To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
3 May 2018
USA
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ టెంపాలోని ఫ్లోరిడాలో తెలుగువారి రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. స్థానికంగా జరుగుతున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని సురక్షితంగా ఉండటం ఎలా అనే దానిపై అవగాహన కల్పిచేందుకు నడుంబిగించింది. ఈ క్రమంలోనే క్రైమ్ ప్రివెన్షన్అండ్ యాక్టివ్ షూటర్ ప్రిపేరేడ్ నెస్ వర్క్ షాఫ్ ఏర్పాటు చేసింది. ఆకస్మాత్తుగా చేసే దాడుల పట్ల ఎలా వ్యవహారించాలి. ఎలా తమను తాము కాపాడుకోవాలనే దానిపై ఇందులో ప్రధానంగా అవగాహన కల్పించారు. చైల్డ్ అండ్ యూత్ సేఫ్టీ, కమ్యూనిటీ పార్టనర్ షిప్స్, ట్రాఫిక్ స్టాప్, కాప్స్ ఎట్ యువర్ ఫ్రంట్ డోర్, అనే అంశాలపై స్థానిక రక్షణ అధికారులు డిప్యూటీ జాన్ ఫుట్ మ్యాన్ అవగాహన కల్పించారు. ఈ వర్క్ షాపుకు వచ్చిన వారి ప్రశ్నలకు కూడా పోలీసు అధికారులు సమాధానాలు ఇచ్చి.. ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. అమెరికాలో ఎలా మనం భధ్రంగా ఉండాలనే ఈ సదస్సు ద్వారా అవగాహన కల్పించారు.
ఈ సదస్సు లో 40 కి పైగా అడిగిన ప్రశ్నలకు పోలీసులు
అందించిన వాటిలో కొన్ని మీకోసం..
మొదటి ప్రశ్న: మనం ఉన్న లొకేషన్ వివరాలు పోలీసులకు ఎలా చేరుతాయి?
జవాబు: 911కి ఫోన్ చేసిన వ్యక్తి తాలూకు చివరి సిగ్నల్ పాయింట్ ఆధారంగా సెల్ టవర్ లొకేషన్‌ను కనిపెట్టడం జరుగుతుంది. అలాగే, చివరి కాంటాక్ట్ వివరాలు కూడా పోలీసుల వద్ద రికార్డ్ అవుతాయి. దాని ఆధారంగా ఆపదలో ఉన్న వ్యక్తిని పోలీసులు రక్షిస్తారు.
రెండవ ప్రశ్న: డ్రైవింగ్ లైసెన్స్ ఇంటి వద్దే మరిచిపోయి వస్తే పరిస్థితి ఏంటి?
జవాబు: లెసెన్స్ లేకుండా రోడ్డు మీద డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరం. అలాంటి సమయంలో పోలీసులు జరిమానా విధిస్తారు. ఆ సమయంలో మంచి యాటిట్యూడ్‌తో ఉంటూ.. దురుసుగా ప్రవర్తించకుండా పద్దతిగా మాట్లాడితే ఒక్కోసారి పోలీసులు జరిమానా విధించకుండా వదిలేస్తారు.
మూడవ ప్రశ్న: రోడ్డు మీద నియంత్రణ లేకుండా.. దురుసుగా వాహనం నడిపే వారి పట్ల ఎలా వ్యవహరిస్తారు?
జవాబు: రోడ్డు మీద దురుసుగా వెళ్లే వారిని పట్టించుకోకపోవడం మంచిది. వారి దారిలో వారు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలి. దాని వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండకపోవచ్చు. ఒకవేళ పిల్లి ఎలుకలాగా ఎదుటి వ్యక్తి దూకుడుగా వెళ్తున్నాడు కదా అని మీరు కూడా అలాగే వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నాలుగో ప్రశ్న: స్కూళ్లో కాల్పులు జరిగాయన్న విషయం తెలిస్తే పిల్లల తల్లిదండ్రులు ఏం చేయాలి?
జవాబు: కాల్పులు జరిగాయన్న వార్త వినగానే తల్లిదండ్రులు స్కూల్ వైపు రాకూడదు. అప్పటికే ఆ పరిసర ప్రాంతాల రోడ్లన్నీ పోలీసుల కోసం మూసివేయబడి ఉంటాయి. పరిస్థితి అదుపులోకి వచ్చి, పోలీసులు ప్రకటించే వరకు తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉండడమే ఉత్తమం.
ఐదవ ప్రశ్న: పోలీసులు దర్యాప్తు లేదా తనిఖీలకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి?
జవాబు: పోలీసుల ముందు హఠాత్తుగా కదలడం లాంటివి చేయకూడదరు. చేతులు కదల్చకూడదు. చేతులను స్టీరింగ్ మీద గాని, పైకి లేపి ఉంచాలి తప్ప జేబులో పెట్టుకునే ప్రయత్నం చేయకూడదు. ఉన్న పొజిషన్ మారకూడదు. ఎదుటి వ్యక్తి దాడికి దిగుతాడా, మంచి వాడా అనేది ఆ సమయంలోని ప్రవర్తనను బట్టి పోలీసులు అంచనాకు వస్తారు.
ఆరో ప్రశ్న: ఆభరణాలను ఎలా భద్రపరుచుకోవాలి?
జవాబు: విలువైన నగలను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం అత్యుత్తమం. ఆభరణాలను డిపాజిట్ చేసేందుకు వెళ్లే సమయంలో ఒక్కరే వెళ్లడం కంటే ఇద్దరు ముగ్గురితో కలిసి వెళ్లడం ఉత్తమం. అది కూడా రాత్రి వేళల్లో కంటే పగటి పూట అయితేనే మంచిది. లేదంటే దొంగలు నగలను దోచుకునే ప్రమాదం ఉంది.
ఏడో ప్రశ్న: స్కూల్‌లో కాల్పులు జరుగుతాయన్న బెదిరింపులు వచ్చినప్పుడు పిల్లలను పంపించడం మంచిదేనా?
జవాబు: అలాంటి సమయంలో పిల్లల్ని స్కూలుకు పంపించడం సబబే. కాల్పులు జరిపే వ్యక్తి ఎక్కడున్నారనే విషయాలు పిల్లలు చెబుతారు. ఒకవేళ బెదిరింపు కాదు నిజమైన సంఘటన జరిగితే.. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పిల్లలు దోహదపడతారు.
ఎనిమిదవ ప్రశ్న: హైవే మీద వెళ్తున్నప్పుడు పోలీసులు వెంబడిస్తున్నారని తెలిస్తే ఏం చేయాలి?
జవాబు: అలాంటి సమయంలో సాధారణ వేగంతోనే వాహనాన్ని నడపాలి. ఆ సమయంలో ఏం చేస్తున్నా సరే చాలా క్యాజువల్‌గా ఉండాలి తప్ప పోలీసులను చూసి కంగారు పడకూడదు. ఆ సమయంలో కూడా వాహనాన్ని నడుపుతున్నప్పుడు రూల్స్ పాటించాలి. అప్పుడే ఎటువంటి జరిమానా కట్టాల్సిన అవసరం ఉండదు.
తొమ్మిదవ ప్రశ్న: వాహనాన్ని నెమ్మదిగా నడిపినా సరే పెనాల్టీ కట్టాల్సి ఉంటుందా?
జవాబు: కొన్ని సందర్భాల్లో వాహనాన్ని నెమ్మదిగా నడపడం వల్ల కూడా జరిమానా కట్టాల్సి రావొచ్చు. నిర్దేశించిన వేగానికంటే స్లోగా నడిపినప్పుడు ట్రాఫిక్ జామ్ అవడానికి కారణం అవుతారు. అలాంటప్పుడు జరిమానా విధిస్తారు.
పదవ ప్రశ్న: 911కి ఫోన్ చేసినప్పుడు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది?
జవాబు: ఎవరి మీదైనా దాడి జరుగుతున్నప్పుడు ఆ ఘటన వివరాలను చెప్పాలి. దాడి చేసే వ్యక్తి తాలూకు సమాచారం ఇవ్వాలి. అతని కళ్లు, జుట్టు రంగు, ముఖము, పర్సనాలిటీ వివరాలు తెలియజేయాలి. కాల్ చేసిన వ్యక్తి సురక్షిత ప్రదేశంలో ఉన్నాడో లేదో కూడా చెప్పాలి.