకాశం అయితే.. ఆ అవకాశాన్ని యువతరానికి వేదికగా మార్చడం యువతకు సేవా భావం పట్ల మరింత అవగాహన, అవకాశం కల్పించటం నాట్స్ కు ఓ సదవకాశం.
చికాగో నాట్స్ తెలుగు సంబరాల సమన్వయ కర్తగా రవి అచంటను నాట్స్ జాతీయ కార్యవర్గం ప్రకటించింది. నాట్స్ సంబరాల పరమార్థం ఏమిటనేది నాట్స్ ఛైర్మన్ సామ్ మద్దాళి వివరించారు. సేవే లక్ష్యంగా నాట్స్ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది.. సంబరాలను ఎలా నిర్వహించాలనే దానిపై నాట్స్ ఫౌండర్స్ లో ఒకరైన నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ డా. మధు కొర్రపాటి తెలిపారు. నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ పవర్ పాయింట్ ప్రజ్ టేషన్ ద్వారా, గత సంవ్సత్సరకాలం లో నాట్స్ చాఫ్టర్ల ద్వారా చేసిన సేవా కార్యక్రమాల వివరాలు, హెల్ప్ లైన్ ద్వారా చేసిన ఆర్ధిక సహాయ వివరాలు తెలియచేసారు. చికాగో సంబరాలను అద్భుతంగా నిర్వహించేందుకు నాట్స్ జాతీయ కార్యవర్గం పూర్తి సహకారం అందిస్తుందని నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ అన్నారు.
తొలుత గా జరిగిన సమావేశం లో శ్రీనివాస్ మంచికలపూడి ఫైనాన్సియల్ స్టేటస్ రిపోర్ట్ ను సభకు వివరించారు. గత సంవత్సర కాలం లో నాట్స్ చాఫ్టర్ల అభివృద్ధి, హెల్ప్ లైన్ ద్వారా ఇప్పటివరకు చేసిన సేవల వివరాలను, వెబ్ మరియు మీడియా పరమైన కార్యక్రమాలపై సంతృప్తి ని వ్యక్తం చేస్తూ ఇందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరిని అభినందించారు. సంబరాలతో పాటు ఈ ఏడాది నాట్స్ చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. .
తెలుగురాష్ట్రాల్లో కూడా నాట్స్ చేపట్టాల్సిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి రవి ఆలపాటి వివరించారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ పదవుల్లోకి వాషింగ్టన్ నుండి నాట్స్ చాప్టర్ సమన్వయ కర్త మాణిక్య లక్ష్మి లింగా, చికాగో నుండి ప్రవీణ్ మోటూరు, ఫణి రామినేని, డా. చౌదరి ఆచంట లను తీసుకున్నారు.
సంబరాలకు మద్దతుగా అమెరికాలో ప్రధాన నగరాల్లో చేపట్టాల్సిన నిధుల సమీకరణ కార్యక్రమాలపై నాట్స్ బోర్డు చర్చించింది.. సంబరాల వేదికను కూడా నాట్స్ జాతీయ కార్యవర్గం పరిశీలించింది. స్థానికంగా ఉండే తెలుగు యువతను సంబరాల్లో భాగస్వాములను చేసేందుకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహరించేందుకు నాట్స్ బోర్డు స్థానిక నాట్స్ విభాగానికి, సీ.టీ.ఏ కు సూచనలు చేసింది. చికాగో లో జరిగే అతి పెద్ద తెలుగు సంబరం కావడంతో ఏర్పాట్లకు ఢోకా లేకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కూడా వీలైనంత త్వరగా నివేదికను నాట్స్ తయారు చేయనుంది. నాట్స్ సంబరాల కోసం జరిగిన ఈ సన్నాహక సమావేశంలో నాట్స్ జాతీయ కార్యవర్గం నుంచి శేఖరం కొత్త, డా. శ్రీనివాస రావు కొడాలి, గంగాధర్ దేసు, శ్రీనివాస్ గుత్తికొండ, కిషోర్ కంచర్ల, మధు బోడపాటి, రాజేంద్ర మాదాల, రంజిత్ చాగంటి, సాయి ప్రభాకర్ ఎర్రాప్రగడ, బసవేంద్ర సూరపనేని, రమేష్ నూతలపాటి, విష్ణు వీరపనేని, బాపు నూతి, మురళీ కృష్ణ మేడిచెర్ల, రాజ్ అల్లాడ , శ్రీహరి మందాడి, శ్రీనివాస రావు కొమ్మినేని, కృష్ణ కొత్తపల్లి, కోటేశ్వర రావు బోడేపూడి, చికాగో సి.టీ.ఏ నాట్స్ నాయకత్వం నాగేంద్ర వేగే, రమేష్ మర్యాల,మదన్ పాములపాటి, రావ్ ఆచంట, ప్రవీణ్ ,మోటూరు, ఫణి రామినేని, విజయ్ వెనిగళ్ల, మూర్తి కొప్పాక, మహేష్ కాకర్ల, ప్రసాద్ తాళ్లూరు, శ్రీనివాస్ చుండు, విజయ్ గన్నే తదితరులు హాజరయ్యారు.
సాయంత్రం 6 గం. లకు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కార్యదర్శి రమేష్ నూతలపాటి అద్యక్షతన జరిగింది. నాట్స్ వైస్ ప్రెసిడెంట్స్ సాయి ఎర్రాప్రగడ, బసవేంద్ర సూరపనేని తదితర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు హాజరైన ఈ సమావేశం లో డొమెస్టిక్ ఫ్యామిలీ వయోలెన్స్ ఇష్యూస్, డివోర్స్ వంటి అంశాలపై, వాషింగ్టన్ DC చాప్టర్ కోఆర్డినేటర్, ఈ రోజే నాట్స్ బోర్డు మెంబర్ గ ఎన్నికైన లక్ష్మీ లింగ ప్రసంగించారు.
డొమెస్టిక్ ఫ్యామిలీ వయోలెన్స్ వంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై అందరూ చర్చించి, అందుబాటులో ఉన్న అటార్నీ లతో ఒక గ్రూప్ ను సమన్వయ పరచి వారిద్వారా అవసరార్థులకు పరిష్కారాన్ని అందించాలని నిర్ణయించారు.
డిట్రాయిట్ నుండి వచ్చిన కృష్ణ కొత్తపల్లి మాట్లాడుతూ, ఈ పై అంశాలకు సంబంధించిన సమన్వయ కర్తలను నాట్స్ రివార్డ్ కార్డు తో అనుసంధానం చేయాలని సూచించారు.
సి.టి.ఏ ప్రెసిడెంట్ & నాట్స్ చికాగో చాప్టర్ కోఆర్డినేటర్ నాగేంద్ర వేగే మరియు తన బృందం, వాలంటీర్లు అద్భుతుమైన ఆతిధ్యమిచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వచించి నందుకు ప్రతీ ఒక్కరూ నిర్వాహకులను అభినందించారు. నాగేంద్ర వేగే మాట్లాడుతూ ఇది ఏ ఒక్కరి విజయమోకాదు, టీం ఎఫర్ట్ అంటూ కృతజ్ఞతలు తెలియచేసారు.