|

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
05 September 2016
USA
సాయి మార్గమే లక్ష్యంగా సాయి దత్తపీఠంలో బ్యాక్ టూ స్కూల్ కార్యక్రమం జరిగింది. న్యూజెర్సీ లోని సాయి దత్త పీఠం ఆ సాయి చూపిన చతుర్విద మార్గాలను తుచా తప్పకుండా పాటిస్తుంది. నిత్యఅన్నదానం, సత్సంగ్, వితరణ, విద్య ఈ నాలుగింటిని తన ప్రధాన బాధ్యతలుగా భావిస్తున్న సాయి దత్త పీఠం. పేద పిల్లలకు స్కూలు బ్యాగులు, పుస్తకాలు, పెన్సిళ్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతియేటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సాయి మార్గంలో పయనిస్తుంది. సాయి దత్త పీఠం కేవలం పూజలు, సాయి భజనలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలకు కూడా వేదికగా మారింది. బ్యాక్ టూ స్కూల్ కార్యక్రమానికి న్యూజెర్సీ అసెంబ్లీ సభ్యులు ఉపేంద్ర చివుకుల, స్థానిక ప్రముఖులు రమణారెడ్డి, బీజేపీ నాయకులు విలాసరెడ్డి హజరయ్యారు. సాయి భక్తుల నుంచి సేకరించిన పుస్తకాలు, పెన్నులు, బ్యాగులను స్థానిక సౌత్ ప్లయిన్ పీల్డ్ స్కూలుకు అందించారు. సౌత్ ప్లయిన్ పీల్డ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్, మిడిల్ స్కూల్ పీటీఓ ప్రెసిడెంట్ డెబ్బీ కోయిలీ ,పాప్ వార్నర్ వుట్ బాల్ కోచ్ స్టెఫిన్ బార్ప్ వెల్లి ఈ కార్యక్రమానికి హజరై పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు తదితర సామాగ్రిని స్వీకరించారు. వరుసగా మూడో సంవత్సరం సాయి దత్త పీఠం ఈ బ్యాక్ టూ స్కూల్ కార్యక్రమం నిర్వహించింది. సాయి దత్త పీఠానికి వచ్చిన అతిధులకు, భక్తులకు తీర్ధ ప్రసాదాలను మురళీ మేడిచెర్ల పంపిణి చేశారు.



|
|
|
|
|
|