To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
11 September 2015
Hyderabad
జయప్రదంగా ముగిసిన మూడవ అంతర్జాతీయ వాసవి మహా సభలు.
అమెరికా లోని కొలంబస్ నగరంలో, సెప్టెంబర్ 5, 6 మరియు 7 వ తేదీలలో మూడవ అంతర్జాతీయ మూడవ వాసవి మహా సభలు జయప్రదంగా జరిగాయి. 5 వ తేది సాయంత్రం విందు కార్యక్రమంలో 2500 మంది అతిధులు, కళాకారులు, వ్యాపార వేత్తలు మరియు రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ముందుగా వినాయక స్తుతితో ప్రారంభించి సమావేశాలకు కన్వీనర్ శ్రీనివాస్ ఆకుల మరియు అధ్యక్షుడు రమేష్ కల్వాల అతిధులందరికి ఆహ్వానం పలికారు. విందు కార్యక్రమాలకు అధ్యక్షత వహించిన అశోక్ ఇల్లెందుల ఏర్పాట్ల వివరాల గురించి తెలియ చేసారు. వివిధ రకములైన సాంస్కృతిక కార్యక్రమములతో, నోరూరించే పసందైన వంటకములతో మరియు సంప్రదాయం ఉట్టి పడేలాంటి అలంకరణములు అందరిని ఎంతో అలరించాయి. ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ సిద్ధా రాఘవరావు గారు, జి యమ అర్ సంస్థల చైర్మన్ శ్రీ గ్రంధి మల్లిఖార్జున రావు గారు, తెలంగాణా రాష్ట్ర గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ గణేష్ బిగాల గారు మరియు వ్యాపారవేత్త, సిని నిర్మాత శ్రీ అంబికా కృష్ణ గారు పాల్గొన్నారు. పలువురు నేపధ్య గాయిని గాయికలు సింహ, అనుజ్ గురుద్వారా, అంజన సౌమ్య మరియు సుమంగళి, ప్రసిద్ధ వ్యాఖ్యాతలు హరితేజ, లాస్య, రఘు వేముల మరియు సిని నటి విమల రామన్, హేమ, బుల్లి తెర హీరో ప్రభాకర్ అతిదులన్దరిని ఉత్సాహంతో ఉర్రూత లూగించారు.
ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ గ్రంధి మల్లిఖార్జునరావు (జి యమ్ ఆర్ ) గారు బిజినెస్ సెషన్ లో ప్రసంగిస్తూ అందరికి సూచనలు అందించి, గెలుపొందిన వారికి బహుమతులు అంద చేసారు. ఆహుతునందరిని ఉద్దేశించి చేసిన ప్రసంగం లో ధర్మం, శీలం మరియు అహింస ల గురించి, సమాజం లో మంచి పౌరులుగా ఎదగుతూ ఒదిగి ఉండాలని తెలియ చేసారు.
రెండవ రోజు ఉదయం శ్రీ విముక్త చైతన్య గారి దివ్య ప్రబోధంతో 3000 మంది అతిధులతో కార్యక్రమాలు మొదలయ్యాయి. సమావేశ ప్రారంభోత్సవ సందర్భంగా శ్రీ సిద్ధ రాఘవరావు గారు ప్రసంగిస్తూ మాతృభూమిని ఎల్ల వేళల ప్రేమించాలని, శక్తివంచన లేకుండా సహాయ సహకారములను అందచేయాలని మరియు ప్రస్తుత సమాజాన్ని ప్రేమిస్తూ భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందించేలా కృషి చేయాలని తెలిపారు.
యన్ అర్ ఐ వి ఏ(NRIVA) మొదటి సారిగా జీవిత సాఫల్య పురస్కారాన్ని వ్యాపారవేత్త మరియు మాజీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవనీయులైన శ్రీ టి జి వెంకటేష్ గారికి, శ్రీ జి యమ అర్, శ్రీ సిద్ధా రాఘవరావు, శ్రీ గణేష్ బిగాల మరియు శ్రీ అంబికా కృష్ణ ల గారి సమక్షం లో ప్రధానం చేయటం జరిగింది. శ్రీ టి జి వెంకటేష్ గారి తరపున వారి కుటుంబ సభ్యులు, వారి సోదరీమణి బావగార్లైన శ్రీమతి వసంత మరియు శ్రీ కిట్టన్న మరియు వృతి రీత్యా డాక్తర్లైన సుంకు జయసింహ మరియు సుంకు ఆశ ఈ అవార్డును అందుకున్నారు.
ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వివాహ పరిచయ వేదిక మరొక ముఖ్య ఆకర్షణగా నిలిచింది. భోజన సదుపాయములు చికాగోలోని హారిక ఫుడ్స్ అధినేత శ్రీ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పది కాలములు గుర్తుండేలా జరిగాయి.