pizza
NRIs solidarity with the Farmers in India
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

21 September 2015
Hyderabad

NRIs in the USA expressed their support and solidarity with the farmers committing suicide in Telugu states and appealed farmers not to commit suicide. In support of solidarity event happened in Hyderabad yesterday, NRIs met in 11 cities across the USA and showed their concern towards dying farmers and came forward to provide any support they can. Event was organized by volunteers in Austin, Boston, Chicago, Fremont, Los Angeles, Michigan, Minneapolis, Philadelphia, New Jersey and San Fransisco Bay Area, Washington, DC. All through these events, NRIs raised slogans “Raithuloo aatmahatyalu vaddu, meeku andagaa memu untaam”

NRIs from all walks of life participated in these events voluntarily and discussed the core issues and reasons for large number of farmers committing suicide. They also expressed their concern with the policies affecting farmers directly and indirectly. NRIs from various cities made appeal to the government to implement M.S. Swaminathan commission’s guidelines for fair pricing of agriculture produce, integrate NREGS with agriculture, conduct soil tests on all agricultural lands, implement complete loan waiver immediately, extend agriculture equipment subsidy to the small farmers, and implement crop insurance with each village as an unit, provide proper storage facilities with spot loans features.

NRIs also appealed to the farmers not to grow water-intensive commercial crops every season, adapt sustainable methods and alternative food crops. This way, input costs can be controlled and family can have food at least, if crop fails. Some NRIs pledged support for the families of farmers who committed suicide, providing education for the children and helping families with basic needs.

Event in 11 cities was coordinated by local volunteers. Dushant Reddy and Santosh Pulluru from Austin, Ramesh Nallavolu from Boston, Mukesh Thumma and Srinivas Palthepu from Chicago, Kiran Karnati from Detroit, Abhishek Doddaand Santosh from Fremont, Srihari and Sreekanth from Los Angeles, Srinivas reddy from Minneapolis, Sravanth Poreddy, Srikar and Akshay from new Jersey, Ravi Mayreddy and Babu Bayyana from Philadelphia, Vinoy Mereddy in San Fransisco Bay Area, Suresh Ediga in Washington, DC coordinated this event, many volunteers supported them in organizing it on the same day across the USA.

రైతులకు అండగా ప్రవాసులు

మాతృభూమిలో జరుగుతున్న ఆత్మహత్యలను గమనించి, అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు తమ ఆందోళన వ్యక్తం చేస్తూ, రైతులకు తమ మద్దతు మరియు సంఘీభావం ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తమ వంతు సహాయాన్ని అందిస్తామని, రైతుల కోసం పని చేస్తున్న స్వచ్చంద సంస్థలకు తమ సహకారం అందిస్తామని ప్రతిజ్ఞలు చేసారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు సంఘీభావంగా నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రదర్శనను స్పూర్తిగా తీసుకొని, అమెరికా అంతటా 11 నగరాల్లో ప్రవాసులు సమావేశాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేసుకొని రైతులు మరణిస్తున్న తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా, అన్నిచోట్లా ఎన్నారైలు "రైతులూ ఆత్మహత్యలు చేసుకోవద్దు, మీకు అండగా మేముంటాం" అని నినాదాలు చేసారు.

ఆస్టిన్, బోస్టన్, చికాగో, ఫ్రీమాంట్, లాస్ ఏంజిల్స్, మిచిగాన్, మిన్నియాపాలిస్, ఫిలడెల్ఫియా, న్యూ జెర్సీ మరియు సాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, వాషింగ్టన్ వంటి వివిధ నగరాల్లో స్వచ్చందంగా ముందుకు వచ్చి ఈ సమావేశాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకోడానికి గల కారణాలను విశ్లేషించడంతో పాటు, రైతులను ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ప్రభావితం చేసే విధానాల మీద చర్చలు జరిపారు.

వివిధ నగరాల ఎన్నారైలు, వ్యవసాయం ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కోసం స్వామినాథన్ కమిషన్ మార్గదర్శకాలను అమలు చెయ్యాలని, వెంటనే పూర్తి రుణమాఫీని అమలు చెయ్యాలని, అన్ని వ్యవసాయ భూములకు భూసార పరీక్షలు నిర్వహించి ఏ పంటలు సాగు చేయాలో రైతులకు శిక్షణ ఇవ్వాలని, వ్యవసాయ పరికరాలు సబ్సిడీని చిన్న, సన్నకారు రైతులకు విస్తరించాలని, ప్రతి గ్రామం యూనిట్ గా పంటల బీమా అమలు చెయ్యాలని, సరైన పంట నిల్వ సౌకర్యాలు, గిడ్డంగులు నిర్మించి వాటి ద్వారా రుణ సదుపాయాలు కల్పించాలని, పనికి ఆహార పధకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చెయ్యాలని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

రైతులు కూడా అధికంగా నీటిని, అధిక పెట్టుబడి వినియోగించే వాణిజ్య పంటలు కాకుండా ప్రత్యామ్నాయ సుస్థిర వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ, ఆహార పంటల వైపు ద్రుష్టి సారించాలని ఎన్నారైలు విజ్ఞప్తి చేసారు. ఈ విధంగా చెయ్యటం ద్వారా పెట్టుబడి ఖర్చులు నియంత్రించడంతో పాటు, పంట విఫలమైతే కనీసం ఆ రైతు కుటుంబం ఆహరం అయినా మిగుల్తుంది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు కనీస అవసరాల కోసం సాహయం అందించడంతో పాటు, వారి పిల్లలకు విద్యను అందించడానికి తమ సహాయం అందిస్తామని కొంత మంది ఎన్నారైలు వాగ్దానం చేసారు.

10 నగరాల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎన్నారైలు స్వచ్ఛందంగా సమన్వయం చేశారు. దుశంత్ రెడ్డి మరియు సంతోష్ పుల్లూరు ఆస్టిన్ లో, రమేష్ నల్లవోలు బోస్టన్ లో, ముకేశ్ తుమ్మ మరియు శ్రీనివాస్ పల్తేపు చికాగోలో, కిరణ్ కర్నాటి డెట్రాయిట్ లో, అభిషేక్ దొడ్డ మరియు సంతోష్ లు ఫ్రీమాంట్ లో, శ్రీహరి మరియు శ్రీకాంత్ లు లాస్ ఏంజిల్స్ లో, శ్రీనివాస్ రెడ్డి మిన్నియాపాలిస్ లో, రవి మేరెడ్డి మరియు బాబు బయ్యన లు ఫిలడెల్ఫియాలో, స్రవంత్ పొరెడ్డి, శ్రీకర్, మరియు అక్షయ్ లు న్యూజెర్సీ లో, సాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో వినయ్ మేరెడ్డి, సురేష్ ఏడిగ వాషింగ్టన్ లో ఈ కార్యక్రమాన్ని సమన్వాం చేసారు, వీరితో పాటు అనేక మంది ఎన్నారైలు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి, రైతులకి మద్దతునిచ్చారు.

 


 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved