To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
06 August 2016
USA
New Jersey Telugu Association (NJTA) completed their third program a 7 day Music workshop followed by a Grand Music concert by famous Tollywood Singer and Music Director Partha Sarathy (Parthu) Nemani in Sree Venketeswara Temple Auditorium Bridgewater, New Jersey.
The seven day workshop in association with Keerthana Academy of Music was attended by 40 students and was conducted in two sessions by Parthu Garu. Students had the privilege of learning variety of songs in styles ranging from Annamacharya & Ramadasu Keertanas, Movie, Folk songs and Lalitha Sangeetham. Parthu Garu imparted not only music but also various techniques of Karaoke Singing such as writing score and notes. All the participants including the youngest six year old participant were proficient at singing all the 9 songs and following the music techniques by the end of the camp. The results were flawless on stage. End result proved astounding successful camp by Parthu Garu and our very own NJ kids. NJTA is blooming and establishing our own local talent via camps like this!!!!
The Grand Finale Music Concert was performed by Parthu Garu and NJTA workshop students non –stop for 3 hours. NJ audience of more than 500 people enjoyed the soulful melodious songs by Parthu Garu. Parthu Garu opened his concert with SHREE GANESHAYA DHIMAHI and after entertaining audience for more than 90 minutes with SPB melodies such as Aa Devi lo virisina , Sirimalle neeve concluded the concert with the powerful PUNYA Bhumi na desam namo namami. The concert was attended by famous poet and Lyricist Sri Vadepalli Krishna Garu. Sri Krishna Garu in his speech said that NJTA is doing a commendable service to Telugu Culture by encouraging programs of such caliber. The attendees included community leaders and supporters Damu Gedala, Ram and Girija Kolluri.
Speaking on the camp inauguration day, NJTA President Chinna Vasudeva Reddy Garu promised that NJTA will continue to conduct programs like this in pursuit of their goal to make a difference and bring the homeland close to Telugus! Parthu Garu thanked Chinna Vasudeva Reddy Garu for supporting him and for coming forward to organize this event through the NJ Telugu Association.
NJTA committee members consisting of Manju Bhargava, Bindu Madiraju, Anuradha Arun, Veni Chinna , Sarala Komaravolu , Ujwal Khastala, Srikanth Sodgam honored Parthu Garu at the grand finale. Speaking at the event secretary Manju Bhargava expressed her gratitude to Parthu Garu for his sincere efforts to impart music knowledge to American Youth and requested him to render his services in coming years.
న్యూ జెర్సీ తెలుగు అసోసియేషన్ మ్యూజిక్ వర్క్‌షాప్
న్యూ జెర్సీ తెలుగు అసోసియేషన్ (ఎన్‌జెటిఎ) 7 రోజుల మ్యూజిక్ వర్క్‌షాప్‌ని ఘనంగా నిర్వహించింది. ప్రముఖ తెలుగు సినీ గాయకుడు, సంగీత దర్శకుడు పార్ధసారధి నేమాని (పార్ధు) నేతృత్వంలో జులై 25న బ్రిడ్జ్‌వాటర్, న్యూ జెర్సీలోని శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ఆడిటోరియంలో గ్రాండ్ మ్యూజిక్ కాన్సెర్ట్ జరిగింది. కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఏడు రోజుల వర్క్‌షాప్‌కి 40 మంది విద్యార్థులు హాజరయ్యారు. పార్ధుగారి సారధ్యంలో రెండు సెషన్స్‌గా ఈ వర్క్‌షాప్ నిర్వహించబడింది. అన్నమాచార్య, రామదాసు కీర్తనలు, సినిమా పాటలు, ఫోక్ సాంగ్స్, లలిత సంగీతం వంటి విభాగాల్లో పార్దుగారి నుంచి విద్యార్థులు అనేక మెలకువల్ని తెలుసుకున్నారు. కరోక్ సింగింగ్‌లో పలు టెక్నిక్స్‌ని ఈ సందర్భంగా విద్యార్థులకు పార్దుగారు నేర్పించారు. విద్యార్థుల్లో ఆరేళ్ళ స్టూడెంట్ నుంచి వివిధ వయసులవారున్నారు. లోకల్ టాలెంట్‌ని వెలికి తీసేందుకు న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ పార్ధు గారి ద్వారా చేపట్టిన ఈ వర్క్‌షాప్ పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు.
గ్రాండ్ ఫినాలె మ్యూజిక్ కాన్సెర్ట్‌లో పార్ధుగారు మరియు ఎన్‌జిటె వర్క్‌షాప్ స్టూడెంట్స్ అద్భుతంగా తమ టాలెంట్‌ని చాటుకున్నారు. మూడు గంటలపాటు నాన్‌స్టాప్‌గా ఈ కాన్సెర్ట్ ఆహూతుల్ని అలరించింది. శ్రీ గణేశాయ ధీమతీ అనే సాంగ్‌తో పార్ధుగారు ఈ కాన్సెర్ట్‌ని ప్రారంభించారు. 'ఆ దివిలో విరిసిన..', 'సిరిమల్లె నీవే..' వంటి పాటలతోపాటు 'పుణ్యభూమి నాదేశం నమో నమామి..' వంటి దేశభక్తిగీతాలతో కాన్సెర్ట్ కొత్త జోష్‌ని సంతరించుకుంది. కవి మరియు ప్రముఖ లిరిసిస్ట్ వడ్డేపల్లి కృష్ణగారు ఈ కార్యక్రమానికి హాజరై, తెలుగు సంస్కృతీ సంప్రదాయాల్ని విదేశాల్లోనూ చాటిచెబుతున్నందుకు ఎన్‌జెటిఎ నిర్వాహకుల్ని అభినందించారు. దాము గేదెల, రామ్ మరియు గిరిజా కొల్లూరి తదితర సపోర్టర్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఎన్‌జిటె ప్రెసిడెంట్ చిన్న వాసుదేవరెడ్డిగారు మాట్లాడుతూ, ఎన్‌జెటిఎ ఇలాంటి కార్యక్రమాల్ని మరిన్ని నిర్వహిస్తుందని అన్నారు. తెలుగువారికి స్వదేశంలో ఉన్న అనుభూతిని కల్గించడంలో తమవంతు కృషి చేస్తామని చెప్పారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకుగాను ఈ సందర్భంగా చిన్న వాసుదేవరెడ్డిగారికి పార్ధుగారు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌జెటిఎ కమిటీ సభ్యులు మంజు భార్గవ, బిందు మాదిరాజు, అనురాధా అరుణ్, వేణి చిన్నా, సరళ కొమరవోలు, ఉజ్వల్ ఖస్టాల, శ్రీకాంత్ సొద్గామ్ పార్ధుగారిని సత్కరించారు. పార్ధుగారు అమెరికన్ యువతకి సంగీతంలో మెలకువలు నేర్పేందుకు చేసిన కృషిని అభినందించారు ఎన్‌జెటిఎ సెక్రెటరీ మంజు భార్గవ.