To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
21 October 2016
Hyderabad
భారతీయ కళలు మరియు భాషలలోని గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచెప్పాలనే సంకల్పంతో, అమెరికా లోని కాలిఫొర్నియా రాష్ట్రంలో ప్రారంభించిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం, 2017 జనవరి నెలలో కూచిపుడి మరియు కర్నాటక సంగీతంలో మాస్టర్స్, డిప్లొమా మరియు సర్టిఫికెట్ కోర్సులలో తరగతులు ప్రారంభించింది.
అమెరికా వ్యాప్తంగా భరతనాట్యం కోర్సులలో చేరటానికి విద్యార్ధులు కనబరుస్తున్న అదరణను దృష్టిలో పెట్టుకొని, జనవరి 2018 నుంచి తరగతులు ప్రారంభించటానికి కాలిఫోర్నియా రాష్ట్ర విశ్వవిద్యాలయాల అనుమతుల సాధికారక సంస్థ BPPE వారి నుంచి అనుమతి సాధించినట్లు చీఫ్ ఎకాడమిక్ ఆఫీసర్ రాజు చమర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి,భారతీయ భాషలు మరియు కర్నాటక సంగీతానికి సంబంధించిన వివిధ వాద్య సంగీతం కోర్సులను కూడా ప్రారంభించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు విశ్వవిద్యాలయ ముఖ్య అర్ధిక నిర్వహణాధికారి (CFO) దీనబాబు కొండుభట్ల తెలిపారు.
విశ్వవిద్యాలయం భరతనాట్యంలో కోర్సులు ప్రారంభించటానికి అనుమతులు సాధించటం పట్ల, ఈ కోర్సుల రూపకల్పనలో కీలకపాత్ర నిర్వహిస్తున్న అకడమిక్ కమిటి చైర్మన్ మరియు విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు డా. పప్పు వేణుగోపాల రావు, భరతనాట్య విభాగానికి అకడమిక్ అడ్వైజరీ సభ్యులు పద్మభూషణ్ సి. వి. చంద్రశేఖర్, విశ్వవిద్యాలయం సి. ఈ. ఓ అనంద్ కూచిభొట్ల, సి.సి.ఓ. దిలీప్ కొండిపర్తి తమ హర్షాన్ని వెలిబుచ్చారు. కోర్సు గురించిన మరిన్ని వివరాలు, మరియు నమోదు కోసం www.universityofsiliconandhra.org చూడవచ్చు.