|
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
2 November 2016
USA
ఆంధ్రప్రదేశ్ ఐటీ, సమాచార, తెలుగు భాషా, సాంస్కృతిక శాఖా మాత్యులు పల్లె రఘునాథరెడ్డి అమెరికాలో జరుగుతున్న సిలికానాంధ్ర మనబడి తరగతులని సందర్శించారు. శనివారం నాడు చికాగో నగరంలో, ఆదివారం సాయంత్రం ఇర్వింగ్ (డాలస్) నగరంలోని సిలికానాంధ్ర మనబడి కేంద్రాలని సందర్శించి అక్కడ తెలుగు భాష నేర్చుకుంటున్న ప్రవాస బాలబాలికలతో ముచ్చటించారు. తెలుగు భాషపై విద్యార్థులు సాధించిన ప్రతిభ తనను అబ్బురపరిచిందని పల్లె వెల్లడించారు. గత పదేళ్ళుగా అమెరికాలో, ఇంకా పన్నెండు ఇతర దేశాలలో, పాతికవేలమందికి పైగా పిల్లలకి తెలుగు నేర్పుతున్న మనబడి స్వచ్చంద సేవకులకి , కార్యనిర్వాహకులకి అభినందనలు తెలియజేస్తూ, మనబడి చేస్తున్న కృషికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తమ పూర్తి సహకార అందిస్తామని తెలిపారు. ఇప్పటికే తెలుగు విశ్వవిద్యాలయం, అమెరికాలోని WASC, పలు స్కూల్ డిస్ట్రిక్ట్లలో గుర్తింపు పొందిన విద్యావిద్యావిధానం గా మనబడి సాధించిన ప్రగతిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. మనబడి ఉపాధ్యాయులకి తాము నేర్పే తెలుగు భాషనే కాక, పిల్లల భవిష్యత్తులని కూడా శాశ్వతంగా ప్రభావితం చెయ్యగలిగే అవకాశాన్ని గుర్తు చేశారు. భావి ప్రపంచ పౌరులని తీర్చిదిద్దుతున్నందుకు గర్వించ దగ్గ ప్రతిభ మనబడి గురువులకి ఉందని అభినందించారు. తెలుగు భాషకి అమెరికన్ బోధనాపద్ధతులలో ప్రపంచ భాషగా గుర్తింపు తేవడంలో మనబడి జట్టు సాధిస్తున్న ప్రగతి ప్రశంసనీయం అని మంత్రి అన్నారు. చికాగోలో వెంకట్ గంగవరపు, పద్మ, కిరణ్ మట్టె డాలస్ లో మడక ప్రేమ్ కుమార్ మరియు వారి జట్టు సభ్యులైన అక్కల మోహన్, చెన్నుపాటి రజని, పల్లె రఘునాథ్ గారిని, వారితో పాటు అమెరికాలో ఐటి అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న నంద్యాల మహేశ్, తాళ్ళంకి శ్రీధర్ లని సన్మానించారు. మంత్రివర్యులు పల్లె రఘునాధరెడ్డి ని మనబడి ప్రాచుర్యం ఉపాధ్యక్షులు రాయవరం విజయ భాస్కర్, సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మనబడి అద్యక్షులు రాజు చమర్తి,ఉపాడ్యక్షులు శరత్ వేట మాట్లాడుతూ ఈ ఏడాది మనబడిలో 7500 మంది దాకా పిల్లలిప్పటికే మనబడిలో చేరారని, ఇంకా 4-6 ఏళ్ళ వయసుగల పిల్లలు "బాలబడి"లో చేరవచ్చునని తెలియజేశారు.వివరాలకు manabadi.siliconandhra.org చూడవచ్చని తెలిపారు.
|
|
|
|
|
|