To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
07 July 2015
Hyderabad
సిలికానాంధ్ర విశ్వ విద్యాలయాన్ని సందర్శించిన ఆంధ్ర ప్రదేశ్ ఐ.టి మంత్రి పల్లె రఘు నాధ రెడ్ది
నవ్యాంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టమని ప్రవాసాంధ్రులను ప్రోత్సహించాటానికి అమెరికా లో పర్యటిస్తున్న మంత్రి పల్లె రఘునాధ రెడ్డి , మిల్పిటాస్ నగరమ్ళొ లోని సిలికానాంధ్ర విశ్వ విద్యాలయ కార్యాలయంలో ప్రముఖ కంపెనీల యజమానులతో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి నాయకత్వంలో నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రణాళిక లు రచించబడినాయని, ప్రవాస భారతీయులు ముఖ్యంగా తెలుగు వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి ఇదే సరయిన తరుణమని , వారికి ప్రభుత్వ పరంగా లభించబోయే ప్రోత్సాహాలను, రాయితీలను వివరంగా తెలియచేసి, పారిశ్రామిక వేత్తలు లేవనెత్తిన పలు సందేహాలకు ఓపికగా సమాధానమిచ్చి వారిని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. ఈ సమావేశానికి పలు ప్రముఖ కంపెనీల అధిపతులు హాజరయ్యారు. అనంతరం మంత్రిని సిలికానాంధ్ర అధ్యక్షులు సంజీవ్ తనుగుల ,కూచిపూడి నాట్యారమం చైర్ మెన్ ఆనంద్ కూచిభొట్ల, ,ప్రభ మాలెంపాటి తదితరులు సంప్రాదాయ రీతిలో సత్కరించారు. ఈ కార్యక్రమం లో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వ్యవస్థాపక సభ్యులు రాజు చమర్తి, దిలీప్ కొండిపర్తి, దీనబాబు కొండుభట్ల, అజయ్ గంటి తో పాటు, సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు రవీంద్ర కూచిభొట్ల, కిషోర్ బొడ్డు,మృత్యుంజయుడు తాటిపాముల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మనబడి ద్వారా దాదాపు నాలుగు వేల అయిదు వందల మంది విద్యార్ధులకు తెలుగు వ్రాయటం,చదవటం మరియు మాట్లాడటం నెర్పుతూ ,తెలుగు భాష ను పరిరక్షించటానికి సిలికానాంధ్ర చేస్తున్న కృషిని ప్రసంసించారు. , ఇది ప్రపంచ వ్యాప్తం గా నివసిస్తున్న ఎన్నో వేల తెలుగు వారికి మేలు చేస్తున్న గొప్ప కార్యక్రమం గా అభివర్ణించారు.