
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
07 October 2013
Hyderabad
వినూత్నంగా జరిగిన సిలికానాంధ్ర ఆంధ్ర సాంస్కృతికోత్సవం
విశ్వశాంతి-విశ్వప్రేమ ఇతివృత్తంతో రూపొందించబడిన సిలికానాంధ్ర ఆంధ్ర సాంస్కృతికోత్సవం క్యుపర్టినో నగరంలోని ప్రతిష్ఠాత్మకమైన ఫ్లింట్ సెంటర్లో విజయవంతంగా జరిగింది. మారేపల్లి వెంకటశాస్త్రి వేదపఠనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మొదట చిన్నారులు తమ ప్రతిభలను కనపరుస్తూ రూపొందించిన వీడియో చిత్రాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. మాధురి కిశోర్ గారు రూపొందించిన జయహో నవదుర్గా కూచిపూడి నాట్యప్రదర్శనలో నవ దుర్గలను ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది. దుస్తులపై ఎల్ ఈ డీ లైట్లను ధరించి శాంతి, ప్రేమలను సూచిస్తూ అనూష కూచిభొట్ల సారధ్యంలో జరిగిన దీపశిఖర నాట్యం మిరుమిట్లు గొలిపింది. స్నెహ వెదుల సారధ్యంలొ జరిగిన జానపద న్రుత్య ప్రధర్సన అంధరిని అకట్టు కున్నది. భారీ సెట్టింగులకు డిజిటల్ పరిజ్ఞానాన్ని జోడించి ఏడాది చిన్నారినుండి నుండి ఎనభై ఏళ్ల తాతయ్య వరకు పాల్గొన్న వంశీ ప్రఖ్య రచించిన శ్రీకృష్ణ లీలామృతం పౌరాణిక నాటకం ప్రేక్షకులను సమ్మోహనపరిచింది.
సిలికానాంధ్ర అధ్యక్షుడు విజయసారధి మాఢభూషి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ సిలికానాంధ్ర భవిష్యత్తులో చేబట్టబోయే క్రియాశీలక కార్యక్రమాలను వివరించారు. సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులైన శ్రీరాం కోట్ని, రత్నమాల వంక, రామకృష్ణ కాజ, రాజశేఖర్ మంగళంపల్లి లను పరిచయం చేసారు. పలు దశాబ్దాలుగా ప్రతి తెలుగింటికి తన సుమధుర స్వరంతో పరిచితురాలైన గానకోకిల, పద్మభూషణ్, పి. సుశీల గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని దిలీప్ కొండిపర్తి ఆధ్వర్యంలో అందించడం ఈ ఉత్సవంలోని పతాక కార్యక్రమం. తెలుగింటి సంప్రదాయంతో సుశీల గారిని ఆహ్వానించి, సత్కరించిన తర్వాత సుశీలగారు కొన్ని భక్తి గేయాలను పాడి తిరిగి గత కాలపు తీయదనాన్ని గుర్తు చేసారు.
విమానప్రయానంలో గిలిగింతలు పెట్టే ఆకెళ్ళ గారి హాస్యనాటిక, చెరుకుపల్లి శ్రీనివాస్ గారి వీణా వాయిద్యం, జానపద నృత్యాలు, తాటిపాముల మృత్యుంజయుడు, శాంతి కూచిభొట్ల సంపాదకత్వంలో సుజనరంజని ప్రత్యేక సంచిక ఆవిష్కరణ ఈ ఉత్సవంలోని ముఖ్యాంశాలు. సూరజ్ దశిక, శ్రీపాద శ్రీనివాస్ రథ సారథ్యంలో, దీనబాబు కొండుభట్ల, రాజు చమర్తి, రవి చివుకుల, రవీంద్ర కూచిభొట్ల, స్నేహ వేదుల, వంశీ ఇందువరపు, మానస అద్దేపల్లి, వంశీ నాదెళ్ళ, వసంత మంగళంపల్లి, శాంతివర్ధన్ అయ్యగారి, సంజీవ్ తణుగుల సహకారంతో రెండు వందల యాభై కళాకారులు పాల్గొని, రెండు వేలకు పైగా ప్రేక్షకులు విచ్చేసి, పదిగంటలకు పైగా జరిగిన ఈ కదంబ కార్యక్రమం పదేపదే మననం చేసుకునేలా జరిగింది.
ఈ ఆనంద సమయంలో సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి సంఘానికి అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ సాన్ హోసే నగర ప్రభుత్వం ఈ సంవత్సరపు సమాజ సేవా పురస్కారాన్ని ప్రకటించిన సమాచారం అందింది.


