సాటి మనిషిలోనే దేవుడిని చూడమని చెప్పిన ఆ షిరిడీ నాధుడి బాటలోనే న్యూజెర్సీ సాయి దత్తపీఠం అడుగులు వేస్తోంది.. సాయి చెప్పిన సేవా మార్గాన్ని తు.చా తప్పకుండా పాటిస్తోంది. ఈ క్రమంలోనే అనాధ పిల్లలకు చేయూత అందించేందుకు సాయిదత్త పీఠం సాయి భక్తులకు పిలుపునిచ్చింది.
భారతదేశంలో అనాధ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు తమదైన సాయం చేయాలని తలంచిన సాయి దత్త పీఠం పిలుపు నిచ్చిన కేవలం 2 గంటల వ్యవధిలో భక్తులకు తమకు తోచిన సాయం చేయాలనే సేవా మార్గం వైపు నడిపిస్తోంది.
సాయి దత్త పీఠం నుంచి ఆ విరాళాలను అనాధ పిల్లల జీవితాల్లో కాంతులు నింపేందుకు వినియోగించనున్నారు. ఈ విరాళాల సేకరణలో స్థానిక ఆర్ట్ అఫ్ లివింగ్ సభ్యులు శ్రీమతి బబిత, రమ లు కీలక పాత్ర పోషించారు. ఓవర్సీస్ వాలంటీర్ ఫర్ బెటర్ ఇండియా(OVBI) కొరకు ఈ నిధుల సేకరణ చేపట్టారు.
ఈ క్రమంలోనే 1,400 డాలర్లను మహిళా సాయి భక్తులు విరాళాలుగా సేకరించారు.
ఇక నుంచి తాము ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఇతోధిక సాయం చేయడంలో ముందుంటామని సాయి దత్త పీఠం నిర్వహకులు బ్రహ్మశ్రీ రఘు శర్మ శంకరమంచి తెలిపారు.
సాటి మనిషికి సాయం అందించడమే సాయి తత్వమని..ఈ మార్గంలోనే సాయి దత్త పీఠానికి వచ్చే భక్తులు నడవడం ఆనందంగా ఉందని తెలిపారు.