To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
5 June 2014
Hyderabad
పుకీప్సి న్యూయార్క్, మే 31, 2014. “తెలుగు మాటలతో ఆడే ఆట ఏది?” అన్న తిరకాటం ప్రశ్నకు చాల మందికి జవాబు తెలిసే ఉంటుంది. “తెలుగు మాట్లాట” -- సిలికానాంధ్ర మనబడి నిర్వచించి, నిర్వహిస్తున్న పోటీలివి.
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పలుచోట్ల జరుగుతున్న మాట్లాట ఆటల పోటీలు – తిరకాటం, పదరంగం, ఒక్క నిమిషం మాత్రమే – న్యూయార్క్ ష్ట్రంలోని పుకీప్సి పట్టణంలో మే 31న విజయవంతంగా ముగిసాయి. ఈ కార్యక్రమలో 40 మందికి పైగా బాలబాలికలు మాట్లాట ఆటలు ఆడి తమ తెలుగు ప్రతిభాపాటవాలతో కనువిందు గావించారు. ఎంతో క్లిష్టమైన పదాలను అవలీలగా వ్రాయడమే కాకుండా, ఇరకాటం పెట్టే తిరకాటం ప్రశ్నలకు సులువుగా జవాబులిస్తూ ఇక్కడి ప్రవాసాంధ్రుల పిల్లలు అవకాశమిస్తే తెలుగును సుదూర తీరాలలో కూడా అభివృద్ధి చెయ్యగలమని నిరూపించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా విచ్చేసిన న్యూయార్క్ స్టేట్ సెనెటర్ శ్రీ టెర్రీ గిప్సన్ మరియు ఆయన సతీమణి శ్రీమతి మిషెల్ గిప్సన్ విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందించారు. టెర్రీ చాలా సంవత్సరాల తరువాత ఈ నియోజక వర్గం నుంచి గెల్చిన డెమాక్రటిక్ పార్టీ అభ్యర్ధి. నూరు సంవత్సరాలకు పైగా ఇక్కడ రేపబ్లికన్ పార్టీకి చెందిన వారే సేనేటర్లుగా గెలుస్తున్నారు. చాలా కాలం అంటే ఒక శతాభ్దం కంటే ఎక్కువ కాలం తరువాత మొదటి సారిగా గెలిచిన డెమాక్రటిక్, శ్రీ టెర్రీ గిప్సన్ కి ఇది అల్బనీలో మొదటి టర్మ్.
ఈ ఆటలలో విజేతలైన చిన్నారులు:
బుడతలు వయోవిభాగం (5 నుండి 9 ఏళ్ళు):
తిరకాటం:
1) సంశ్రిత పోచనపెద్ది 2) శ్రీయ దానం
పదరంగం:
1) శ్రీయ దానం 2) లయ గొల్లమూడి
ఒక్క నిమిషం మాత్రమే:
1) సిద్ధార్థ్ యెలిశెట్టి 2) సిద్ధార్థ్ అవ్వారి
సిసింద్రీలు వయోవిభాగం (10 నుండి 13 ఏళ్ళు):
తిరకాటం:
1) కార్తీక్ దూసి 2) రిశిత పెద్దిరెడ్డి
పదరంగం:
1) సౌమ్య కొవ్వూరి 2) హర్ష కొలచిన
ఒక్క నిమిషం మాత్రమే:
1) కార్తీక్ దూసి 2) కన్నాతేలుకుంట్ల
చిరుతలు వయోవిభాగం (14 నుండి 16 ఏళ్ళు):
తిరకాటం:
1) మణిదీప్ తేలుకుంట్ల 2) మెహర్ శశాంక్ దూసి
ఈ మాట్లాట సఫలీకృతం కావడానికి ఎందరో తెలుగు భాషాభిమానులు చేతులు కలిపి పనిచేసారు. అంతేకాక ఇక్కడి హిందూ సమాజ్ టెంపుల్ వంటి సంస్థలు, శ్రీమతి & శ్రీ సురేష్ గొల్లమూడి గార్లు, శ్రీమతి & Dr. శశి మాకం గారు, శ్రీమతి & శ్రీ సోమయ్య సోమ గారు, శ్రీమతి & శ్రీ బాలాజీ జిల్ల గారు పోషకులుగా పిల్లల ఆటలకు ఆర్ధిక సహయం చేసి అండగా నిలిచారు. ఈ కార్యక్రమానికి సహాయపడిన న్యాయనిర్నేతలకు, స్వచ్చంద సేవకులకు కూడా టెర్రీ దంపతులు పూల బోకేలందించారు.
ఇందులో పాల్గొన్న చిన్నారులే కాకుండా, న్యాయ నిర్ణేతలుగా మరియు ప్రేక్షకులుగా వచ్చిన ఎంతోమంది తెలుగు వారు ఈ తెలుగాటల పోటీలను ఘనంగా కొనియాడారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మంబడిలో చేర్పించాలనే ఉత్సాహం చూపించారు.
సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో ఈ ఆటలు ఇంకా ఎంతో పైకి ఎదగాలని, ఈ ఆటలు పిల్లలకు తెలుగు నేర్చుకోవడంపై మమకారం పెంపొందించాలని, వారి ప్రతిభా పాటవాలు మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరుకుందాము.