To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
29 November 2016
Hyderabad
అమెరికాలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం శివ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించింది. కార్తీక మాసం పూర్తి కావస్తున్న తరుణంలో సాయి దత్త పీఠం శివారాధనకు పెద్దపీట వేస్తూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించింది. గణపతి హోమంతో పూజలు ప్రారంభించింది. ఆ పరమశివుడికి రుద్రాభిషేకం, బిల్వార్చన, శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించింది. కార్తీక మాసమంతా ప్రత్యేక పూజలతో ఆ అమరేశ్వురుడిని కొలిచిన సాయిదత్తపీఠం మాస శివరాత్రినాడు శివపార్వతుల కల్యాణంతో శివ భక్తులకు భక్తి పారవశ్యాన్ని పంచింది. దాదాపు 300మందికి పైగా శివభక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యాక్రమంలో పాల్గొన్నారు.. దాదాపు 30 మంది రిత్విక్కులు శివనామ స్త్రోత్రాలతో సాయి దత్త పీఠం మారు మ్రోగింది. సాయి దత్త పీఠంలో చేపట్టిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్తీక మాసంలో శివారాధనను సంప్రదాయంలా కొనసాగించే భారతీయ హిందు భక్తులకు సాయి దత్త పీఠం ఓ వేదికగా మారిందని.. భక్తి ప్రవాహాన్ని కొనసాగించే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని భక్తులు కొనియాడారు. ఈ శివకల్యాణానికి న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమీషనర్ ఉపేంద్ర చివుకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. శివారాధనలో పాల్గొన్నారు. అనంతరం, రుద్రాభిషేకం నిర్వహించిన చాగంటి అనంత్ గారు, విష్ణుభొట్ల మూర్తి గారు ఇతర రుత్విక్ లను సాయిదత్త పీఠం సత్కరించింది.